సోమవారం, డిసెంబర్ 5

పేకాట

                                       ఎవరు కనిబెట్టె ? పేకాట ఏమొ గాని
                          అంటు కున్నది ఈ జబ్బు అందరికిని!
                          వదిలి బెట్టుదు మన్ననూ వదల లేక 
                          ఏసు టూత్రీ ల తో మళ్ళ అవతరించె !

                          రాత్రి పగలను మాటయే రాదు ఇటను:
                          ఆదివారాలు పండగ లడ్డు రావు ;
                          టిఫిను ,కాఫీలు తిండియున్ -తెలియ దిచట;
                          విసుగు లేదంటు భార్యయు విసుగు కున్న
                          వశము కాకుండె పేకాట వదల నాకు !

                          ఆడ మగయన్న బేదమ్ము అసలు  లేక,
                          ముఖము కానక నిక్నేము ముద్ర మీద 
                          పిల్ల వారలు వృద్ధులు  వేల మంది 
                          ఆడుచున్నారు నెట్టులో అద్భుతముగ !

                          డబ్బు పోకుండ హాయిగా ఉబ్బరముగ 
                          కాల మంతయు వూరికే గడచు చుండె!
                          ఎక్క డెక్క డొ మిత్రులు ఇటను  గాంచి 
                          ఆట  నాడేటి అదృష్ట  మమరె నిచట ! 

                 పేకను ఏల నేర్చితినొ ? పేకను నేర్చిన నేర్చు గాక ! నా
                 పేకను యాడనేల ? మరి పేకను స ద్దియు సద్ద గానె నా
                  క్జోకరు ఏల కాన బడె ? జోకరు వచ్చిన యూర కుందుమా?
                   పీకల లో తు కొచ్చినది ;  పీకిన వెంటనె ఫుల్లు నీయగా! 
                                     
           
                               

   
                     



6 కామెంట్‌లు:

  1. చీర్స్ విత్ తర్టీన్ కార్డ్స్ !!

    రిప్లయితొలగించండి
  2. క్షమించండి మాస్టర్ గారూ
    గోడ కుర్చీ వేసా..
    వేసే ఆడుతున్నా ..పేక
    భయం లేక సిగ్గులేక
    పేక పేక..

    రిప్లయితొలగించండి
  3. భలే,భలే, భలే. నిజమే. హేండ్ కోసం వెతుక్కో నక్కర లేదు. ఎక్కడ ఆడాలో ప్లేస్ కోసం వెతుక్కో నక్కర లేదు. డబ్బులు అసలే అక్కర లేదు.
    కాలక్షేపం బోలెడంత. రిటైరయిన మన బోటి వారికి మరింత కాలక్షేపం.

    రిప్లయితొలగించండి
  4. మీ పేకాట పద్యాలు చాలా బాగున్నాయి. నిండా ములిగిన వాడికి చలేమిటి ఆడుతూ ఉండండి

    రిప్లయితొలగించండి
  5. సరదాగా వ్రాసిన పద్యాలు నచ్చినదుకు మీకు
    కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  6. తాతగారు పేకాట పై మీరు రాసిన పద్యలాంటి పదాలు చల్లా భావుంది. కానీ నాకు పేకాట రాదు.

    అనుసుబ్బు

    రిప్లయితొలగించండి