ఆదివారం, మార్చి 25

కార్పోరేటేడ్ ఆశు పత్రులు

              అవుసరము యున్న లేకున్న అనవసరపు
              టెస్టు లెన్నియో వ్రాసేసి  ట్రీటు మెంటు 
              చేయు చున్నట్టు "ఐ .సి.' లొ చేర్చి వేసి 
              గుంజు తున్నారు డబ్బులు కోట్ల కొలది     1 

              ట్ర్రీటు మెంటు కన్న టెస్ట్ల కే ఖర్చంత 
              కాన బడుయు చుండె గణిత మందు 
              మందు లెన్ని వాడ  ఫలితంబు శూన్యమౌ,
              ప్రాణ మందు "ఆశ ' వదలగలమ?            2 

              హెల్తు కార్డు లోని ఎంటైరు సొమ్మంత 
              పూర్తి యగుయు వరకు వుంచు కొనియు, 
              పిదప చేయు నట్టి "వైద్యంబు " లేదంటు
              గెంటి వేయు చుండె  ఇంటి కడకు               3 

              విద్య తోబాటె దిగజారి వైద్య వృత్తి,
              వట్టి వ్యాపార కేంద్రంగ మారి పోయె; 
              ప్రాణములు నిల్పు బ్రహ్మగా ప్రస్తు తించు 
              గౌర వంబంత గంగలో కలసి పోయె !          4  

               డాక్ట ర్లంతా యిప్పుడు,
               యాక్టర్లుగ  మారి పోయి యాక్హను జేస్తూ ,
               ఫాక్టులు , తెలిసిన జెప్పక ,
                హట్టాసము చేయు చుండె  అనవసరంగా !  5 

               చేతి నాడియు కొట్టెడి రీతి బట్టి ,
              రోగి బాధను పసిగట్టి రోగమునకు 
              మనసు తగినట్టు రోగికి మందు లిచ్చు 
               వైద్య నాధులు కరు వయ్యె వైద్య మందు        6 

     ఇది అందరి వైద్యుల కోసం వ్రాసింది కాదు 
     కక్కుర్తికి గడ్డి తినే వారి కోసం వ్రాసింది 
     భుజాలు   తడుము కో కండి  మరి .

                
         
             
  

6 కామెంట్‌లు:

  1. హహహ! భలే వ్రాశారు! నిజానికి ఇలాంటి వారే ఈ కాలంలో ఎక్కువ!

    రిప్లయితొలగించండి
  2. కోట్లు ఖర్చు పెట్టి డాక్టరు పట్టా కొనుక్కొని వస్తున్న డాక్టర్లకి ఇలా చేస్తే కానీ గిట్టుబాటు కాదు మరి.

    రిప్లయితొలగించండి
  3. మా పట్టణంలో కూడా కార్పొరేట్ ఆసుపత్రులు కట్టేస్తున్నారు. ఒక కార్పొరేట్ ఆసుపత్రివాళ్ళు బస్ స్టాండ్ నుంచి తమ ఆసుపత్రి వరకు ఉచిత ప్రయాణ వాహనం నడుపుతున్నారు. కానీ లోపలికి వెళ్ళిన తరువాత చార్జెస్ ఎంత తీసుకుంటారో తెలియదు.

    రిప్లయితొలగించండి
  4. very good poetry. very meaningful and nice
    keep writing on present day issues for posterity.

    రిప్లయితొలగించండి
  5. మీ ధర్మాగ్రహానికి మీరిచ్చిన కవితా రూపం బాగుంది.మీ కవిత్వంలో ఆశు కవిత్వ పోకడలు కనిపిస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  6. చక్కని అభిప్రాయాలంద జేసిన
    రసజ్ఞ , ప్రవీణ్ మాతంగి , మురళీ కాంతా రావు ,
    కృష్ణ & కృష్ణా రావులకు కృతజ్ణతలు .

    కోట్లు ఖర్చు పెట్టి పట్టాలు కొనుకొచ్చి ,
    గిట్టు బాటు కొరకు చెట్టు లెక్క ,
    మానవతకు అపుడు మనుగడే ముంటుంది ?
    సుందరంబగు వృ త్తిలో చులక నవరే ?

    రిప్లయితొలగించండి