కోయిలమ్మ గడసు కూతల సొగసుతో , తెలుగు యింటి కొచ్చె తొలి యుగాది ; సంబ రాల తోడ అంబ రాలను దాటి శోభ కూర్చ వచ్చె శుభ యుగాది 1 వేప పూవు చేదు తీపి చెరుకు రసం కొత్త బెల్ల మందు కూర్మి కలిపి మంచి రుచుల నిచ్చు మామిడి పచ్చడి నవ్య తెలుగు వంట నవ యుగాది 2 పండ గంటి పూట పంచాంగ శ్రవణమ్ము కవులు వ్రాసి నట్టి కవిత ఘోష్టి; పెద్ద వారు పలుకు వేద సూక్తుల తోడ మధుర మంత మోయి మన యుగాది 3 స్కాము లన్నియు బయటకు సాగ తీసి దేశ ద్రోహుల చరితను త్రిప్పి జూపి , పాడు అవినీతి అధికార్ల మదము నణచి నని మేల్కొ ల్పె ' శ్రీఖర ' వత్స రమ్ము 4 దోచు కొనియెడి ధూర్తుల దోషములకు శిక్ష నిచ్చియు , సన్మార్గ రక్ష నిచ్చి , కొత్త వెలుగును , ప్రజలకు కూర్మి నీయ స్వాగ తాంజలి నిత్తు "శ్రీ నంద' నముకు 5 దేశ రక్షణ బాధ్యత తీసుకొనియు, యువకు లందరు మేల్గాంచి యుక్తి మీర, అక్ర మార్జన , అవినీతి అంత మొంద, కంక ణంబును కట్టరే ! కాంతు లిడగ 6 నందన నామ వత్సరము నవ్యత నొప్పెడి కొత్త కాంతి తో అందరి మెప్పులన్ బడసి అభ్యు దయామృత ఆవ లంబమై ; సందడి చేయు సంపదలు , సంస్క్రతి నిల్పుచు నెల్ల వేళ లా నందము పొందు భాగ్యమును నందియ గోరుచు పూజ చేయుదున్ ! 7 మావి చిగురు తినగ మామిడి కరు వయ్యె విరియ పూయ లేదు వేప పూవు ; చింత , చెరుకు ధరలు చేరు వందున లేవు అంజలుల తోడె ఆహ్వాన మంద చేతు 8 శ్రీ కరమౌ శ్రీ నందన మీకేల్లను శుభము లిచ్చి మేలును చేయన్ శ్రీ కరు డౌ భగ వంతు డు సాకారము లీయ గలడు సముచిత రీతిన్ ! ******
Ads – Why this ad? T&C apply. Online Share Trading Made Easy with ICICIdirect.com. | 4 more Show details Ads – Why these ads? Naukri.com - Register Now Your Job Search Ends here! Top MNCs, Best Profile, High CTC. Submit Your Resume 2-10 years Exp. Salary 3-15 Lakhs. To Apply, Register on Shine.com Now Looking for Circle Data? Find Circle Data on Facebook. Sign Up Free Now! Lowest Domestic Airfares Book a Delhi To Bangalore Flight & Save Up To 40%. Book Now. Hurry! FedEx IBL Challenge Back Share your Success Business stories & Get a chance to visit China! The Sale Is On Up To 75% Off On T-Shirts, Perfumes Shoes, Jewelery & More On eBay.in HDFC Hiring for Mar 2012 8000+ P.O. Job Openings in March. Upload Resume.Apply to HDFC Now! Buy Baby Products Online Buy Branded mom & Baby products at Mahindra Retail's Online Store . |
7% full
Using 607 MB of your 7693 MB
©2012 Google - Terms & P
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి