ఏడుకొండల వెనుకకు నె క్కి నీవు
కూరుచున్నావు ,మేమెట్లు చేరగలము?
చేరు కున్నను నీ సేవ చేయు టెట్లు ?
చేరు కున్నట్లె ,తలచి యాశీస్సులిమ్ము !
వినుము నా మాట నిజమిది వేంకటేశ !
ఏడు కొండలె కాదు ,నీ వేడ ను న్న
ముడుపు చెల్లించి ,మోక్షమ్ము పొంద గోరి
భక్తు లందరు ,నినుజేర పరుగు లిడుచు
భక్తి తోవచ్చు వారికి ముక్తి నిమ్ము !
వినుము నా మాట నిజమిది వేంకటేశ !
కష్ట ములకోర్చి ,నీదు ప్రాంగణము చేరి
మనసులో నున్న తమ కోర్కె మనసు నుండ
త్రోసి వేయుచు నుండిరి 'దూత' లచట ,
భక్త కోటికి నీ విచ్చు బహుమతదియ?
వినుము నా మాట నిజమిది వేంకటేశ !
మ్రొక్కు బడి తీర్చు నాశతో , మోజు పడిన ,
రైలు టిక్కెట్లు , బసలు , కాళీలు లేవు ;
అన్ని సేవల టిక్కెట్లు అమ్ము డయ్యె ,
ప్రాప్త ముండిన దర్శన భాగ్య మగును
వినుము నా మాట నిజమిది వేంకటేశ !
పూజ చేయంగ మాయింట , పూలు లేవు ,
దక్షణీయంగ మెండుగా ధనము లేదు ;
సేవ చేయుచు పూజను చేయుదమిట
మమ్ము దీవించి యా శీస్సు లిమ్ము దేవ !
వినుము నా మాట నిజమిది వేంకటేశ !
కోర్కె లెన్నున్న ,నీ ముందు కోర లేము ,
కోరు కొనకుండ , అవిమాకు తీరు టెట్లు ?
మనసు లో నున్న కోరిక మనవి జేయ
చేయు చున్నారు పూజలు,'ఖాయ 'మిదియె !
వినుము నా మాట నిజమిది వేంకటేశ !
వచ్చి శ్రీవారి బ్రహ్మోత్స వముల వేడ్క ,
కన్ను లారంగ జూచు భాగ్యంబు లేక ,
పరిత పించెడి మాబోటి భక్తులకును
యింట నే జూచు భాగ్యంబు నిచ్చి నావు
వినుము నా మాట నిజమిది వేంకటేశ !
కూరుచున్నావు ,మేమెట్లు చేరగలము?
చేరు కున్నను నీ సేవ చేయు టెట్లు ?
చేరు కున్నట్లె ,తలచి యాశీస్సులిమ్ము !
వినుము నా మాట నిజమిది వేంకటేశ !
ఏడు కొండలె కాదు ,నీ వేడ ను న్న
ముడుపు చెల్లించి ,మోక్షమ్ము పొంద గోరి
భక్తు లందరు ,నినుజేర పరుగు లిడుచు
భక్తి తోవచ్చు వారికి ముక్తి నిమ్ము !
వినుము నా మాట నిజమిది వేంకటేశ !
కష్ట ములకోర్చి ,నీదు ప్రాంగణము చేరి
మనసులో నున్న తమ కోర్కె మనసు నుండ
త్రోసి వేయుచు నుండిరి 'దూత' లచట ,
భక్త కోటికి నీ విచ్చు బహుమతదియ?
వినుము నా మాట నిజమిది వేంకటేశ !
మ్రొక్కు బడి తీర్చు నాశతో , మోజు పడిన ,
రైలు టిక్కెట్లు , బసలు , కాళీలు లేవు ;
అన్ని సేవల టిక్కెట్లు అమ్ము డయ్యె ,
ప్రాప్త ముండిన దర్శన భాగ్య మగును
వినుము నా మాట నిజమిది వేంకటేశ !
పూజ చేయంగ మాయింట , పూలు లేవు ,
దక్షణీయంగ మెండుగా ధనము లేదు ;
సేవ చేయుచు పూజను చేయుదమిట
మమ్ము దీవించి యా శీస్సు లిమ్ము దేవ !
వినుము నా మాట నిజమిది వేంకటేశ !
కోర్కె లెన్నున్న ,నీ ముందు కోర లేము ,
కోరు కొనకుండ , అవిమాకు తీరు టెట్లు ?
మనసు లో నున్న కోరిక మనవి జేయ
చేయు చున్నారు పూజలు,'ఖాయ 'మిదియె !
వినుము నా మాట నిజమిది వేంకటేశ !
వచ్చి శ్రీవారి బ్రహ్మోత్స వముల వేడ్క ,
కన్ను లారంగ జూచు భాగ్యంబు లేక ,
పరిత పించెడి మాబోటి భక్తులకును
యింట నే జూచు భాగ్యంబు నిచ్చి నావు
వినుము నా మాట నిజమిది వేంకటేశ !