దీప మొకటైన తన కాంతి దిశలు దాటి
వ్యాప్తి చెందియు చీకటి బాపునదియె !
"జ్ఞాను " డొక డైన ఆతడి జ్ఞాన కాంతి
జ్ఞానులను జేయు పరిసర జాతివరుల 1
జ్ఞాన వంతుడయ్యు జ్ఞానంబు విడనాడి
స్వార్ధ చింత నొంది , జ్ఞాన మొదలి
ప్రజల తప్పు త్రోవ పట్టించు వారికి
శి క్ష నీయ వలయు తక్ష నంబు ! 2
కలసి మెలసి యున్న తెలుగు జాతిని చీల్చి
ముక్కలవగచూడ మూర్ఖ తమ్ము ,
కలసి మెలసి యున్న కలదు సుఖమనియు
నేర్చు కున్న నీతి నీట మునిగె ! 3
పులిని చూచి నక్క తలవాత పెట్టెడి
చంద మలరి యుండె సంస్కృతి పు డు ;
కాలి నడక ఎన్ని గ్రామాలు తిరిగినా
పల్లె ప్రజల బ్రతుకు బాగు పడున ? 4
కాళ్ళ తోడి నడువ , కాళ్ళ పీకులువచ్చు
బొబ్బ లెక్కి కాళ్ళ జబ్బు లొచ్చు ;
కష్ట సుఖము లేరుగ కారులో వెళ్ళినా
తెలియ గలవు వాట్ని తీర్చ వచ్చు 5
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి