సీతాపతి సంకల్పం
శ్రీరాముని మకుటంతో
నే రచనను వ్రాయ దలచి నెయ్యము మీరన్
శ్రీ రామ నవమి రోజున
నా రాముని వేడి నాను నమ్రత తోడన్ ! 01
కోరిక ఎంతయు యుండిన
ఆ రాముని కృపయు లేక నగుటయు నెట్లున్ !
శ్రీ రామ నామ మహిమయ
ధారలుగా జాలు వారి దారిని చూపున్ ! 02
' రామా' అనియెడు పిలుపుయె
నా మదిలో ఎల్ల వేళ నాడుచు నుండున్ !!
రాముని తలచిన మరి యా
సోముడె నేర వేర్చ గలడు శుభ కార్యమునన్ 03
శ్రీ కరుడౌ శ్రీ రాముని
శ్రీ కారము చుట్ట మంటి చిత్త మలరగన్!
నా కావ్యము జయమగుటకు
సాకారము నీయమంటి సతతము నాకున్ 04
శ్రీ రాముని యానతతో
ప్రారంభము చేసి నాను పద్యము వ్రాయన్ !
ఈరచనకు శుభము పలికి
శ్రీ రాముడె సహకరించు సీతాపతికిన్ 05
* * *
శుభం
కోరిన కోరిక లన్నియు
కూరిమితో తీర్చినావు కోరిక మీరన్ !
కోరికల కంత మెక్కడ
కోరిక మరి కోరనయ్య కోసల రామా ! 1
సంతుష్టి మనిషి కెప్పుడు
సంత సమును కలుగ జేసి శాంత త నిచ్చున్ !
సంతతి జననీ జనకుల
కెంతయు సంతోష మిచ్చు ఇనకుల రామా ! 2
గొప్పలకు పోయి ఎన్నడు
అప్పులు చేయంగ బోకు అనవసరంగా!
అప్పులు తీరవు పోగా
తిప్పలనే గూర్చు చుండు స్థిరమది రామా ! 3
నమ్మిన చదువును ఎన్నడు
అమ్మకుమీ కాసు కొరకు ఆశకు లోనై
కమ్మని చదువును ఎప్పుడు
అమ్మగనే ఎంచ వలయు నవనిని రామా ! 4
నీతులు చెప్పుట కంటెను
నీతిని పాటించు గుణము నిరతము వలయున్ !
నేతలు చెప్పెడు నీతులు
వ్రాతలకే పరిమితమ్ము రఘుపతి రామా ! 5
ఇష్టముతో పని జేసిన
కష్టము అను మాట లేదు కానగ నిలలో
దృష్టిని పనిపై నుంచిన
సృష్టియె మన వశము యగును సీతారామా ! 6
కాలము వ్యర్ధము జేయక
వేళను పాటించ మేలు విశ్వము నందున్ !
కాలము వెనుకకు త్రిప్పుట
కాలునికే సాధ్య పడదు కాంచుము రామా! 7
స్వార్ధము మనిషికి శత్రువు
స్వార్ధము విడనాడ మనిషి సౌఖ్యము పొందున్ !
ఆర్ధిక సంక్షో భానికి
స్వార్ద మె ఒక కారణమ్ము జగదభి రామా! 8
మనుగడ కోసము కొందరు
మన మధ్యను మతమటంచు మంటను రేపన్ !
అను రాగము నశియింపగ
అణు బాంబులు రాల్చు యత్న మాపుము రామా ! 9
కమ్మని జీవన యాత్రను
బమ్మయె సృష్టించు నట్టి పలు పాత్రలవే ,
అమ్మా, నాన్నా , మామలు
అమ్మమ్మలు తాత లిందు అణువులె రామా ! 10
'మమ్మీ - డాడీ ' యనుటను
కమ్మని మన తెలుగు భాష కందము పోయెన్ !
'మమ్మీ' అనుచును పిలువక
' అమ్మా ' అని పిలువ నేర్ప నందము రామా ! 11
ప్రకృతి ధ్వంసము చేయకు;
ప్రకృతి కడు రక్ష నొసగి పచ్చను నింపున్ !
ప్రకృతి ధర్మము తప్పిన
విక్రుతియై వేటు వేసి విషమగు రామా ! 12
అజ్ఞానము నణగ ద్రొక్క
విజ్ఞానము విస్త రించె విస్తృత పరిధిన్ !
విజ్ఞత కలిగిన పెద్దలు
అజ్ఞానుల నణచు చర్య నాపుము రామా ! 13
ఇచ్చిన పని ఏదైనను
ఖచ్చితముగ చేయు మనతి కాలము లోనన్ ;
తచ్చాడుతు పని జేసిన
నిచ్చెలు నిందింతు రిలను నిక్కము రామా ! 14
ఉద్యోగ నిర్వ హనమును
బాధ్యత తో చేసి నపుడె, పలువురు మెచ్చున్
బాధ్యత గల ఉద్యోగము
హృద్యముగా చేయ కుంటె హీనము రామా ! 15
"ఉద్యమ కారుడ " ననుచును
ఉద్యోగము విస్మ రించ నొప్పది కాదే !
బాధ్యత నిర్వర్తించుచు
ఉద్యమమును నిర్వ హించ ఉత్తము రామా ! 16
ఏ వేళ చేయు పనులను
ఆ వేళకు చేయు నపుడె అందము కానీ !
ఆ వేళ మించి పోయిన
ఆ వేదనె మిగిలి పోవు అదిగను రామా ! 17
తప్పును ఒప్పుగ పిలుచుచు
తప్పించెడి యత్న మదియు తప్పే యగు ; యా
తప్పును మరిమరి చేయక
ఒప్పుగ నడయాడు వాడె ధన్యుడు రామా ! 18
తప్పులు చేసిన యప్పుడె
ఒప్పులు తెలియంగ గలవు ఒక్కరి కైనన్
ఎప్పటి కప్పుడు, చేసిన
తప్పులు సరి దిద్దు కొనుటె ధన్యత రామా ! 19
కష్టార్జిత రాబడితో
నిష్ఠ ముగా పట్టె డన్న మింపును గూర్చున్
కష్ట మెరుంగని సోమరి
పుష్టి గ షడ్రుచులు తినిన పులిమిరె రామా ! 20
పిల్లల చదువుల కోసము
పల్లెల నే విడిచి పెట్టు పద్ధతి వచ్చెన్ !
ఉల్లాసపు చదువులకై
ఇల్ల మ్మెడి కాలమయ్యె నిలలో రామా ! 21
మనుజులతో వేడుకలను
మనసెరుగక నాడి నంత మాటలె ములులౌ ;
మనసది విరిగిన అతకదు
మనసెంతో సున్నితమ్ము మరువకు రామా ! 22
మనసున మనసులు కలసిన
కను విందగు హాయి గొలుపి కలలే పండున్ !
మను వాడిన ఆ జంటలు
మనువును విడి చేటి తీరు మచ్చయె రామా ! 23
ఇతరుల మనసుల నొచ్చెడి
అతి సున్నిత హాస్య మైన ఆడకు మెపుడున్ !
"అతి" ఎప్పుడు ప్రమాదము
మితి మీరిన , ముప్పు రగిలి వెగటగు రామా ! 24
నోటికి వచ్చిన దెల్లను
మాటాడగ తగదు నెపుడు మనసదె నొచ్చున్!
మాటయు మాటయు పెరుగగ
కోట లె మన భరత భువిని కూలెను రామా ! 25
మాటలు ఆడుట కన్నా
మాటలు తగ్గించి యాడ మంచిది సుమ్మీ !
మాటలు రజతం బైతే
మాటలు తగ్గించి యాడ పసి డియె రామా ! 26
శత్రువు రక్షణ కోరిన
మిత్రుని వలె నాదరించ మేలును గూర్చున్ !
శత్రు వె మిత్రుండగు, నా
మిత్రత్వమె వాంఛ నీయ మెన్నడు రామా ! 27
మంచిని చేయుట కొరకును
నెంచకుడీ వార తిధులు నెప్పుడు మీరున్ !
మంచిని పంచుటలో , నయ
వంచన లేకుండ చూడ వలయును రామా ! 28
ఆటల నాడే పిల్లలు
ఆటల నాడే పిల్లలు
ఆటలనే మరిచి నారు ఆధుని కములో
ఆటలకు సమయ మెక్కడ?
పోటీ పడు చదువు లయ్యె భువిలో రామా ! 29
పిల్లల చదువులు ఇప్పుడు
పిల్లల చదువులు ఇప్పుడు
తల్లులకా యనెడి భ్రాంతి తలుపుకు రాగా
పిల్లల కన్నా ముందరె
తల్లులు చదువు వంగ వలసె తలకొనె రామా ! 30
తల్లియు , తండ్రియు , గురువుయు
పిల్లల చదువుల కొరకై
తల్లులు పడు బాధ తెలుప దయ నీయంబౌ ,
పిల్లల మనసులు నెరుగక
తల్లులె భవి తమ్ము నెంచ తగదది రామా ! 31
తల్లియు , తండ్రియు , గురువుయు
కళ్ళెదుటను కాను పించు ఘన దైవములే ,
కళ్ళుయు, కాళ్ళను , సడలిన
తల్లియు ,తండ్రులను నీడ తగుదున రామా! 32
స్నేహము చేసే ముందరె
స్నేహితుని మనసు నెరిగియు స్నేహము చేయన్
స్నేహము ఫలిత మొసంగును;
స్నేహము తదుపరి విడుచుట సిగ్గ దె రామా ! 33
మనుజుల సేవను మించిన
కను విందగు సేవ అవని కానగ రాదే !
తనమన భేదము వీడియు
దినమున కొక సేవ జేయ ధీటగు రామా! 34
ఇంటికి ముందర వృక్షము
కంటికి నందంబు నిచ్చు కను విందగుచున్
కంటకుని వలెను దానిని
వంట చెరుకునకై నరుక పాపము రామా! 35
ప్రతి యింటను ఒక చెట్టును
ప్రతి వాడును పెంచు నట్టి భావము యున్నన్
ప్రతి వాడయు శోభితమై
అతి సుందర హరిత మచట అమరదె రామా ! 36
కలుషిత మగు చెడు గాలులు
పలు రకముగ వ్యాప్తి నొంది ప్రకృతి చెరుచున్!
కలుషిత గాలుల వ్యాప్తినె
పలు రకముల వ్యాదు లచట బలపడు రామా! 37
పరిసర ప్రాంతము లన్నిట
పరి శుభ్రత నిండి నపుడె ప్రజలకు క్షేమం
నిరతము రక్షణ నిచ్చెడి
పరి శుభ్రత నిలుప టిపుడు ప్రజలదె రామా ! 38
వ్యసనాల సంఖ్య పెరిగెను
వ్యసనాలకు కాలమంత వ్యర్ధము అయ్యెన్ !
వ్యసనాలకు బడి పిల్లలు
కుసుమమ్ముల వోలె వాడి కూలరె రామా ! 39
అన్నీ వచ్చును నాకని
ఎన్నడునూ చెప్పరాదు నితరుల ముందున్!
అన్నియు తెలిసిన వారలు
ఎన్నడునూ పలక రటుల ఇనకుల రామా ! 40
అను మానము కలిగినచో
వెను వెంటనె తీర్చు కొనుట మేలగు నీకున్!
అను మానము పెను భూతము
అని చెప్పిరి పెద్ద లెపుడొ అవనిని రామా ! 41
గురువులు చెప్పిన పాఠము
గురి యుంచియు నేర్చు కొనిన గుర్తిం పుండున్!
మరి మరి సాధన జేసిన
మరుపన్నది యుండదెపుడు మనకది రామా ! 42
సాధన చేయగ మనలకు
సాధించని దేది లేదు సంకల్పించన్ !
బాధను పొందకు రాదని
సాధనతో పనులు అన్ని సాధ్యము రామా ! 43
సుద్దులు నేర్పిన చదువులు
అద్దములో చూచి నటుల అగుబడు చుండున్ !
విద్డెను బుద్దిగ నేర్చిన
నిద్దురలో చదవ గలము నిజమిది రామా ! 44
రాదని ఎప్పుడు నొచ్చకు
ఏదియునూ రాని వార లెవ్వరు జగతిన్ !
ఏదో తెలయని ఒక కళ
నీ దరి ఒకరోజు చేరి మెరవ దె రామా ! 45
ముద్దులు చేసిన తనయుడు
మొద్దుగ పరిణితిని చెంది మూర్ఖుడు కాడా ?
పెద్దయిన పిదప నతనిని
దిద్దగ మన వశము కాదు తెలియుము రామా ! 46
ఆదరము వీడి చదువును
ఆదిని అశ్రద్ధ జేయ అజ్ఞాన మగున్ !
దాదాపు వయసు ముదిరిన
ఏదీ ? దారనుచు నేడ్వ నేమగు రామా ! 47
దాదాపు వయసు ముదిరిన
ఏదీ ? దారనుచు నేడ్వ నేమగు రామా ! 47
అల్లరి పిల్లలె చేతురు
పిల్లల వలె చేయ వశమె పెద్దల కిపుడున్ !
అల్లరికి హద్దు యున్నది
చెల్లని ఆ హద్దు దాట చేటగు రామా ! 48
సంగీతము సాహిత్యము
సంగత భావంబు కవియె సాదృశ మగుచో
మంగళ కర సాహిత్యము
సంగీతము మేళ వించ సంపదె రామా ! 49
పిల్లల వలె చేయ వశమె పెద్దల కిపుడున్ !
అల్లరికి హద్దు యున్నది
చెల్లని ఆ హద్దు దాట చేటగు రామా ! 48
సంగీతము సాహిత్యము
సంగత భావంబు కవియె సాదృశ మగుచో
మంగళ కర సాహిత్యము
సంగీతము మేళ వించ సంపదె రామా ! 49
పోటీ అన్నిట పెరిగెను
పాటవమున పనులు జేసి పరిణితి జూపన్ !
దీటుగ పనులను జేయుచు
ధాటీగా నిలువ వలయు ధరణిని రామా ! 50
పాటవమున పనులు జేసి పరిణితి జూపన్ !
దీటుగ పనులను జేయుచు
ధాటీగా నిలువ వలయు ధరణిని రామా ! 50
అనురాగము మతములలో
అనవరతము జూపు మనుచు ఆదే సింపన్
మనుగడ విలువలు పెంచెడి
మనసెరిగిన మతమె మంచి మతమగు రామా ! 51
అనవరతము జూపు మనుచు ఆదే సింపన్
మనుగడ విలువలు పెంచెడి
మనసెరిగిన మతమె మంచి మతమగు రామా ! 51
మన సంస్కృతి మన భాషయు
మన మెన్నడు మరువరాని మధురామృతమే
అను మోదము ఆప్యాయత
మన మతమునె కాని పించు మహిలో రామా ! 52
మన మెన్నడు మరువరాని మధురామృతమే
అను మోదము ఆప్యాయత
మన మతమునె కాని పించు మహిలో రామా ! 52
తెలియనది గొప్ప కొరకని
తెలుసంటూ చెప్ప బోకు తెలివిని జూపన్ !
తెలియనిది నేర్చుకొనుటకు
"తెలియదు" అని ఒప్పు కొనుటె తెలివియు రామా! 53
తెలుసంటూ చెప్ప బోకు తెలివిని జూపన్ !
తెలియనిది నేర్చుకొనుటకు
"తెలియదు" అని ఒప్పు కొనుటె తెలివియు రామా! 53
నాదీ పని కాదనుచును
వాదనతో వదిలి వేయ వలదెపు డైనన్!
నాదీ - నీదను భావన
నీ దరి రాకున్న నిలువ నెయ్యము రామా ! 54
వాదనతో వదిలి వేయ వలదెపు డైనన్!
నాదీ - నీదను భావన
నీ దరి రాకున్న నిలువ నెయ్యము రామా ! 54
ధనవంతుని పాదాలకు
వినయముతో ప్రణతు లిడుచు వేల్పులు చేయన్
విని హితమున అడు గొందిన
వినయముతో ప్రణతు లిడుచు వేల్పులు చేయన్
విని హితమున అడు గొందిన
కొనటిని కాలెత్తి కొట్ట క్రూరము రామా ! 55
ఏకట నిశి నిద్రించక
వేకువనే నిదుర లేచి విధులన్ చేయన్ !
ఆకుల పాటది కలగదు
వేకువనే నిదుర లేచి విధులన్ చేయన్ !
ఆకుల పాటది కలగదు
ఆకాంక్షయు తీరు నదియె అందము రామా ! 56
ఒడ లెరుగక కష్టించిన
ఒడ లుడికిన పిదప ఫలము నొసగును ; అదియే
జడుడై సోమరి అగుచున్
బడియుండిన యది , నికృష్ట మగుకద రామా ! 57
కలిసియు మెలిసియు జేసిన
అలవోకగ పనులు జరిగి హాయిని యిచ్చున్ !
అలకను జూపుచు విడివడ
బల హీనపు బ్రతుకు లగును ప్రజలకు రామా ! 58
పని ఏమియు జేయకనే
కనికరము గ కాసు లీయ కలహము లొచ్చున్!
అనుచిత వరముల నిచ్చిన
అనుజీవులు సోమరులగు అవనిని రామా ! 59
పెద్దల తప్పులు నెంచక
పెద్దలలో నున్న మంచి ప్రియముగా చూడన్!
ముద్దుగ ముందుకు సాగుచు
ఒద్దికతో జీవనమ్ము ఒప్పును రామా ! 60
పెద్దలలో నున్న మంచి ప్రియముగా చూడన్!
ముద్దుగ ముందుకు సాగుచు
ఒద్దికతో జీవనమ్ము ఒప్పును రామా ! 60
యంత్రాల యుగము నందున
మంత్రాలకు తావులేదు మహ ఋషి కైనన్ !
మంత్రం వేస్తానంటూ
తంత్రాలను చేయు వార్కి తన్నులె రామా ! 61
మొదలడిన పనిని ఎపుడును
తుడివరకును చేయ వలయు త్రుంచక నడుమన్ !
ఇది మరి యవదని సగమున
వదలిన జయమొందలేము పనిలో రామా ! 62
తుడివరకును చేయ వలయు త్రుంచక నడుమన్ !
ఇది మరి యవదని సగమున
వదలిన జయమొందలేము పనిలో రామా ! 62
భక్తిని దైవము కొలచిన
శక్తులు మన కిచ్చు తానె శరణా గతుడై !
భక్తిని వ్యక్తము చేయగ
యుక్తపు ఒక పూవు నీయ యోగ్యమె రామా ! 63
శక్తులు మన కిచ్చు తానె శరణా గతుడై !
భక్తిని వ్యక్తము చేయగ
యుక్తపు ఒక పూవు నీయ యోగ్యమె రామా ! 63
బద్ధకము వీడి శాస్త్రము
శ్రధ్ధగ చదువంగ అదియె శక్యము అగునే !
బుద్దిగ చదివిన నాడే
శ్రధ్ధగ చదువంగ అదియె శక్యము అగునే !
బుద్దిగ చదివిన నాడే
సిద్ధించును కోర్కె లెపుడు సీతారామా ! 64
కులమును అడ్డముగా గొని
కులమును అణగంగ ద్రొక్కు కాలము వచ్చెన్ !
అలరెడి అధికారముతో
కలము లపై చూపు జులుము కాంచుము రామా ! 65
చిందులతో నవ యువకులు
మందుల కలవాటు పడుచు మత్తును పొందన్ !
అందం బగు భవితవ్యము
నెంద రొ కోల్పోవు చుంద్రు నిజమిది రామా! 66
భగవంతుడు ప్రతి మనిషికి
అగు పించని శక్తి నిచ్చి యంపెను భువికిన్ !
తగు సమయం బది వచ్చిన
చిగు రొందియు దివ్య శక్తి చేకురు రామా ! 67
తళ తళ మను మెరుపులు గని
బళి బళి స్వర్గం బటంచు భ్రమ పడ కెపుడున్ !
తళు కున మెరిసెడి సర్పపు
గళ మంతయు విషము గాదె యెంచుము రామా ! 68
ఇచ్చిన విషయంబేమిటి ?
ఇచ్చిన విషయమ్ము తెలియ నేమిటి వలయున్ !
ముచ్చటగా యోచించిన
నిచ్చెలు సృజియించ వచ్చు నీ మది రామా ! 69
పుట్టెడి రేపటి కోసము
గిట్టిన నిన్నటిని గూర్చి క్లేసము పడకన్,
జట్టుగ నుండిన నేటిని
గట్టిగ ఉపయోగ పరుప ఘనమగు రామా ! 70
ఆనాటి పాత పాటలు
ఈనాడును విన్న హాయి నిచ్చుచు నుండున్ !
ఆ నాటి మధుర సాహితి
ఈ నాటికి బ్రతికి యుంట నెరుగుము రామా ! 71
కక్షలు కావేషాలను
తక్షణమే విడుచు నాడె ధన్యత కలుగున్ !
కక్షల హత్యలు పెరిగెను
రక్షణ నీవీయ బోతె రణమే రామా ! 72
నీతులు నేర్పెడి గాధలు
తాతలు చెప్పీటి వారు తమ విధి యనుచున్ !
తాతలు చెప్పే నీతులు
నీ తరముకు పనికి రావు నిజమిది రామా ! 73
లంచము లిచ్చిన వారికె
ఎంచక్కా పనులు జరుగు ఈ కాలం లో ;
లంచము లీయక పోయిన
ఇంచుక పని జరుగ బోదు ఇది గను రామా ! 74
నీతులు చెప్పే గురువులె
నీతిని మరి తప్పుతున్న నేర్పే దెట్లున్!
నీతిని తప్పే గురువుని
బెత్తము తో కొట్ట డమ్మె బే షగు రామా ! 75
తాళము యుండిన చాలదు
తాళము చెవి యుండి నపుడె తాళము విడు ; ప్ర
క్షాళన ముండిన చాలదు
క్షాళికు డుండంగ బోతె క్షారమే రామా ! 76
అడుగులకు మడుగు లొత్తుచు
అడిగిన తక్ష ణ మె తనయు డడిగిన దొస గన్!
జడుపన్నది లేక తుదకు
చెడు వ్యస్నపు దాసు డయ్యు చెడడే? రామా 77
అడుగులు వేసే వయసున
తడబడి అడుగిడిన తనయు , తండ్రియె గాచున్ !
నడవడి సరి లేని యడల
కడ దాకా కావ గలడె ? గనుమిదే రామా ! 78
కళ్ళకు చూపులు తగ్గియు
వళ్ళంతా వడలి పోవు వయసున తండ్రిన్
మెల్లగ చేయూత నొసగి
చల్లగ కాపాడు సుతుడె సంపద రామా ! 79
ఇతరులపై చాడీలను
స్తుతి మించియు చెప్పు వాడు సుహృదు డగునా ?
అతిశయము కూడ దె న్నడు
వెతలను చేకూర్చు నిజము వినుమిది రామా ! 80
ఒత్తిడి ఎంతగ నున్నను
బిత్తర పడి పనిని విడువ బేల తనంబౌ !
తత్తర పాటును చెందక
ఒత్తిడి తగ్గించు కొనుట యుత్తము రామా ! 81
ఎక్కడ జలమది యున్నను
అక్కడికే వలస పక్షు లరుగుచు నుండున్ !
ఎక్కడ హాయిగా నుండునొ
అక్కడికే చేరు జీవు లది గను రామా ! 82
చేసిన దానము నెపుడును
మూసిన దోసిలిని జేయ మోదము గానీ !
చేసిన చిరు దానమునకు
మీసము మెలివేసి చూప పెడ సరె రామా ! 83
అవినీతి పెచ్చు పెరిగెను
అవినీతిని మించి పెరిగె నార్జన కలిలో !
నవ భారత నిర్మాణము
కవ రోధము లవియె నేడు కాంచుము రామా ! 84
అను నిత్యపు కృషి ఫలితమె
కను విందగు తృప్తి నిచ్చి కాపాడెపుడున్!
మన పూర్వుల కృషి ఫలితమె
మనకెప్పుడు ఖ్యాతి నిచ్చు మరువకు రామా ! 85
నిరు పేదలు ధన వంతులు
యిరువురు బ్రతుకంగ గలరు ఈ ధర నెటులో ,
కరు వందున మధ్యముని కె
కరువగు సుఖ జీవ నమ్ము గాంచుము రామా ! 86
సహ జీవన సహ కారము
బహుళముగా కానుపించు పలుజీవులలో
సహ కారము లందించుచు
విహరించుట నేర్చు కొనుట వరమే రామా ! 87
బరువైన పుస్తకాలను
కరముల వీపులను మోయ కష్టం బాయెన్!
బరువును మోయక పోయిన
విర జిమ్మదు విద్య యనుట వెఱ్ఱియె రామా ! 88
చక్కని తెలుగును కాదని
ఎక్కడిదో ఆంగ్ల భాష నిక్కడ రుద్దన్ !
మిక్కిలి వేదన కలుగును
మక్కువ యగు మా తృ భాష మరువకు రామా ! 89
వేషాలు వేయుచున్ మరి
మీసాలను త్రిప్పు వాడు మిక్కిలి ఘను డై
మోసాల చేయు వారల
దాసులుగా చేరి తాను తనరును రామా ! 90
సృష్టిని గల పలు కూరలు
పుష్టిగ పొల మందు పండి ముద్దుగ యున్నన్ !
నిస్సత్తువ హిబ్రీడుల
ని ష్ట ముగా తినెడి వారు నెక్కువ రామా ! 91
కష్టములో యున్నప్పుడు
యిష్టపు దైవాన్ని తలచి ఇరుముడి కట్టీ
కష్టము తీరిన తదుపరి
యిష్టపు దైవాన్ని మరుతు రేలనొ రామా ! 92
నీతియె ప్రాణం నాకను
నేతలు చెప్పేటి మాట నిజమని పించున్ !
కూతలు కోటలు దాటిన
చేతలలో ' సున్న' యన్న చిత్ర మె రామా ! 93
అవకాశ వా దు లందరు
అవినీతిని గూర్చి చెప్పు అద్భుత నటులే !
అవకాశము లేని యపుడు
అవతారము మార్చు కొనుట అఱగొరె రామా ! 94
లెక్కలు చేయక పోయిన
ఇక్కట్లను బడియ గలరు ఈ కాలమునన్ !
లెక్కలు కస్టంబని యడి
అక్కసు భావంబు కలుగ అటమటె రామా ! 95
చదువుకు అంతం యుండదు
చదువె ప్పుడు ఆగకుండ సాగుచు నుండున్ !
చదువుకు అంతం బుండిన
చదువరి మరి ఎదగ లేడు సత్యము రామా ! 96
మనజుల సంబంధాలలొ
అనురాగపు గాఢ తిపుడు అగుబడ కుండెన్!
మన సంస్కృతి మన కట్టడి
వెనుకటి మధురంపు పిలుపు వీడకు రామా ! 97
మన తాహతు తగి నట్టుగ
కొని కట్టగ వచ్చు బట్ట కోరిక మీరన్ !
మన సంస్కృతి మన నడువడి
కను పించును కట్టు నందె కావుము రామా ! 98
బట్టను కట్టిన తీరునె
ఇట్టియె కనిపెట్ట వచ్చు ఏ మనిషెవరో !
బెట్టిదపు బట్ట కట్టిన
తిట్టుచు వెలి వేయ గలరు తెలియుము రామా ! 99
యిష్టపు దైవాన్ని తలచి ఇరుముడి కట్టీ
కష్టము తీరిన తదుపరి
యిష్టపు దైవాన్ని మరుతు రేలనొ రామా ! 92
నీతియె ప్రాణం నాకను
నేతలు చెప్పేటి మాట నిజమని పించున్ !
కూతలు కోటలు దాటిన
చేతలలో ' సున్న' యన్న చిత్ర మె రామా ! 93
అవకాశ వా దు లందరు
అవినీతిని గూర్చి చెప్పు అద్భుత నటులే !
అవకాశము లేని యపుడు
అవతారము మార్చు కొనుట అఱగొరె రామా ! 94
లెక్కలు చేయక పోయిన
ఇక్కట్లను బడియ గలరు ఈ కాలమునన్ !
లెక్కలు కస్టంబని యడి
అక్కసు భావంబు కలుగ అటమటె రామా ! 95
చదువుకు అంతం యుండదు
చదువె ప్పుడు ఆగకుండ సాగుచు నుండున్ !
చదువుకు అంతం బుండిన
చదువరి మరి ఎదగ లేడు సత్యము రామా ! 96
మనజుల సంబంధాలలొ
అనురాగపు గాఢ తిపుడు అగుబడ కుండెన్!
మన సంస్కృతి మన కట్టడి
వెనుకటి మధురంపు పిలుపు వీడకు రామా ! 97
మన తాహతు తగి నట్టుగ
కొని కట్టగ వచ్చు బట్ట కోరిక మీరన్ !
మన సంస్కృతి మన నడువడి
కను పించును కట్టు నందె కావుము రామా ! 98
బట్టను కట్టిన తీరునె
ఇట్టియె కనిపెట్ట వచ్చు ఏ మనిషెవరో !
బెట్టిదపు బట్ట కట్టిన
తిట్టుచు వెలి వేయ గలరు తెలియుము రామా ! 99
పంటను మార్చక పూర్వపు
పంటల నే వేయ భూమి బంజరు యగునే !
పంటను మార్చిన పొలమున
పంటకు రెట్టింపు పంట పండును రామా ! 100
సమ్మెలు దేశపు ప్రగతికి
సమ్మెట గా ఎదురు నిలచి సంకట పరుచున్!
సమ్మతము కాని సమ్మెలు
కమ్మని మన బ్రతుకు నందు కఱ గొఱ రామా ! 101
ఎక్కువ తిండిని తినిన చొ
మిక్కిలి లావెక్కు దమని మెర మెర తోడన్ !
తక్కువ అన్నము తినుచును
చిక్కుచు సగమయ్యె యువత సీతారామా ! 102
ఇంటిని తక్కువ తినుచును
కంటికి కనబడిన నూనె గారెలు తినుచో
వెంటనె దేహము పెరిగియు
తంటాలే బడియ గలరు తదుపరి రామా ! 103
మగ వారికి పోటీగా
మగువలు ముందంజ వేయ మహాదా నందం !
మగువలు గెలిచిన సీటున
మగవారల ఆధి పత్య మనుచుము రామా ! 105
గడ గడ మని గడియారము
వడి వడిగా సాగు చుండు పరుగుల తీరున్ !
తడి యారెడి మన దేహము
ముడతలు బడి నిష్క్రమించ మొదలిడు రామా ! 106
కాలుడు పిలువక మునుపే
జాలము చేయక పనులను జవముగ చేయుమ్!
కాలము విలువది గొప్పది
వేళను తిప్పంగ నెంచ వేదనె రామా ! 107
నాకును నచ్చిన నీతులు
నీకును చెప్పంగ నేను నెంచియు వ్రాస్తిన్ !
నీకవి నచ్చిన చేయుము
కాకుంటే నీదు ఖర్మె కాంచుము రామా ! 108
========
========
స్వగతం :-
పంతుల జోగయ అచ్చమ
పంతుల వంశంబు నందు మణి రత్నాలే !
ఎంతటి పూజల ఫలిత మొ
అంతటి మహనీయ వంశ - అంశను పుట్టన్ !
శ్రీ రాముని దీవెనతో
నా రచనను పూర్తి జేసి నాడను దయతో
మీరిచ్చిన ఆశీస్సులె
నారచనకు మూల్యమయ్య నానందంబౌ !
స్వస్తి
============
enduko eppudo, appudappudu raasina
రిప్లయితొలగించండిpadyaalu sataka maayyay .
enduko 59 th. padyam tarvatha gap
vachchindi kaaranam teleedu.
paathakulu chooda galaru