బాపు రమణలు అపురూప ప్రాణ హితులు
వారి బంధము అరువది వత్స రాలు
మాట ఒకటియె ,నడచిన బాట ఒకటె
తత్వ మొక్కటె, పరమాత్మ చిత్వ మొకటె ! 1.
ఆణి ముత్యాలు బాపుగారక్షరాలు ,
గీత సారాంసమే బాపు ' రాత-గీత' ,
శిల్ప చాతుర్య మంతటన్ సిరులు గొలుపు
బాపు చిత్రాలు ఓ కళా రూప మణులు . 2
బాపు రమణీయ చిత్రాల వాస్తవాలు
సహజ ప్రకృతన్దాలకు సాక్షికములు ,
పల్లె సీమల పదకేళి పలుకు జిలుగు
బాపు రమణుల కమనీయ చూపు సరళి 3
బుడుగు సృష్టించి చిచ్చుల పిడుగు జేసి ,
రెండు జడలున్న సీతతో ఫ్రెండు జేసి
చిలిపి సీగాన ప్రసునాంబ చెలిమి గలిపి
వాసి గాంచిరి చరితలో ' బాపు-రమణ ' 4.
కొత్త నటులను తెరపైకి ఎత్తి తెచ్చి
తీర్చి దిద్దియు వారికి తెరువు జూపె ;
తీర అందాలు నిలిచేల సినిమ జేసి
ప్రజల హృదయాన నిలచారు ' బాపు-రమణ ' 5
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి