తెలుగు వారింట తెలుగుకు వెలుగు పోయె
మమ్మి దాడీ లనుటయే మక్కువయ్యె !
మాతృ భాషను మరచుట మంచి కాదు
తల్లు లికనైన మేల్గాంచి ధన్య తవరె !
తెలుగు వాడుగ పుట్టియు తెలుగు నింట
తెలుగు మాట్లాడ కుండు ట తెలివి యగున ?
మా తృ భాషను మించిన మధుర భాష
మరచి పోయిన మనకింక మనుగడేది ?
మనసులో నున్న భావాల మర్మ మెల్ల
మా తృ భాషనే వివరించ మన్న నగును ,
అట్టి భాషను మరచియు అన్య భాష
మాట లాడుట మనకది మంచి కాదు
తెలుగు భా ష కు రక్షణ కలుగ జేసి,
తెగులు బట్టిన తెలుగును తీర్చి దిద్ది
తెలుగు భాషకు పూర్వపు వెలుగు నీయ
కరుణ జూపియు కంకణం కట్ట రారె
తాత చెప్పేటి ఆనాటి నీతి కధలు
జోల లాడించు అమ్మమ్మ లాలి పాట
బ్రతుకు తెరువుకు పనికొచ్చు శతక నీతి
తెలుగు నాటను రావాలి వెలుగు లీయ
మమ్మి దాడీ లనుటయే మక్కువయ్యె !
మాతృ భాషను మరచుట మంచి కాదు
తల్లు లికనైన మేల్గాంచి ధన్య తవరె !
తెలుగు వాడుగ పుట్టియు తెలుగు నింట
తెలుగు మాట్లాడ కుండు ట తెలివి యగున ?
మా తృ భాషను మించిన మధుర భాష
మరచి పోయిన మనకింక మనుగడేది ?
మనసులో నున్న భావాల మర్మ మెల్ల
మా తృ భాషనే వివరించ మన్న నగును ,
అట్టి భాషను మరచియు అన్య భాష
మాట లాడుట మనకది మంచి కాదు
తెలుగు భా ష కు రక్షణ కలుగ జేసి,
తెగులు బట్టిన తెలుగును తీర్చి దిద్ది
తెలుగు భాషకు పూర్వపు వెలుగు నీయ
కరుణ జూపియు కంకణం కట్ట రారె
తాత చెప్పేటి ఆనాటి నీతి కధలు
జోల లాడించు అమ్మమ్మ లాలి పాట
బ్రతుకు తెరువుకు పనికొచ్చు శతక నీతి
తెలుగు నాటను రావాలి వెలుగు లీయ
ఒహో ! ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు తిరిగి నీ బ్లాగు టపా చూసాను !
రిప్లయితొలగించండిసంతోషం. ఇక తరుచుగా రాస్తూ ఉండు.