నీటి యందున వస్తు వేసిన
కొన్ని ములుగును కొన్ని తేలును
మునిగి తేలే కార ణమ్మును
శాస్త్ర మిప్పుడు తెలియ జేసెను 1
సాంద్ర తనునది దీని కంతకు
కార ణమ్మని తెలియ జేసెను
తేలు చుండిన వస్తు మర్మము
ప్లవన సూత్రము తెలుప సాగెను 2
' ప్రమాణ ఘన పరిమాణముగల
వస్తు ద్రవ్యమె సాంద్ర తనబడు'
ద్రవ్య రాసిని ఘన ఫలమ్ము తో
విభా గించిన - వచ్చు సాంద్రత 3
వస్తు సాంద్రత ఎక్కు వయితే
ద్రవము నందున మునిగి పోవును ;
ద్రవము సాంద్రత ఎక్కు వయితే
ఎల్ల వేళల తేలు చుండును . 4
వాటి సాంద్రత లొక్క టయితే
తేల కుండగ మునగ కుండగ
ద్రవము లో వ్రే లాడు చుండును
నీట వేసిన కర్ర చూడుము . 5
ద్రవము లోపల తేలుచుండిన
వస్తు భారము , అది తొలగించు
ద్రవము భారము సమా నమ్మని
ప్రయో గమ్మున రుజువు అయ్యెను 6
తేలు వస్తువు గరిమ నాభీ
తొలగు ద్రవపూ గరిమనాభీ
ఎదురు దిశలో పనియు జేయుచు
ఒక్క రేఖలొ యుండు నెప్పుడు 7
అటుల జేసిన వస్తు వెప్పుడు
నీట తేలుచు నుండు సత్యము;
పడవ జేసే పధ్ధ తందున
ఇదియె సూత్రము ఇమిడి యున్నది 8
******
( నేను వ్రాసిన శాస్త్రీయ సరాల నుండి )
కొన్ని ములుగును కొన్ని తేలును
మునిగి తేలే కార ణమ్మును
శాస్త్ర మిప్పుడు తెలియ జేసెను 1
సాంద్ర తనునది దీని కంతకు
కార ణమ్మని తెలియ జేసెను
తేలు చుండిన వస్తు మర్మము
ప్లవన సూత్రము తెలుప సాగెను 2
' ప్రమాణ ఘన పరిమాణముగల
వస్తు ద్రవ్యమె సాంద్ర తనబడు'
ద్రవ్య రాసిని ఘన ఫలమ్ము తో
విభా గించిన - వచ్చు సాంద్రత 3
వస్తు సాంద్రత ఎక్కు వయితే
ద్రవము నందున మునిగి పోవును ;
ద్రవము సాంద్రత ఎక్కు వయితే
ఎల్ల వేళల తేలు చుండును . 4
వాటి సాంద్రత లొక్క టయితే
తేల కుండగ మునగ కుండగ
ద్రవము లో వ్రే లాడు చుండును
నీట వేసిన కర్ర చూడుము . 5
ద్రవము లోపల తేలుచుండిన
వస్తు భారము , అది తొలగించు
ద్రవము భారము సమా నమ్మని
ప్రయో గమ్మున రుజువు అయ్యెను 6
తేలు వస్తువు గరిమ నాభీ
తొలగు ద్రవపూ గరిమనాభీ
ఎదురు దిశలో పనియు జేయుచు
ఒక్క రేఖలొ యుండు నెప్పుడు 7
అటుల జేసిన వస్తు వెప్పుడు
నీట తేలుచు నుండు సత్యము;
పడవ జేసే పధ్ధ తందున
ఇదియె సూత్రము ఇమిడి యున్నది 8
******
( నేను వ్రాసిన శాస్త్రీయ సరాల నుండి )
హైస్కూల్లో చదువు తున్న తెలుగు పిల్లల కోసం
రిప్లయితొలగించండిసైన్సు సూత్రాలు సులభంగా కంటటా పెట్టెల వ్రాసినవి
పిల్లలు ఉపయోగించ కొ గలరు
చాలా బాగా వివరించేరు అందరికీ అర్థ మయ్యే విధంగా ధన్య వాదాలు
రిప్లయితొలగించండి