"హ్రుద్దు " పేరున కాలాగ్ని హుంకరించ
సుందరంబైన "వైజాగు" శోభ పోయె ;
గాలి ధాటికి చెట్లన్ని నేల కూలె ,
ప్రళయ ఘోషతొ ప్రజలంత వణికి పోయె !
దృశ్యములు చూడ మనసున దిగులు చెందె .... 1.
"హృద్దు " విలయంబు ధాటికి దద్ద రిల్లి ,
ఇండ్ల కప్పులు , గుడిసెలు నెగెరె నకట ,
వేల ఎకరాల పంటలు నేల కొరిగె ,
జీవ నోపాధి కోల్పోయె , జీవకోటి !
దృశ్యములు చూడ మనసున దిగులు చెందె ..... 2.
విద్యుదుత్పత్తి యంతటన్ వెసలి పడగ ,
అంధకారాన నగరమ్ము అలమ టించె !
నీళ్ళు రాకను, కాఫీకి ,పాలు లేక,
బాధ చెందారు వైజాగు ,బాధితులట !
దృశ్యములు చూడ మనసున దిగులు చెందె .... 3
పాలు ,నీళ్ళ కొరకు ప్రజలంతా పరుగెట్ట ,
ధరలు పెంచడమ్ము ధర్మ మగున?
మాన మత్వ మున్న మనిషిలా వర్తించి ,
సాటి మనిషి కీవు సాయ పడుమ !
దృశ్యములు చూడ మనసున దిగులు చెందె .... 4.
.
రాజ కీయు లంత రాజకీయము వీడి ,
సహక రించ గలరు సాయ మందు,
లాభ మందె మీరు లక్ష్యంబు పెట్టక ,
బీద వారి నెల్ల నాదు కొనుడు !
దృశ్యములు చూడ మనసున దిగులు చెందె .... 5.
ఓదార్పు చాల దిప్పుడు
ఏదో నొక సేవ నీవు నెంచుకు చేయన్ !
మోదము నొందును హృదయము
ఆ దేముడె , నిన్ను మెచ్చి ,అభినందించున్ !
దృశ్యములు చూడ మనసున దిగులు చెందె .... 5.
ఇక మా యింటి కొచ్చిన ముప్పు!
కిటికి అద్దాలు ముక్కలై క్రింద పడెను ,
ఇంటి "అంటినా " ఎచటికో ఎగిరి పోయె ,
ఇంటి ముందున్న గేటుయూ ,యిరిగి పడియె ,
పనిని చేయంగ వర్కర్లు వినుట లేదు ..
వినుట లేదని నేనెట్లు వివరణిద్దు ?
వారి కుండిన పనులే వొ ? వారి కుండు ,
చిన్న పనులివి వారెట్లు చేయ గలరు ?
చేసు కోవచ్చు ,తాపీగ , చేయ గలము.
నగర ముప్పున మా ముప్పు తగదు పోల్చ !
సుందరంబైన "వైజాగు" శోభ పోయె ;
గాలి ధాటికి చెట్లన్ని నేల కూలె ,
ప్రళయ ఘోషతొ ప్రజలంత వణికి పోయె !
దృశ్యములు చూడ మనసున దిగులు చెందె .... 1.
"హృద్దు " విలయంబు ధాటికి దద్ద రిల్లి ,
ఇండ్ల కప్పులు , గుడిసెలు నెగెరె నకట ,
వేల ఎకరాల పంటలు నేల కొరిగె ,
జీవ నోపాధి కోల్పోయె , జీవకోటి !
దృశ్యములు చూడ మనసున దిగులు చెందె ..... 2.
విద్యుదుత్పత్తి యంతటన్ వెసలి పడగ ,
అంధకారాన నగరమ్ము అలమ టించె !
నీళ్ళు రాకను, కాఫీకి ,పాలు లేక,
బాధ చెందారు వైజాగు ,బాధితులట !
దృశ్యములు చూడ మనసున దిగులు చెందె .... 3
పాలు ,నీళ్ళ కొరకు ప్రజలంతా పరుగెట్ట ,
ధరలు పెంచడమ్ము ధర్మ మగున?
మాన మత్వ మున్న మనిషిలా వర్తించి ,
సాటి మనిషి కీవు సాయ పడుమ !
దృశ్యములు చూడ మనసున దిగులు చెందె .... 4.
.
రాజ కీయు లంత రాజకీయము వీడి ,
సహక రించ గలరు సాయ మందు,
లాభ మందె మీరు లక్ష్యంబు పెట్టక ,
బీద వారి నెల్ల నాదు కొనుడు !
దృశ్యములు చూడ మనసున దిగులు చెందె .... 5.
ఓదార్పు చాల దిప్పుడు
ఏదో నొక సేవ నీవు నెంచుకు చేయన్ !
మోదము నొందును హృదయము
ఆ దేముడె , నిన్ను మెచ్చి ,అభినందించున్ !
దృశ్యములు చూడ మనసున దిగులు చెందె .... 5.
ఇక మా యింటి కొచ్చిన ముప్పు!
కిటికి అద్దాలు ముక్కలై క్రింద పడెను ,
ఇంటి "అంటినా " ఎచటికో ఎగిరి పోయె ,
ఇంటి ముందున్న గేటుయూ ,యిరిగి పడియె ,
పనిని చేయంగ వర్కర్లు వినుట లేదు ..
వినుట లేదని నేనెట్లు వివరణిద్దు ?
వారి కుండిన పనులే వొ ? వారి కుండు ,
చిన్న పనులివి వారెట్లు చేయ గలరు ?
చేసు కోవచ్చు ,తాపీగ , చేయ గలము.
నగర ముప్పున మా ముప్పు తగదు పోల్చ !
బాగున్నాయి గీతాలు
రిప్లయితొలగించండిపాదము స్థానము
5 4 యతి దృ దుః?
దృశ్యమును చూడ దుఃఖంబు దొర్లి వచ్చె అని రాస్తే సరిపోతుందా?
రిప్లయితొలగించండిదృశ్యములు చూచి మనసంత దిగులు చెందె -అని వ్రాద్ద్దామా?
రిప్లయితొలగించండి