ఎన్ని కలల కొస మెన్ని కలలొకంటి
కన్న కలలుఅన్ని కడలి కలసె !
ఎన్న బడిన వారు ఎనుగెక్కెను గాని
ఎన్ను కున్న వారు ఏడ్చి చచ్చె !
పదవి కోస మలక పరిపాటి అయ్యింది
అలుక మాన్ప వార లటక లెక్కె !
బ్రతియు మాలుకొనుటె అతియుగా అనిపించె
నీతి లేని వారె నేత లయిరి !
వయసు ముదిరి వార్కి వార్ధక్య మొచ్చినా,
పదవి కొరకు ఇంక ప్రాకులాడి
అలగి వలస వెళ్ళు ట ర్ధంబు ఏమిటో?
తెలుసు కొనగ వలయు ధీరమతులు !
ఒకరి మీద మరియొక రుమ్ముకొనుచు
మంచి కాదంచు ఇరువురూ ఎంచకుండ
పిలువ లేనట్టి తిట్లతో తిట్టు కొనుట
సిగ్గు లేనట్టి వారలే చేయు గదుర!
నిదుర లేవండి ఓటరు నేస్తులార
తరిమి వేయండి అవినీతి పరులనెల్ల
నీతి నియమాలు వీడిన నేతలకిక
స్థాన భ్రంసంబు చేయాలి సభల నుండి !
కన్న కలలుఅన్ని కడలి కలసె !
ఎన్న బడిన వారు ఎనుగెక్కెను గాని
ఎన్ను కున్న వారు ఏడ్చి చచ్చె !
పదవి కోస మలక పరిపాటి అయ్యింది
అలుక మాన్ప వార లటక లెక్కె !
బ్రతియు మాలుకొనుటె అతియుగా అనిపించె
నీతి లేని వారె నేత లయిరి !
వయసు ముదిరి వార్కి వార్ధక్య మొచ్చినా,
పదవి కొరకు ఇంక ప్రాకులాడి
అలగి వలస వెళ్ళు ట ర్ధంబు ఏమిటో?
తెలుసు కొనగ వలయు ధీరమతులు !
ఒకరి మీద మరియొక రుమ్ముకొనుచు
మంచి కాదంచు ఇరువురూ ఎంచకుండ
పిలువ లేనట్టి తిట్లతో తిట్టు కొనుట
సిగ్గు లేనట్టి వారలే చేయు గదుర!
నిదుర లేవండి ఓటరు నేస్తులార
తరిమి వేయండి అవినీతి పరులనెల్ల
నీతి నియమాలు వీడిన నేతలకిక
స్థాన భ్రంసంబు చేయాలి సభల నుండి !
ఎన్నాళ్ళకు వచ్చావే ... వానా ... వానా ...లాగా ఎన్నాళ్ళకు పెట్టావో కొత్త బ్లాగూ ...
రిప్లయితొలగించండిపద్యం నీ సొంత సేద్యం
అది ఎంతో హృద్యం
రుచికర ఖాద్యం
రుజాగ్రస్త సమాజానికి చేసే వైద్యం
మురళీ మోహనం ... అతి సమ్మోహనకరం ...
చాలా సంతోషం
రిప్లయితొలగించండి