గురువారం, ఏప్రిల్ 18

పుట్టిన తేదీ చెబితే వారం చెప్పడం






పుట్టిన  తేది  తెలిపిన
పుట్టిన  యా వార మేదొ  బుద్ధితొ  చెపుదున్
ఎట్టులొ ? చెప్పగ వలెనా ?
అట్టులె చెబుతాను నేను అందరు  నేర్వన్ !

లెక్కలు  కలుపుట  వచ్చిన
టక్కున చెప్పేయ వచ్చు తదుపరి వారం ,
చిక్కుయు  ఏమియు  లేదిట
మక్కువ వుండాలి మీకు మనసుతొ  పాటున్

ఇక  ఎలాగో నేర్చు కొండి ,
 మనకి ఆంగ్ల నెలలు  పన్నెండు  కదా !వాటిని  నాలుగు భాగాలు చేద్దాం  అవి.
 జనవరి   ఫిబ్రవరి  మార్చి    ఏప్రిల్    మే   జూన్     జూలై  ఆగస్టు  సెప్టెంబర్    అక్టోబర్  నవంబెర్  డిసెంబెర్
     1            4         4             0        2       5         0        3           6               1           4            6

నెలల  క్రింద నున్న  అంకెలు జ్ఞాపకం  పెట్టుకోండి  (అవి  12 వర్గం ,ఐదు వర్గం , ఆరు వర్గం ,12 వర్గా నికి 2ఎక్కువ )
ఇక శతాబ్దాలు  :
 18 వ శతాబ్దం  అయితే 2, ; 19 శతాబ్దం  అయితే 0,  20 శతాబ్దం  అయితే 6, ; 21 శతాబ్దం అయితే 4 కలపాలి
సంవత్సరాలు: లో లీపు సంవత్సరాలు లెక్క కట్టా లి .
అది కట్టడం కష్టం కాదు  ఇచ్చిన సంవత్సరములో ఎన్ని లీపు వత్స రాలు ఉన్నాయో లెక్క కట్టాలి .
అది ఎలా అంటే ఆ సంవత్స రాన్ని  4 చేత భాగిస్తే  భాగ ఫలం  అవుతున్ది. ఉదాహరణ కి  48 సంవత్సరంలో
12  ( 48/4=12) లీపు సంవత్స రా లున్నాయి  34 లో 8 లీపు లున్నాయి
ఇవన్నీ కలిపీ  7 చేత  భాగిస్తే  భాగించగ వచ్చిన శేషం  బట్టి  వారం చెప్ప వచ్చు
శేషం  1 అయితే   ఆదివారం  , 2 అయితే  సోమ , 3 అయితే మంగళ , 4 అయితే  బుధ ,
          5 అయితే లక్ష్మి   ; 6 అయితే శుక్ర  , సూన్యమయితే శని  అని చెప్పాలి

ఉదాహరణ కు : ఇచ్చిన తేదీ  :- 05-09-1940 వారం కనుక్కోవాలని అనుకుందాం :
 ఇచ్చిన తేది :                                                   05 +
ఇచ్చిన నెల  :సెప్టెంబర్  కాబట్టి కలపవలసినది  06 +
శతాబ్దం  19  కాబట్టి కలపవలసినది                   00 +
సంవత్సరం                                           :            40 +
40లో వున్నా లీపు వత్సరాలు 40/4  -                10
      వీటి మొత్తం :                                     =  ---------- = 61
ఈ మొత్తాన్ని వారానికి 7 రోజులు
కాబట్టి 7 చేత  భాగిస్తే = 61/7 = శేషం :=    7) 61 ( 8
                                                                     56
                                                                   ------
                                                            శేషం = 5

  శేషం 5 కాబట్టి   వారం  =   లక్ష్మి వారం అవుతుంది
============================================================
మరో ఉదాహరణ  :     10-04-2013
       తేది =                           10 +
      నెల  = 4 కాబట్టి  =           0 +
    శతాబ్దం 20 కాబట్టి + =       6 +
    సంవత్సరం   =                  13 +
 13లో లీపు సం .లు                3 +
మొత్తము =                    =    (10+0 +6+13+3 = 32) 32/7  శేషం = 4
కాబట్టి వారం బుధవారం    ఈ రోజు ఉగాది
జాగేల , ప్రయత్నించండి
  


 

బుధవారం, ఏప్రిల్ 17

ఎటుల చేతునమ్మ ఈయుగాది

శ్రీ  విజయకు ఆహ్వానం
ఏ విధముగ తెలుప నొక్కొ  ఎరుగక  యుండెన్ !
" భావియు" అంతా తలచిన
ఆవేదన కానబడియె అందరి లోనన్ !

విద్యుత్ సంక్షో భముతో 
మాధ్యమ తరగతుల యందు మంటలు  రేగెన్ !
మధ్యానికి బానిసలై
హృ ద్యంబగు యువత భవిత ఊబిలో కూరెన్ !

గ్యాసు కొరతతో  గృ హి ణు  లాగ్రహము చెందె ,
వృత్తి కొరవడి  యువతంత  వెతను  చెందె ,
అప్పు  భీతితొ రైతన్న  ఆసువు  బాసె
సరకు  కొనలేక  సంసారి  సన్న బారె

పదవి  కోస  మిపుడు  పార్టీలు  మార్చుచూ
వలస వెళ్ళు  టందు  వడియు  పెరిగె ,
రాజి  నామ  లిపుడు  రాజ భోగాలయ్యె
నీటి లేని వారె  నేత లైరి

నేర  చరిత గల నేతలే ఈనాడు - రాజకీయపు కోట రాజులైరి ,
విద్యార్హతలు లేని వెడ్డు కోల్పులవారె - విద్యనున్ శాసించు వీరులయ్యె ,
అక్రమార్జన ససొ మ్ము  లార్జించు వారలే - అధికార పీఠాని కర్హు లయ్యె ,
వాడ వాడల బెల్టు  బార్ల కధి పతులె - మహనీయ మధ్యంపు మంత్రులయ్యె ,
మంత్రి వర్యుల  మాటకు  మడుగు లొత్తి
జీ ఒ  లిచ్చిన అధికార్లు  జైలు కెల్లె ,
మంత్రు లిచ్చు  హామీలతో  మతులు పోయె 
విజయుగాదియె తీర్పును  వెలువరించు !


                                     తెలుగు వారింట  తెలుగుకు  వెలుగు పోయె
                                    మమ్మి దాడీ లనుటయే మక్కువయ్యె !
                                    మాతృ  భాషను మరచుట  మంచి కాదు
                                    తల్లు  లికనైన  మేల్గాంచి  ధన్య తవరె !

                                   తెలుగు వాడుగ పుట్టియు  తెలుగు నింట
                                   తెలుగు మాట్లాడ కుండు ట  తెలివి యగున ?
                                  మా తృ  భాషను  మించిన మధుర  భాష
                                  మరచి పోయిన మనకింక  మనుగడేది ?

                                  మనసులో నున్న భావాల  మర్మ మెల్ల
                                  మా తృ  భాషనే వివరించ మన్న నగును ,
                                  అట్టి  భాషను  మరచియు  అన్య భాష 
                                  మాట లాడుట  మనకది మంచి కాదు

                                  తెలుగు భా ష కు  రక్షణ కలుగ జేసి,
                                 తెగులు  బట్టిన తెలుగును  తీర్చి దిద్ది
                                 తెలుగు భాషకు  పూర్వపు  వెలుగు  నీయ
                                 కరుణ జూపియు  కంకణం  కట్ట రారె

                                 తాత చెప్పేటి  ఆనాటి  నీతి  కధలు
                                 జోల  లాడించు  అమ్మమ్మ  లాలి పాట
                                 బ్రతుకు తెరువుకు  పనికొచ్చు శతక  నీతి
                                 తెలుగు నాటను  రావాలి  వెలుగు లీయ