ఆడ పుట్టుకకును అమ్మాయె బాధ్యత
అనుచు చెప్ప ఎంత అనుచితమ్ము ?
"ఆడ పిల్ల పుట్ట " అదియొక శాపంగ
పరిగ నించ మనకు సరియు కాదు 1
ఆడ మగల యొక్క అన్యోన్య ప్రేమతో
కలసి నందు వలనె "గర్భ" మొందు
గర్భ శిశువు ఆడొ ? కాక మగ యగునొ?
చెప్ప వశము గాదు చివరి వరకు 2
"క్రోమొ -జోము " లనెడి సూక్ష్మ కణము లెన్నో
ఆడ మగలయందు అమరి యుండు
జీవ కణము లవియె జీవ వృద్ధిని పొంది
పోష నిచ్చు నవియె మొద మలర 3
ఎక్సు యక్సులు మగువలో నమరి యుంటె
ఎక్సు తో" వై" లు మగవారి నమరి యుండు
మగువ ,పురుష సంపర్క మగుట వలనె
వంశ వృద్ధికి కారణం బయ్యె జగతి 4
మగువ లోని "యక్సు" బగవారి "యక్సు" తో
కలియు నందు వలనె కలుగు "ఆడ"
మగువ లోని "యక్సు" మగవారి "వై " కలియ
ఎపుడు మగయె పుట్టు ఇదియు నిజము 5
ఏవి ఎపుడు కలియొ ఎవరు చెప్పగ లేరు
కలియు నంత వరకు తెలియ బడదు
శాస్త్ర మితుల జెప్ప శాపాలు ఎందుకొ
నింద ఆడ పిల్ల కెందు కొ చ్చొ ? 6
అనుచు చెప్ప ఎంత అనుచితమ్ము ?
"ఆడ పిల్ల పుట్ట " అదియొక శాపంగ
పరిగ నించ మనకు సరియు కాదు 1
ఆడ మగల యొక్క అన్యోన్య ప్రేమతో
కలసి నందు వలనె "గర్భ" మొందు
గర్భ శిశువు ఆడొ ? కాక మగ యగునొ?
చెప్ప వశము గాదు చివరి వరకు 2
"క్రోమొ -జోము " లనెడి సూక్ష్మ కణము లెన్నో
ఆడ మగలయందు అమరి యుండు
జీవ కణము లవియె జీవ వృద్ధిని పొంది
పోష నిచ్చు నవియె మొద మలర 3
ఎక్సు యక్సులు మగువలో నమరి యుంటె
ఎక్సు తో" వై" లు మగవారి నమరి యుండు
మగువ ,పురుష సంపర్క మగుట వలనె
వంశ వృద్ధికి కారణం బయ్యె జగతి 4
మగువ లోని "యక్సు" బగవారి "యక్సు" తో
కలియు నందు వలనె కలుగు "ఆడ"
మగువ లోని "యక్సు" మగవారి "వై " కలియ
ఎపుడు మగయె పుట్టు ఇదియు నిజము 5
ఏవి ఎపుడు కలియొ ఎవరు చెప్పగ లేరు
కలియు నంత వరకు తెలియ బడదు
శాస్త్ర మితుల జెప్ప శాపాలు ఎందుకొ
నింద ఆడ పిల్ల కెందు కొ చ్చొ ? 6
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి