పొడవగు జడతో పాటుగ
జడ యందలి పూలు కూడ చక్కగ మెరెసెన్ !
అడుగులు వేసిన తోడనె
పడతులతోపాటు జడయు వంకర పోవున్ ! 1
జడ పొట్టిది మెడ పొట్టిది
జడ వేయగ కురులు పొట్టి చచ్చే దెట్లా ?
జడ నైతే సవరించెద
మెడ సవరణ సాధ్య మెటు లొ ? మీరే చెపుడీ ? 2
జడ గంటలు ,మెడ గంటలు
జడ చుట్టూ పూలదండ జటిలంబనుచున్ ,
జడ సొగసుకు యంద మవగ ,
జడ నల్లక విరగ బోయు సంస్కృతి పెరిగెన్! 3
తడ కొట్టీ జడ కురులను
ముడి వేయక ద్రౌపదపుడు పూనెను శఫధమ్ !
జడ యందలి సౌభాగ్యము
కడ వరకూ యుండ వలయు కాంతల కెపుడున్ ! 4
జడ కుచ్చులు సవ రింపగ
ఎడపడగా బ్యూటి కేర్లు ఎది గెను కానీ
సడలిన దేహము తోడుగ,
జడ రంగుల మార్పు లన్ని సహజము కాదా!
జడ పొట్టిది, మెడ పొట్టిది పద్యం సెభాసో !
రిప్లయితొలగించండి