పుట్టిన తేది తెలిపిన
పుట్టిన యా వార మేదొ బుద్ధితొ చెపుదున్
ఎట్టులొ ? చెప్పగ వలెనా ?
అట్టులె చెబుతాను నేను అందరు నేర్వన్ !
లెక్కలు కలుపుట వచ్చిన
టక్కున చెప్పేయ వచ్చు తదుపరి వారం ,
చిక్కుయు ఏమియు లేదిట
మక్కువ వుండాలి మీకు మనసుతొ పాటున్
ఇక ఎలాగో నేర్చు కొండి ,
మనకి ఆంగ్ల నెలలు పన్నెండు కదా !వాటిని నాలుగు భాగాలు చేద్దాం అవి.
జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబెర్ డిసెంబెర్
1 4 4 0 2 5 0 3 6 1 4 6
నెలల క్రింద నున్న అంకెలు జ్ఞాపకం పెట్టుకోండి (అవి 12 వర్గం ,ఐదు వర్గం , ఆరు వర్గం ,12 వర్గా నికి 2ఎక్కువ )
ఇక శతాబ్దాలు :
18 వ శతాబ్దం అయితే 2, ; 19 శతాబ్దం అయితే 0, 20 శతాబ్దం అయితే 6, ; 21 శతాబ్దం అయితే 4 కలపాలి
సంవత్సరాలు: లో లీపు సంవత్సరాలు లెక్క కట్టా లి .
అది కట్టడం కష్టం కాదు ఇచ్చిన సంవత్సరములో ఎన్ని లీపు వత్స రాలు ఉన్నాయో లెక్క కట్టాలి .
అది ఎలా అంటే ఆ సంవత్స రాన్ని 4 చేత భాగిస్తే భాగ ఫలం అవుతున్ది. ఉదాహరణ కి 48 సంవత్సరంలో
12 ( 48/4=12) లీపు సంవత్స రా లున్నాయి 34 లో 8 లీపు లున్నాయి
ఇవన్నీ కలిపీ 7 చేత భాగిస్తే భాగించగ వచ్చిన శేషం బట్టి వారం చెప్ప వచ్చు
శేషం 1 అయితే ఆదివారం , 2 అయితే సోమ , 3 అయితే మంగళ , 4 అయితే బుధ ,
5 అయితే లక్ష్మి ; 6 అయితే శుక్ర , సూన్యమయితే శని అని చెప్పాలి
ఉదాహరణ కు : ఇచ్చిన తేదీ :- 05-09-1940 వారం కనుక్కోవాలని అనుకుందాం :
ఇచ్చిన తేది : 05 +
ఇచ్చిన నెల :సెప్టెంబర్ కాబట్టి కలపవలసినది 06 +
శతాబ్దం 19 కాబట్టి కలపవలసినది 00 +
సంవత్సరం : 40 +
40లో వున్నా లీపు వత్సరాలు 40/4 - 10
వీటి మొత్తం : = ---------- = 61
ఈ మొత్తాన్ని వారానికి 7 రోజులు
కాబట్టి 7 చేత భాగిస్తే = 61/7 = శేషం := 7) 61 ( 8
56
------
శేషం = 5
శేషం 5 కాబట్టి వారం = లక్ష్మి వారం అవుతుంది
============================================================
మరో ఉదాహరణ : 10-04-2013
తేది = 10 +
నెల = 4 కాబట్టి = 0 +
శతాబ్దం 20 కాబట్టి + = 6 +
సంవత్సరం = 13 +
13లో లీపు సం .లు 3 +
మొత్తము = = (10+0 +6+13+3 = 32) 32/7 శేషం = 4
కాబట్టి వారం బుధవారం ఈ రోజు ఉగాది
జాగేల , ప్రయత్నించండి