బుధవారం, ఏప్రిల్ 17

ఎటుల చేతునమ్మ ఈయుగాది

శ్రీ  విజయకు ఆహ్వానం
ఏ విధముగ తెలుప నొక్కొ  ఎరుగక  యుండెన్ !
" భావియు" అంతా తలచిన
ఆవేదన కానబడియె అందరి లోనన్ !

విద్యుత్ సంక్షో భముతో 
మాధ్యమ తరగతుల యందు మంటలు  రేగెన్ !
మధ్యానికి బానిసలై
హృ ద్యంబగు యువత భవిత ఊబిలో కూరెన్ !

గ్యాసు కొరతతో  గృ హి ణు  లాగ్రహము చెందె ,
వృత్తి కొరవడి  యువతంత  వెతను  చెందె ,
అప్పు  భీతితొ రైతన్న  ఆసువు  బాసె
సరకు  కొనలేక  సంసారి  సన్న బారె

పదవి  కోస  మిపుడు  పార్టీలు  మార్చుచూ
వలస వెళ్ళు  టందు  వడియు  పెరిగె ,
రాజి  నామ  లిపుడు  రాజ భోగాలయ్యె
నీటి లేని వారె  నేత లైరి

నేర  చరిత గల నేతలే ఈనాడు - రాజకీయపు కోట రాజులైరి ,
విద్యార్హతలు లేని వెడ్డు కోల్పులవారె - విద్యనున్ శాసించు వీరులయ్యె ,
అక్రమార్జన ససొ మ్ము  లార్జించు వారలే - అధికార పీఠాని కర్హు లయ్యె ,
వాడ వాడల బెల్టు  బార్ల కధి పతులె - మహనీయ మధ్యంపు మంత్రులయ్యె ,
మంత్రి వర్యుల  మాటకు  మడుగు లొత్తి
జీ ఒ  లిచ్చిన అధికార్లు  జైలు కెల్లె ,
మంత్రు లిచ్చు  హామీలతో  మతులు పోయె 
విజయుగాదియె తీర్పును  వెలువరించు !


1 కామెంట్‌:

  1. అయినా, తప్పదు కదా పండుగ చేసు కోవడం. మీ పద్యాలలో చక్కని ధార ఉంటుంది. పద్యాన్ని అలవోకగా రాసే నేర్పు మీకు బాగా అలవడింది. అంతా ఆ శ్రీరాముని కృస

    రిప్లయితొలగించండి