ఓట్ల కోసం సీట్ల కోసం ఊచ కోతలు భావ్యమా?
ప్రజల హక్కులు భంగ పరచుట ప్రజాపాలన యందుమా ?
పార్ల మెంటును నడప డానికి పదును కత్తులు వలయునా?
రాష్ట్ర విభజన పోరు కోసం రాయబారా లేలనోయ్ ?
ఐక మత్యమె మహాబలమని అంద రెదుటా చాటరా !
కలసి యుంటే కలదు సుఖమని కమలనాథుని వేడరా !
సిరులు నింపే నదీ జలములు చెదిరి పోకను చూడరా!
వృత్తి పరమగు పదవులందున బేధ భావము లేలరా?
చదువు కొనియెడి పిల్ల వారలు చకితు లవ్వక చూడరా !
వలస వచ్చీ వాస మొందెడి ప్రజల భీతిని మాన్చరా !
వత్స రాలుగ కలసి యుండే బంధు హితులను వీదియూ
పెంపు చేసిన మహా నగరము వీడ మనుటయు భావ్యమా?
తెలుగు లంతా ఒక్కటే యని తెలుగు గళమున చాటరా !
తెలుగు భాషకు వన్నె తెచ్చే తీయ కవితలు వ్రాయరా!
తెలుగు జాతిని విడియ గొట్టే తీర్పు రాకను ఆపరా!
తెలుగు వెలుగుకు జిలుగు లిచ్చే తెగువ ధాత్రిని నిలుపురా!
సాంప్ర దాయపు విలువ లెప్పుడు చావ కుండగ చూడరా !
కట్టు, బొట్టుల అంద మెప్పుడు గౌర వించుట నే ర్పురా!
వేష భూషణ లందు పిల్లల వెర్రి చేష్టలు మాన్చరా !
నీటి నియమాల్ విడిచి పెట్టుట నెఱవు కాదని తెలుపుమా !

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి