గురువారం, డిసెంబర్ 29

తెలుగు అక్షరమాల

               అక్ష రాలను నేర్చు కుంటూ 
               ఆట  లందున శ్రద్ధ జూపీ   
          ఇంటి నెప్పుడు చక్క దిద్దుచు 
          ఈ తరమ్ముకు బాట వేద్దాం !

          ఉ న్న దానిలో దానమిచ్చీ 
          ఊ రు మేలుకు  ఉపక రిద్దాం 
          ఋ తు క్రమ ములొ పంటలేసి
          ఋ (రూ) క లెన్నియో ప్రోగు చేద్దాం ! 


          ఎ న్ని మతములు మనకి యున్నా 
          ఏ ది రాష్టం మతము అయినా 
          ఐ క మత్య మె మనదు మతమని 
          ఒ కరికొకరికి  సాయ పడదాం ! 


          ఓ టు హక్కుకి  విలువ తెలిపీ 
         ఔ త్సు కతతో ఓటు వేసీ,
         అం దమలరే ప్రజా స్వామ్యం 
         అ: రె  అనగా చాటి చెపుదాం ! 


         క లము పట్టిన కాంతి రధమున 
        ఖ రము బ్రతుకు ఖండ నిద్దాం! 
        గ  ళము విప్పీ నిజము నెప్పుడు 
        ఘంట మలరగ చెప్పు కుందాం ! 

        చ మట లోడ్చీ స్వతంత్రమ్మును 
        చ త్ర పతులై  మనకు తెచ్చిరి !
        జ డ త్వమ్మును  వీడి మనలం 
        ఝండ నింగికి ఎగుర వేద్దాం ! 

        ట ముకు పట్టీ  దేశ  గీతాల్ 
        థ క్కు థ క్కున వల్లె వేయుచు 
        డప్పు కొడుతూ డాన్సు చేస్తూ 
        ఢంకా మ్రోత లొ పాడు కుందాం ! 

       త రుణు లంతా ఎదురు తిరిగీ 
       ర థ ము నడుపుచు అన్న హాజరె
       దం డ యాత్రకు బయలు దేరిరి 
       ధర్మ  రక్షణ  చేతు మంటూ !


       ప రమ సహనం ఓర్మి చూపుతు
       ఫ లము తదుపరి అనుభ విద్దాం!
       బడుగు వారికి మేలుకలిగే 
       భద్ర తిప్పుడు మరల ఇద్దాం !

       యంత్ర  యుగమున  యువకు లంతా 
       రంగు రంగుల కలలు కంటూ 
       లక్ష ణం బగు  ప్రజాస్వామ్యం 
       వక్రగతిలో నడుపు చుండిరి ! 


       శంక లెన్నో పెట్టుకుంటూ 
       ష రతు లేవో తీర్చ లేదని 
       సమాజమ్ముకు  హింస పెడుతూ 
      హడలు కొట్టుట విడిచి పెడదాం 


    ( కొన్ని అక్షరాలు  దోషాలు ఉన్నాయి టైపు చెయ్యడం చేత కాక దిద్దు కో గలరు )
  
   

        
    


     
        
        
        


          

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి