సమయ పాలన పాటించి సమయమునకు
మేలు కొలిపియు మాకును మేలు జేయు
ఆది దేముడు సూర్యుడే అందరికిని
అందు కోవయ్య మాయొక్క వంద నాలు !
ఎర్ర బారిన గోళంగ ఎదురు నిలచి,
శీత లంబైన కిరణాల శేద తీర్చి ,
ఒక్క సారిగ తీక్షణ వికిర ణాలు
ప్రసర నిచ్చెడి నీకు మా వందనాలు !
ఒక్క రోజులో లోకాన్ని చక్క జుట్టి
వెలుగు నిచ్చెడి ప్రభలతో విస్త రించి
దివ్య తేజస్సు తో మమ్ము తీర్చి దిద్ది
దరిని నిల్చెడి ప్రత్యక్ష దైవ మీవు !
వెలుగు నిచ్చుచు చీకటిన్ తొలగ జేసి
మత్తు వది లించి ప్రజలకు హితము గూర్చు
మార్గ దర్శక మహనీయ మాన్యు డీవు,
అందు కోవయ్య హార్దిక వందనాలు
బీద సాద యనెడి భేదంబు లేకుండ
మతము జాడ్య మంత మసిని జేసి
జాతి, కులము యనెడి జాడ్యంబు చూపని
బాల భానున కివె మా వందనాలు
**********
తెల్ల వార గానె " తెన్నేటి పార్కులో "
"ఆహ- ఓహొ యనుచు అరుచు కొనుచు
గెంతు లేయు చుండి కేరింత లాడగా
విందు జేతు వయ్య వెలుగు తోడ !
నీవు రావంగ మేమెల్ల నిలువ బడియు
ఒక్క సారిగ నీయొక్క దిక్కు జూచి
చేయి జాపియు మనసార చేతు లెత్తి
కొలుచు కొందుము రక్షించి మేలు జేయ !
*********
మేలు కొలిపియు మాకును మేలు జేయు
ఆది దేముడు సూర్యుడే అందరికిని
అందు కోవయ్య మాయొక్క వంద నాలు !
ఎర్ర బారిన గోళంగ ఎదురు నిలచి,
శీత లంబైన కిరణాల శేద తీర్చి ,
ఒక్క సారిగ తీక్షణ వికిర ణాలు
ప్రసర నిచ్చెడి నీకు మా వందనాలు !
ఒక్క రోజులో లోకాన్ని చక్క జుట్టి
వెలుగు నిచ్చెడి ప్రభలతో విస్త రించి
దివ్య తేజస్సు తో మమ్ము తీర్చి దిద్ది
దరిని నిల్చెడి ప్రత్యక్ష దైవ మీవు !
వెలుగు నిచ్చుచు చీకటిన్ తొలగ జేసి
మత్తు వది లించి ప్రజలకు హితము గూర్చు
మార్గ దర్శక మహనీయ మాన్యు డీవు,
అందు కోవయ్య హార్దిక వందనాలు
బీద సాద యనెడి భేదంబు లేకుండ
మతము జాడ్య మంత మసిని జేసి
జాతి, కులము యనెడి జాడ్యంబు చూపని
బాల భానున కివె మా వందనాలు
**********
తెల్ల వార గానె " తెన్నేటి పార్కులో "
"ఆహ- ఓహొ యనుచు అరుచు కొనుచు
గెంతు లేయు చుండి కేరింత లాడగా
విందు జేతు వయ్య వెలుగు తోడ !
నీవు రావంగ మేమెల్ల నిలువ బడియు
ఒక్క సారిగ నీయొక్క దిక్కు జూచి
చేయి జాపియు మనసార చేతు లెత్తి
కొలుచు కొందుము రక్షించి మేలు జేయ !
*********