గంగ తలమను ప్రాంతమ్ము కలదిచంట
ఆకశంబంటు ఈశ్వరు నటను గాంచ
కళ్ళు చెదురును ,పులకించు వళ్ళు గూడ ,
ఈశ్వరభిషేఖముల్ రోజు నిచట జరుగు.
మారుషిస్ దీవి అందాలు మరువ తగున?
గుడికి దగ్గర్లొ మరియొక కోవెలొప్పె ,
అందు ,శివలింగముల్ యెన్నొ ? అలరి యుండె ,
చూడ డానికి అదియెంతొ, సొంపు గొలిపి
కాశి క్షేత్రంబు మనకట కానిపించు
మారుషిస్ దీవి అందాలు మరువ తగున?
బాల కృష్ణుని ప్రీతి గోశాల యొకటి
దాని కెదురుగ మనలకు కాను పించు ;
ఆవు దూడల తో పుష్టి గోవులచట
వాని కాహార మందించు భక్తి వరులు .
మారుషిస్ దీవి అందాలు మరువ తగున?
గంగ తలనుండి మరికాస్త కదలి వెళ్ళ ,
సహజ సౌందర్య ప్రకృతి సంబరాలు ,
సరసు లందున బాతుల సరసు లాట ,
పూత కొచ్చిన తేయాకు పొలము లెన్నొ ?
మారుషిస్ దీవి అందాలు మరువ తగున?
తిరుపతిగ యెంచు 'లల్లోర' తీర్ధ మందు
వేంకటేశ్వర స్వామి కొవెలయు కలదు.
తిరుపతర్చక వర్యులు గురువు లిచట
తెలుగు వారంత కలసెడి తీర్ధ మిదియె !
మారుషిస్ దీవి అందాలు మరువ తగున?
సాంప్రదాయపు "సేవలు " జరుపుచుండి
అన్న ప్రాసాదముల్ తోడ హార తిచ్చు ;
భక్తి శ్రద్దల నడుమున భక్తులంత
వరుస క్రమమును పాటించి ప్రార్ధనిడును !
మారుషిస్ దీవి అందాలు మరువ తగున?
దివ్య తేజస్సు తోయొప్పు ,దేవి యొకటి
'షెబలు' యనియెడి ప్రాంతాన సిరులు గొలుపు
తమిళు లందరు నిచటకు తప్పని సరి
"అమ్మ వారిని" దర్శించ నిచటి కొచ్చు!
మారుషిస్ దీవి అందాలు మరువ తగున?
ప్రాంగణము లోని కనిపించు ప్రతిమ లందు
తమిళ సంస్కృతి మనలకు తనరు గలదు ;
సాంప్రదాయపు ధోవతి, జడయు సిగతొ,
అమ్మ వారిని కొలెచెద రయ్య వార్లు
మారుషిస్ దీవి అందాలు మరువ తగున?
మనసు మెచ్చెడి 'ఇస్కాను' మందిరమును
హర్ష మొందగ జూస్తి , మార్షీ ష్షు నందు ,
హరి భజనలిట చెవులందు హాయి గొలుప ,
పార వశ్యాన పులకించు భక్తు లిచట
మారుషిస్ దీవి అందాలు మరువ తగున?
ఇక ఆఖరుగా ,ఇట కానరానివి, విననవి ,చూడనివి :-
కారు లేగాని ఆటోలు ,కానరావు
వినగ లేదిట కారు హారనుల మ్రోత ,
రోడ్డు నందున చెత్తలన్ చూడ లేదు ,
పారి శుద్ధ్యాన ప్రకృతే పరవశించు !
మారుషిస్ దీవి అందాలు మరువ తగున?
బాగున్నాయి పద్యాలు . ఫోటో జత పరిస్తే బాగా బాగు.
రిప్లయితొలగించండి