మూడు పండగలు
భోగీ పండగ:
భోగి మంటకు కఱ్ఱలు ప్రోగు జేసి
గుమ్మ మందున ముగ్గులు గుమ్మ రించి
గోయి త్రవ్వియు చుట్టునూ గొబ్బిలుంచి
అర్ధ రాతిరి మంటను నంట జేయు
సాంప్ర దాయము ఎలానో సన్నగిల్లె
భోగి పిడకల దండలు బొందు కూర్చి
భోగి మంటలో అవి వేసి భాగ్య మొంది
స్నానమును జేసి బట్టలు మేను దాల్చి
పెద్ద లాశీస్సు బదియగా వేల్పు లిడె డి
సాంప్ర దాయము ఎలానో సన్నగిల్లె
ముత్తై దువలను పెరంటమునకు పిలచి
బుజ్జి పాపని అమ్మమ్మ ఒజ్జ నుంచి
వాయనమ్మిచ్చి పిల్లలకి పైస లిచ్చి
భోగి పళ్ళను పోయుచు మురెసెనట్టి
సాంప్ర దాయము ఎలానో సన్నగిల్లె
సంక్రాంతి :
దక్షిణము నుండి ఉత్తర ద్వారమునకు
చీకటిని చీల్చి వెలుతురు చిందు చేయు
సూర్య దేముడు గమనంము మార్చు రోజు
సంక్ర మాన ము నుండియే సంకర మించు
పొలము నందు పండు ఫలసాయ ఫలములు
ఇంటి కొచ్చు రోజు ఈదినమ్మె
అంబరాలు తాకి సంబరాలను తాకు
సంద డైన రోజు సంకు రాత్రి
మరణ మొందిన పెద్దలన్ మనసు నిల్పి
జ్ఞప్తి పెట్టుకు వారిని తృప్తి పరుచ
నూత్న వస్త్రాలు గురువుకు దాన మిచ్చి
పర్వ దినముగ సంక్రాంతి పరిగ నించె
సాంప్ర దాయము ఎలానో సన్నగిల్లె
పట్టు చీరలు చక్కగా కట్టు కొనియు
పసుపు కుంకుమ ప్రతి ఇంట పంచు కొనియు
ఆడపడుచుల సంబర అంబరాలు
పెద్ద పండగ రోజునే ప్రియము నొప్పు
కనుమ:
సేద్య పనులలో ఎంతయో సేవ జేసి
అలసి సొలసియు గోవుల కంజ లిడుచు
పిల్ల పాపల తొడుగా పొలము కేగి
కనుమ రోజున భూమికి ప్రణతు లిడ రె !
సాంప్ర దాయము ఎలానో సన్నగిల్లె
శుభా కాంక్షలు :
భోగి మంటల కెగిసెది భాగ్య సిరులు
సంకు రాతిరి పండగ సంబరాలు
కనుమ పల్కెడు నవరాగ కవిత ఝురులు
ఎల్లా కాలము మీ యింట నిమడ గలవు
భోగీ పండగ:
భోగి మంటకు కఱ్ఱలు ప్రోగు జేసి
గుమ్మ మందున ముగ్గులు గుమ్మ రించి
గోయి త్రవ్వియు చుట్టునూ గొబ్బిలుంచి
అర్ధ రాతిరి మంటను నంట జేయు
సాంప్ర దాయము ఎలానో సన్నగిల్లె
భోగి పిడకల దండలు బొందు కూర్చి
భోగి మంటలో అవి వేసి భాగ్య మొంది
స్నానమును జేసి బట్టలు మేను దాల్చి
పెద్ద లాశీస్సు బదియగా వేల్పు లిడె డి
సాంప్ర దాయము ఎలానో సన్నగిల్లె
ముత్తై దువలను పెరంటమునకు పిలచి
బుజ్జి పాపని అమ్మమ్మ ఒజ్జ నుంచి
వాయనమ్మిచ్చి పిల్లలకి పైస లిచ్చి
భోగి పళ్ళను పోయుచు మురెసెనట్టి
సాంప్ర దాయము ఎలానో సన్నగిల్లె
సంక్రాంతి :
దక్షిణము నుండి ఉత్తర ద్వారమునకు
చీకటిని చీల్చి వెలుతురు చిందు చేయు
సూర్య దేముడు గమనంము మార్చు రోజు
సంక్ర మాన ము నుండియే సంకర మించు
పొలము నందు పండు ఫలసాయ ఫలములు
ఇంటి కొచ్చు రోజు ఈదినమ్మె
అంబరాలు తాకి సంబరాలను తాకు
సంద డైన రోజు సంకు రాత్రి
మరణ మొందిన పెద్దలన్ మనసు నిల్పి
జ్ఞప్తి పెట్టుకు వారిని తృప్తి పరుచ
నూత్న వస్త్రాలు గురువుకు దాన మిచ్చి
పర్వ దినముగ సంక్రాంతి పరిగ నించె
సాంప్ర దాయము ఎలానో సన్నగిల్లె
పట్టు చీరలు చక్కగా కట్టు కొనియు
పసుపు కుంకుమ ప్రతి ఇంట పంచు కొనియు
ఆడపడుచుల సంబర అంబరాలు
పెద్ద పండగ రోజునే ప్రియము నొప్పు
కనుమ:
సేద్య పనులలో ఎంతయో సేవ జేసి
అలసి సొలసియు గోవుల కంజ లిడుచు
పిల్ల పాపల తొడుగా పొలము కేగి
కనుమ రోజున భూమికి ప్రణతు లిడ రె !
సాంప్ర దాయము ఎలానో సన్నగిల్లె
శుభా కాంక్షలు :
భోగి మంటల కెగిసెది భాగ్య సిరులు
సంకు రాతిరి పండగ సంబరాలు
కనుమ పల్కెడు నవరాగ కవిత ఝురులు
ఎల్లా కాలము మీ యింట నిమడ గలవు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి