హద్దు మీరి పెరిగి అధికమై జనసంఖ్య
జాతి ప్రగతి నేడు జాడ్య మయ్యె !
పరిమితి పరివార పథ కమ్ము పాటించి
జగతి నడప వలయు "ప్రగతి పథము" 1.
సంతు ఎక్కువుండ సంతోష మేకాని
హద్దు మీర గానె ముద్దు పోవు ;
" అవధి దాటి పోతే అటం కముల్ వచ్చు
అవధి లోనె దాన్ని ఆప వలయు 2
హద్దు మీర గానె అన్ని ఆటంకాలె
గాలి, నీరు, తిండి కరువు యగును
ప్రజలు పడుదు రంత పడరాని ఇక్కట్లు
ప్ర కృతి యంద మంత వికృతి యగును 3
పట్ట ణాల వసతి ప్లాట్లకు మారెను
ప్లాట్ల లోని పాట్లు ప్రజల కెరుకె
గాలి వెలుతు రచట కని పించ దెప్పుడూ
నీరు వాడు కంబు , బోరు లయ్యె 4
వేస వొస్తె చాలు విద్యుత్తు ఉండదు
బోరు లెండి పోయి నీరు రాదు
గాలి,నీరు నేల కరువయ్యె ఈనాడు
బ్రతుకు బ్రతక డమ్ము భార మయ్యె 5
జనుల పెరుగు దలకు సరిపడు వనరులు
పెరగ కుండ నేడు తరుగు చుండె
వనరు లందు తరుగు ధరవర్లు పెరుగగా
సగటు మనిషి బ్రతుకు సంకట మయె ! 6
జాతి ప్రగతి నేడు జాడ్య మయ్యె !
పరిమితి పరివార పథ కమ్ము పాటించి
జగతి నడప వలయు "ప్రగతి పథము" 1.
సంతు ఎక్కువుండ సంతోష మేకాని
హద్దు మీర గానె ముద్దు పోవు ;
" అవధి దాటి పోతే అటం కముల్ వచ్చు
అవధి లోనె దాన్ని ఆప వలయు 2
హద్దు మీర గానె అన్ని ఆటంకాలె
గాలి, నీరు, తిండి కరువు యగును
ప్రజలు పడుదు రంత పడరాని ఇక్కట్లు
ప్ర కృతి యంద మంత వికృతి యగును 3
పట్ట ణాల వసతి ప్లాట్లకు మారెను
ప్లాట్ల లోని పాట్లు ప్రజల కెరుకె
గాలి వెలుతు రచట కని పించ దెప్పుడూ
నీరు వాడు కంబు , బోరు లయ్యె 4
వేస వొస్తె చాలు విద్యుత్తు ఉండదు
బోరు లెండి పోయి నీరు రాదు
గాలి,నీరు నేల కరువయ్యె ఈనాడు
బ్రతుకు బ్రతక డమ్ము భార మయ్యె 5
జనుల పెరుగు దలకు సరిపడు వనరులు
పెరగ కుండ నేడు తరుగు చుండె
వనరు లందు తరుగు ధరవర్లు పెరుగగా
సగటు మనిషి బ్రతుకు సంకట మయె ! 6
మంచి విషయం చెప్పారు.అక్షర దోషాల్నీ గణ భంగాలనీ పరిహరిస్తే కవిత ఇంకా రాణిస్తుంది.
రిప్లయితొలగించండిమీ సూచనలకు మీకృతజ్ఞ తలు. సరిచేసాను చూడ గలరు
రిప్లయితొలగించండి