మంచి చెడులలోన మర్మబు తెలుపుతూ
మనిషి వర్తనమున మార్పు తేచ్చి
మోక్ష సిద్ది నొందు ముక్తి మార్గము చూపి
హితము కూర్చు నదియె మతము యగును
భాష లెన్నొ యున్న భరత దేశము నందు
భావ మొకటె యున్న ప్రజలు కలరు
జాతి మేలుచేయు జాతీయ భావాలు
దేశ ప్రగతి కిపుడు దివ్య వరము
కులము మతము యనెడి కుంటి సాకులు వీడి
మాన వత్వ మనెడి మతము జేర
భావ మొకటె యుండు భాషయే పుడుతుంది
" సేవ - ప్రేమ " యనెడి శకము పుట్టు
మాన వత్వ మందు మతము లన్ని కలసి
మమత పెంచు నట్టి మనసు యుంచ
జాతి మతము లేని సంస్కార భావాలు
ఎల్ల వారి యందు నిమడ గలవు
ఎవరి రక్త మైన ఎర్రగా నున్నట్లు
మమత ఏది అయిన మమత యొకటే
పూల దండ లోని పూలెన్ని యున్ననూ
దార మొకటే మతపు సార మొకటే
మతము లన్ని మనకు మంచి నే బోధించు
చెరుపు చేయ మనుచు చెప్ప వెపుడు
మతపు గ్రంధ సార మర్మాన్ని యోచించి
జీవనంపు సరళి చేయ వలయు
భాష భిన్న మైన ప్రాంతాలు వేరైన
మతము వేరు దైన మానవులలొ
భావ రాగ సురలు పద పల్లవుల తోడ
కొత్త గీత మొకటి కూర్చ వలయు
మానవతను పెంచు మతము ఏదియు లేదు
సాటి మనిషి కెపుడు సాయ పడుచు
పేద వారి పట్ల ప్రేమను పెంచాలి
మానవతకు ధర్మ మదియే గాదె
చిక్కులన్ని విప్ప ఒక్క దారమయేల
కులము లన్ని కలియ గుణము యగును
జలము యందు ఉప్పు జాతీయ మయ్యేల
కులము లన్ని జాతి కలియ గలవు
మనకు మనకు మధ్య మాట బేధము లున్న
మా తృ రక్షనందు మాట యొకటే
యువతు లంత అపుడు యొక్క త్రాటిని నిల్చి
"సంఘి భావ " మేమొ చాట గలరు
గమ్య మొకటి యైన గమ్యంపు మార్గాలు
ఒకటి గానె ఎట్లు యుండ గలవు ?
వీలు బట్టి బస్సు , రైలు కారులు కావ?
మతము అటులె మోక్ష మార్గ దర్శి
జాతి జాగృ తయెడి జాతీయ భావాలు
దేశ ప్రగతి కిపుడు దివ్య వరము
జాతి మేలు కొలుపు చక్కని భావాలు
పెంపు చేయ వలయు పిల్ల లందు
చాలా బాగుంది. మంచి విషయాలను చెప్పారు.మతమౌఢ్యం కులగజ్జి పోతేనే
రిప్లయితొలగించండికాన ఈ దేశం బాగుపడదు కాక బాగు పడదు.చాలా కాలం తర్వాత కనిపించేరు . తరచూ దర్శన మిప్పిస్తూ ఉండండి.
చాలా బాగుందండి
రిప్లయితొలగించండిyee desa prajalaku manchi spoorthinecche vishayaalanu telpaaru.mee
రిప్లయితొలగించండిaalochana chaala baagundhi.
Chaala baaga chepparandi
రిప్లయితొలగించండిMee prayatnam chaala baagundi
Vislesana chaala thetaga chesaru
Mee prayatnam abinandaneeyam