ఆదివారం, నవంబర్ 27

పాడు ఇన్విజిలేషను- మాస్టర్ల దురవస్థ :

పాడు ఇన్విజిలేషను- మాస్టర్ల దురవస్థ :

ఒరే ! పంతులా ! అని నన్ను ఆప్యాయంగా పిల్చే ఏకైక మాస్టారు , మా శ్రీ క్రొవ్విడి రామం మాస్టారు.
B.A.BL. చేసి B.Ed, చేసి పార్వతీపురం బోర్డ్ హై స్కూల్ లో మాకు సోషల్ స్టడీస్ చెప్పేవారు. సోషల్ కన్నా అతనికి తెలుగులో పాండిత్యం ఉండేది. పిల్లల కోసం చాల పుస్తకాలూ రాసారు.  తన ఒక పుస్తకాన్ని ఘంటసాల కి కన్యాదానం చేసేరు అప్పుడు అడిఒక గొప్ప గా అనుకునే వాళ్ళం .బెలగం, సంజీవి క్వార్టర్స్ లో ఉండేవారు. పిల్లల్ని పిలచి తను వ్రాసిన పద్యాలు చదివి పద్యాలు ఎలా రాయాలో చెప్పేవారు.
నేనూ మాస్టారు అయేక , ఒక సారి తన దగ్గర పబ్లిక్ పరీక్షలకి ,ఇన్విజిలేషన్ చేసే భాగ్యం కలిగింది 
పరీక్షలు అన్నీ అయిపోయేక ఆఖరి రోజు , సరదాగా  ఇన్విజిలేషన్ ఎలావుంది మాస్టారు? అన్నా!
వెంటనే , ఆశువుగా ఒకా పద్యం చెప్పారు అది ఇన్విజిలేషన్ కి వెళ్ళినప్పుడల్లా చెబుతూ వుండే వాడ్ని.
అది మీ కోసం:
                         స్లిప్పులను యేరి చీపుగా స్వీపరయితి
                         పేర్మి విండోల కెగబడు పెద్ద లెల్ల      
                         వెడలె ; నేనింక హాయిగా విశ్ర మింతు
                         అనుభవించితి ప్రారబ్ధ మధ్బుతముగ ! 

ఆ తరువాత కొన్నేళ్ళకి ,  ఇన్విజిలేషన్ మీద నేను వ్రాసిన పద్యం కొత్త కలాల లో పాడు ఇన్విజలేషను- మాస్టర్ల దురవస్థ పేరుతొ మొదటి సారిగా అచ్చు అయింది అది మీ అందరి కోసం:

           స్లిప్పు పట్టు కొనుట చేత కాదంటినా - అధికారి నామీద అలుసు జేయు;
           తెచ్చిన స్లిప్పులన్ తీసేసు కొందునా - విద్యార్ధి లోకమ్ము విరగి పడును;
           పట్టి నట్టియు స్లిప్పు పారేసి వేస్తినా - పిరికి  వానిగ నేను పిలువ బడుదు;
          చూసి చూడనట్లు చూడ కుండున్టినా- ఆత్మాభి మానమ్ము యడ్డు తగులు;
                              ఖరము కంటెను మేమంతా కష్ట పడియు
                              మూడు గంటల సేపు మే  ముంటి మేని
                               రెండు రూపాయలయ్య మా రేటు కూలి              
                              వద్దు వద్దుర ఈ పాట్లు వద్దు మనకు !
పీ .య స్.: ఈ పద్యం అచ్చు అయేక కూలి నాలుగు రూపాయలు చేసేరు ప్రభుత్వం



;






శుక్రవారం, నవంబర్ 25

కథా మంజరి: వేథం దిట్టగ రాదు ! ... కానీ ...

కథా మంజరి: వేథం దిట్టగ రాదు ! ... కానీ ...
వేధను తిట్టగ రాదని
మేధసు తో దూర్జటయ్య భేషుగ తిట్టెన్
పద్యానికి తగ్గుట్టుగా మీరు చేసిన
వ్యాఖ్యానం చాలా బాగుంది

గురువారం, నవంబర్ 24

కంపలుసరి -మధ్య తరగతి బతుకులు

కంపలుసరి -మధ్య తరగతి బతుకులు

                                      బట్టలుంచు కొరకు పెట్టైన లేకున్న
                                       గాడ్రేజు బీరువా కంపలుసరి

                          వందలు వేలైన వడ్డీలు కట్టైన   
                                       కలరు టీ.వీ నేడు కంపలుసరి
                          
                          వీధి బడులయందు మేధావి  గురువున్న
                                        కాన్వెంటు చదువులే కంపలుసరి

                          పెట్రోలు ధరలెంత పెంచి వేసిన గాని
                                       కార్లలో షీకార్లు కంపలుసరి

                               బ్యాంకు వడ్డీకి జీతమ్ము బదిలి కాగ
                               ఇంటి ఖర్చులు సర్దంగ నెట్టు లనుచు
                               బాధ పడుచును లోలోన రోధనొంది
                               మధ్య తరగతి బ్రతుకులు మంట గలిసె
                
             
                          

కంపలుసరి

                 మోర్నింగు నే లేచి ముఖమైన కడుగక 
                                      కాఫీని త్రాగుట కంపలుసరి
                 విడియము తరువాత విల్సను సిగరెట్లు
                                     గంటకొక పేకట్టు కంపలుసరి

                 ఈవినింగున రోజు ఇన్సల్టు అనియెంచి
                                   కాంతతో సినిమాకి కంపలుసరి

                  ఇంటిలో పనిలేక వంటరై యుండ్లేక
                                   క్లబ్బులో సిక్వేన్సు కంపలుసరి 
                      చేత దమ్మిడీ లేనిచో నీతి మాలి 
                                 స్త్రీల గళమందు వ్రేలాడు తాళి బొట్ట
                      అమ్ముటయునుకంపలుసరి లయ్యె నిట్టి
                       కంపలుసరీలతో మన కొంపలు సరి

      

పద్యం- ఘంటసాల

 పద్యానికి సంగీతము
హృది మెచ్చెడి భాణినీయ  ఉన్నతి నిచ్చున్
మధురమ్మగు గొంతుకతో
పద్యానికి ఘంటసాల ప్రాణము పోయున్

బుధవారం, నవంబర్ 23

ఆంగ్ల అక్షరాలతో మంత్రుల రచ్చబండ


                            A న్ని ఎన్నిక లోచ్చినా ఏమి ఫలము
                            B ద వారిని చూసిన నాధు లేరి?
                            C టు ముందర వాగ్ధాన మాట లన్ని
                            D ల పడిపోయి తదుపరి మూల పడును.

                           E ప్పుడిప్పుడే దేశంబు ఎదుగు చుండె
                           F సిబీసీల పేరుతో ఎడమ పరచి
                          G వి తాలతో కలతలు చేర్చి కూర్చ
                          H చ్చుసంఖ్యలో అవినీతి పెచ్చు పెరిగె

                         I కమత్యపు మాటను యలుసు జేసి
                        J యము కాంక్షించు వారికి జడుపు కలుగ
                        K క లేయుచు వారిని కించ పరుచ
                        L ల్ల వారలు సహనమ్ము కోలు పోయె

                      M . ఎ, ఎం. టెక్కు , బీటెక్కు, ఎమ్సి ఏలు,
                     N త చదువులు చదివిన ఏమి టగును?
                     O టు బాంకును  నోట్ల తో కాటు వేయ
                     P ల్ల వారిలో  నిస్పృహల్ పేరు కొనియె

                    Q లు  కట్టియు యువకులు  వేల కొలది
                    R త్త నాదాలు చేయుచు నరుచు  చుండ 
                    S  యస్సంటు మంత్రులు  ఎల్ల జేరి
                    T వి లోనుండి వినిపించె వింత వార్త

                    U వకు లందరు మెచ్చుతూ యూర డిల్ల
                    V సుగు చెందిన ఓటర్ల  మెప్పు పొంది
                   W  యూజికి పని  కొచ్చి  ,డబ్బు పొందు
                   X లేన్టగు ప్లానులు ఎంచి నాము
                   Y  న్క ? అధికార్లు ఎస్సంటే బిల్లు పెట్టి
                   Z  డ్జి మెంటును పెడుదుము జనుల మధ్య

   
 




 
  

  
    

మంగళవారం, నవంబర్ 22

రాజకీయ సమ్మెలు

 
 
సకల జనుల సమ్మె స్వార్ధంబు పిలుపుతో
పేద వారి పొట్ట ప్రేగు కదిలె!
వాహనాల మీద పరుగు లెట్టే డి i వార్కి,
నడిచి వెళ్ళు వారి బెడద లేల?

చదువు కొనియెడి విద్యార్ధి చదువు పోయె
కూలి చేసెడి  పనివారి కూలి పోయె,
అమ్ము కొని బ్రతుకు వ్యాపారి సొమ్ము పోయె,
ప్రగతి లొ నడ్చు రాష్ట్రపు పరువు పోయె!

బస్సు ఆటోలు సమ్మెంటు బందు జేయ,
ఆస్తు లన్నియు ద్వంసంబు నవగ జేయు,
నష్ట మెవరికి ? పేదోళ్ళ నడ్డి విరగి
రోజు గడవని కూలీలు రోడ్డున పడు

కే.సి.ఆర్, కే కె. కొదండ్ల కేల త్రయము
దుష్ట త్రయముగా  రాష్ట్రాన్ని బ్రస్టు జేసె!
కొట్టి కొట్టియు వారిని కొట్లో వేయ,
 సమ్మెలన్నియు పూర్తిగా సమసి పోవు.

వారు  చెప్పిన్డే వేదంగా మలచ మనుచు
నోటి కొచ్చిన విధముగా మాట లాడి
శాంతి గా యున్న రాష్ట్రమ్ము కాంతి నంత
రౌడి  ఇజముతో  రాష్ట్రాన్ని పాడు జేసె!

ప్రజల పట్లను వారికి మోజు లేదు
వారి మోజంత రాబోవు కుర్సి పైనె;
రాష్ట్ర విభజన సమ్మెతో రాదు గాని
 బందు పేరట పేదోళ్ళ బ్రతుకు చెడును !

ప్రాంత బాగుకు విభజనే మార్గ మగున?
ఎన్ను కున్నట్టి ప్రతినిధి నడ్డి విరచి
చేసుకోవాలి అభివృద్ది చేత నై తె ;
నోరు మెదపక ఇన్నాళ్ళు యూర కుండి
ఇపుడు చింతించి వగచిన ఏమి ఫలము?

రెక్క యాడిన రోజునే డొక్క యాడు,
పనియు లేకున్న పస్తుయే వారి బ్రతుకు
కష్ట పడితే నె రోజులు గడవ కుండే,
కష్ట పడకుండ రోజులు గడుచ టెట్లు?

వడ్డీ తో బాటు జీతంబు వచ్చు ననుచు,
మంత్రి అయినట్టు ఆర్డరు పాసు జేసి
యూర డి స్తుండె సర్కారు ఉద్యోగులను
వారి కిస్తారు పైవారి మాట ఏమి?
పూట గడవని కూలీల మాట ఏమి?

సోమవారం, నవంబర్ 21

తెలంగాణా సమ్మెలు

                     సమ్మె పేరున బందు చేయుచు
                     ప్రభుత ఆస్థిని ధ్వంస పరుచుచు
                     చదువు చక్కగ చదువు కొనియెడి
                     పిల్ల వారిని ప్రొత్స హించుట

                                మంచి యగునని యెంచి నారా? 

        
                    రాజ ధానికె మకుట మణిమయు
                    అమర వీరుల విగ్ర హాలను
                    విరగ కొట్టీ పార వేస్తే
                    రాష్ట్ర విభజన జరుగు తుందా?
                                మంచి యగునని యెంచి నారా?

                    
                   తెలిసి తెలయని కుర్ర కారుల
                   అసంధర్భపు ఆత్మ హత్యలు
                   బీద తల్లుల కడుపు శొషకు
                  రాజకీయుల కంటి తుడుపే
                               మంచి యగునని యెంచి నారా?

కోడి విలాపం


    
తల్లి పండగ మరునాడు  తప్పకుండ  పూజ చేసిన కలుగును పుణ్య మనుచు
కోడి పిల్లను బలి ఇచ్చి కూర వండి బంధు మిత్రుల కొక్కింత పంచ నెంచి  !   1
నిశిని గడవగ హాయిగా నిదుర జేసి తెల్ల వారక పూర్వమే తెలివి రాగ
నూతి కడ కేగి నీటితో నోరు కడిగి  కోళ్ళ ఫారము కెల్లితి కోడి కొరకు    2
నే నొక  పిల్ల కోడి కడ నిల్చి గభాలున ముందు కేగి : చే
యానెడు నంత లోనే యది యార్తిని జూపు చు నోరు విప్పి, మా
ప్రాణము తీతువా?నరుడ! పాప మటంచును కూత పెట్ట : నా
మానస సీమలో తళుకు మన్నది "కోడి విలాప " మంత టన్ !  3
కోడి పలికిన మాటలో గొప్ప నిజము  దేవి కోరదు జగతిని జీవహింస
మనిషి స్వార్ధాని కిదియొక మారు పేరు అమ్మ పేరిట జచ్చును అల్ప జీవి    4
తల్లి జూపిన దారిని తప్పకుండ  వేడ్క జీవించు మమ్మిట్లు వేరు జేసి
పూజ పేరున చంపుట  పుణ్య మగున ? కరుణ విడ నాడి పూజ చేయ నేల ?    5
బుద్ది యున్నది విజ్ఞాన  సిద్ది కలదు జంతు బలి ఎంతో తప్పని చదివినావు
మ్రొక్కు బడిపేర నా పీక నొక్కి జంపు హీన కార్యంబు మిక్కిలి హీనమవధ ?   6
అల్పులము మేము కీడంటు సలుప లేము మానవులగూడి మనసిచ్చి  మసలు చుండి
అండము నిచ్చి వారిని యాద రించు మమ్ము జంపుట ధర్మమామానవులకు   7
తాతల నాటి సంప్రతిని తప్పక చేయుట ధర్మ మంచు; మీ
జాతికి మేలు చేయు గతి జాగృతి పెంచగ తెల్లవారి ,
మా కూతల తోనే లేపుదుము కూలికి వెళ్ళేడు కర్మ చారులన్
తరి కాల చక్రముకు నెన్నగ పెన్నిధి కోడి కూతయే !    8

కొక్కురో  యని మా కోడి కూత వినగ
వీధి గుమ్మాన ముగ్గులు వేయు తల్లి
హలము పట్టిన రైతన్న  పొలము పోవు
గుడిని గంటలు మ్రోగించు గురువు గారు   9

పిల్లల చేరు వయ్యదము పిల్లల తోడనె ప్రాంగనంబు, నం
దల్లరి చేయు పిల్లల తొ యాడుచు పాడుచు గెంతులేసి ; మీ
చెల్లని నూకలే తినుచు చిందులు వేయుచు సంచ రింతు మే
మల్లరి ఏమి జేస్తిమని హత్యకు మీరలు పూనికుంటిరో ?    10

పౌరు షానికి మా జాతి పేరు బడగ
వేడుకలు పెట్టి సమరంబు  క్రీడ పెట్టి
వూరు వాడల మా లోనె పోరు పెట్టి 
సంబ రాలను జూచుట సరస మగునె ?  11

కక్షలే లేని మాకాళ్ళ కత్తి గట్టి
కత్తులను నూరి మీ కుళ్ళు కక్ష తీర
రక్త వాహిని పారించు  రాక్షసంబు
నీచ  మని తెలియదా నీతి పరుడ ?    12

జాతిని పెంపు చేయుటకు చక్కని పద్ధతు లాచరించి ; మా
జాతిని వృద్ది జేసి కడు చక్కని ఫారము లెన్నొ కట్ట ; మీ
జాతికి కోడి పట్ల గల చక్కని భావము జూసి మేము ; మా
రాతలు మారె నంటు బహు రంజలి నారము సంత సంబుగా ! 13

ఫారములనుండి మమ్ముల బయట పెట్టి
లారి చక్రాల బండిపై లాగు కొనుచు
పొరుగు యూరుల తోలుకు పోవుచుండ
ప్రకృతిని జూచి మా గుండె పరవ సించె                                  14 

చేరాను విడనాడి బయటకు చేరి మేము
నింగి కెగురుట సుఖమని పొంగి నాము
గొంతు పైకెత్తి కూ కుహుల్  కూసినాము
ఎరుగామైతిమి తరువాత మరణ బాధ                                 15 

గోల చేస్తున్న మాయందు జాలి లేక
పీక నులుముట మీకంత ప్రీతి కరమ ?
కాల్చి చంపియు తిందురా ? కటిను  లార !
అల్ప జీవుల పట్ల మీకింత అలుసు ఏల ?                            16 

బుద్ధ దేముడు బాపూల బోధనలలొ
జీవ హింసయు  తప్పంచు తెలుప లేద ?
అట్టి మహానీయులేందరో పుట్టు గెడ్డ
మీరు హింసలు చేయుట మెచ్చ తగున ?                           17 

శుద్ధ గంగతో వంటిని శుద్ది జేసి
పసుపు కుంకుమ నుదుటను పట్టి వ్రాసి
మూడు మారులు దేవికి మ్రొక్కి తిప్పి
కొడవలిని బట్టి మా పీక కోయ తగున                                  18

అనుచు పిల కోడి తన బాస నాలపించ
బదులు చెప్పుట కేమియు పాలు పోక
పూలతో దేవి నర్చించి పూజ చేయ
తిరిగి వచ్చితి నిజమైన తెలివి నొంది  !                                 19           

(మిహిరలో ప్రచురితం)













   


 






శనివారం, నవంబర్ 19

అవినీతి





కోట్ల కొలది ధనము కొన్నేళ్ళ నుండియు 
స్విస్సు బ్యాంకు లందు చేర్చ బడియె 
అట్టి ధనమునంత అర్ధాన్తరంముగా
తీసి వేయు టంత తేలికగున? 

రాజకీయులంత రాష్ట్రాలు మ్రింగేసి 
దాచి పెట్టు కున్న ధనము యదియె ;
రామ దేవు కాదు రాముడే వచ్చినా 
నల్ల ధనము తీయ వల్ల కాదు.

ధరలు తగ్గు దలకు ధర్నాలు చేసినా
దీక్ష లెన్నొ జేసి త్రిప్పు లిడిన 
పోరు పెట్టి ప్రజలు భోరునా ఏడ్చినా 
ధరలు పెంచె గాని తగ్గ లేదు.

రాజకీయపు అవినీతి రాజ్య మేలి 
మూల మూలల దేశాన్ని కూల్చు చుండె.
కూర్చు కొన్నట్టి ధనమంత కొల్ల గొట్టి,
సద్దు చేయంగ ఎవరికి సాధ్య మగును.?

అన్న హాజరె అంతటి ఆశ జీవి,
వెతుకు చున్నాడు అవినీతి వెలికి తీయ,
పార్ల మెంటులో బిల్లును ప్రతిప దించ
జంకు చున్నారు మంత్రులు చత్తు మనుచు
టూజీల స్కాములో రాజా యమాత్యులే - కట కటాల వెనుక కాన బడియె!
అక్రమ మైనింగు ఆర్జితంబున నేడు - గాలి సోదరులంత జైలు కెళ్లే! .
తండ్రి పవరు తోడ ధనమెల్ల దొచేసి - జగజెట్టి జగనుడు సాక్షి అయ్యె !
అక్రమార్జిత సేవ అవినీతి కేసులో - తిరుమలేసుని చానలే దొరికి పోయె!
అర్హతే లేని అవినీతి పరులే నేడు 
నీతి వాక్యాలు పలికెడి నేతలయ్య్
నోట పలికిన ప్రతిమాట బూట కాలె
నమ్మ రాదండి ఎవరినీ నమ్మ వలదు!

సిగ్గు మాలిన నేతల నిగ్గు తేల్చి 
పరువు పోయేల వారిని తరిమి కొట్ట 
కడలి రావాలి యువ శక్తి కవనమునకు 
అప్పుడే కదా అవినీతి అంత రించు .








విశ్రాంతి


విశ్రాంతి 


తీరు బడిలేని జీవన -సరళి యందు
ప్రక్రుతి అందాలు తిలకించి - పరవశించి
మెచ్చు కొనియెడి తీరికే -మియును లేక
బ్రతుకు చున్నారు బాధలన్ -మనుజు లిపుడు 1

నింగి నెగెరెడి తెల్లటి - కొంగ పంక్తి
చెట్ల మధ్యన కట్టిన - చిలుక గూడు
ఆకసంబున కనుపించు - హరియు విల్లు
నేరుగా చూచు భాగ్యపు - తీరి కేది? 2


పండ గందున హరిదాసు - పాట గాని
గంగి రెడ్డుల క్రీడల - భంగి కాని
కోడి పోరుల పందాల - వేడి కాని
చూచి ఆనంద పడియెడి - సొగసు లేదె?! 3
పగలు రాత్రియు అనియెడిమాట లేదు
పనుల యందున తీరిక - కానబడదు
"లాబు టాబులు సెల్ ఫోన్లె '- లాలి తములు
 ఇంట యుండిన విశ్రాంతి - ఏమి గనము 4

 ఇరుగు పొరుగుల వారలు - ఎరుక పడరు
 అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు - అన్న లందు
 మమత అనురాగ మొలికించి - మాట లాడు
 సమయమే లేదు కలిసుండి - సాయ మలర 5

 యాంత్రి కమ్మున రోజులు - గడుచు చుండె
 భార్య బిడ్డల తోడుగా - బయట కెళ్ళి
 మనసు విప్పియు మాట్లాడ - మవుట లేదు
 మరిచి పోయారు విశ్రాంతి - మాట యిపుడు 6

నా మారుషిస్ అనుభవాలు ...

                       దేశంబు చుట్టునూ  దివ్యమో సాన్ద్రమ్ము
                                   వివిధ రంగులలోన విశద మగును
                       వీధి ముందర వాన-వెనుకాల సూర్యుండు
                                  ఇంద్ర ధనసుల పంట నిచట  కంటి   
          
                    గలగలా పారేటి సెలయేర్లు నిచ్చోట
                             కాలుష్య రహితమై జాలు వారు 

                        ఆకు పచ్చని చెట్లు అందమో పూలతో
          
                                  ప్రతి ఇంట ముంగిటా పరవ సించు
   
                       భారతీయత యొప్పు -ప్రాంత మందు
                       ఆంధ్రులన్నచో వీరికి -అమిత ప్రేమ
                       తెలుగు తల్లికి జేజేలు - తెలుపు కొనుచు
                       పనులు చేతురు ఇచ్చోట - ప్రాంత వరులు        1 

                      వేల్పు లిడగ యిచట -వెంకటేశ్వర డొప్పె
                      తిరుపతయ్య వార్లె -తీర్థ మిచ్చు
                      దక్షిణాది వేల్పు -తల్లి దుర్గమ కూడ
                      విష్ణు మూర్తి తోడ -వెలసె నిచట !         2 

                      ఆకసమ్మునుతాకుచూ -అద్భుతముగ
                      ఈశ్వరుని యొక్క నిలువెత్తు -నిండు మూర్తి
                      అద్భు తమ్ముగ"శివమూర్తి' -అవతరించి
                             కనుల విందుగ నిచ్చోట - కానుపించు !            3

పుష్పా వేదన


 
                           కొక్కురోయని కోడియు కూత కూయ
                           వేకువందునే మేల్గాంచి వివస మొంది,
                           దైవ పూజకు పూలను తేవ నెంచి,
                          పూల తోటకు నేగితి పూలు కోయ,                                         1

                                    జాలి కురిపించు జంధ్యాల పూల కవిత
                                    ఎచట నుండియో వినిపించె అచట నాకు
                                    మనసు మార్చుకు కొమ్మను విడిచి పెట్టి
                                    వట్టి చేతుల ఇంటికి పయన మైతి                                            2

                                   పయన మవుతున్న నను జూచి మల్లె యొకటి
                                           "
వెళ్ళి పోబోకు మిత్రమా! వెళ్ల కనుచు "
                                   నేల పడియున్న పూలను నెత్తి జూపి
                                   దీన మలరగ వినిపించె వింత కధను                                          3

                                  వాడి రాలిన మము జూడ వచ్చి నావ?
                                 పూజ కొరకునే పూవులు పూయు ననుచు
                                 భక్తి శ్రద్ధతో మమ్ముల పట్టు కెళ్ళి
                                 పూజ చేసెడి వారు మీ పూర్వ జనులు                                            4                               
                       రంగు రంగుల పూవుల రాసి పోసి, 
                       ఊలు దారాలతో మమ్ము మాల గూర్చి 
                       స్వామి మెడలోన మము వేయు సమయ మందు,
                                       
ఎంత ఆనంద పడితిమో ఎరుక పడదు.                                       5
 
                           మంత్రపు నీళ్ళు జల్లి మము మంత్రము తోడనె పూజ చేసి , యా 
                     చెంతన యున్న భక్తులకు చింతలు పోవగ ఇచ్చి నంత , వా   
                     రంతయు పూజ పూవులని ఆత్రత తోడుగ చేత బట్ట ; మే 
                          మెంతగ పొంగి పోయితిమొ ? తరి చేసిన పుణ్య మంచు చున్        6   

                          నూట ఎనిమిది పూవులు పూజ చేసి
                                    
మంత్ర మంత్రంబు కోక్కొక్క మహిమ జెప్పి ,
                                   
స్వామి పాదాల చెంతన జార విడువ  
                                   
ప్రభువు సేవకు ఉపయోగ పడితి మనుచు                
                                   
అమిత ఆనంద పడితిమి అబ్బురముగ                                       7  
                    
                         పూజ చేసిన వాడిన పూల నన్ని
                                    భద్ర పరిచియు మర్నాడు పదిలముగను
                                    తులసి మొక్కల నడుమున తురిమి యుంచి
                                    జలము నర్పణ చేసియు జార విడరె !                                         8

                                   గోళెముల లోన మట్టిని గుమ్మ రించి,
                                   మొక్కలను నాటి ప్రతి రోజు మోద మలర,
                                  నీరు పోయుచు ప్రాణాలు నిలుపు మీకు ,
                                   పూల నిచ్చెడి సంతృప్తి పొంది నాము !                                        9

                                    పెండ్లి కూతురు అందంబు వెల్లి విరియ
                                  మల్లె జాజులు జడలోన మాల తురిమి
                                   బంధు హితులంత మెచ్చుతూ పరవ సించ
                                  జన్మ ధన్యత అయినంత సంభ్రమొందె !                                      10

                                  సభల యందున సత్కవుల్ సత్క రించ
                                  పుష్ప గుచ్చము లిచ్చుచు ప్రోత్స హించ
                                  వారి గౌరవ మంతయు మాదె అనుచు
                                 గొప్పగా మేము చప్పట్లు కొట్టి నాము                                        11

                               హరికధను చెప్పు హరిదాసు హార మందు,
                               పూల దండయే దాసుకు ప్రోత్స హమ్ము;
                              హరియు నామమె ప్రజలకు హర్ష మనుచు
                               బ్రతుకు చున్నాము ఇన్నాళ్ళు పరువు తోడ                              12

                               సిగను ముడుచు కొనెడి చిరు పూల దండయే,
                               భార తీయ స్త్రీకి గౌర వమ్ము ;
                              పెళ్లి రోజు తెచ్చు మల్లె పూదండయే
                                ప్రియుడు సఖికి ఇచ్చు ప్రేమ గుర్తు !                                           13

   ప్రకృతికె కాదు జనులకు బహు విధాల
అందము తొ బాటు ఆహ్లాద మంద చేయు
మమ్ము వెలి వెయ మీ కెట్లు భావ్య మయ్య?
ప్రజల కుపయోగ పడ నట్టి బ్రతుకు లేల?                                  14

   అడవి కాచిన పూలలా అంత రించ
పుట్టి గిట్టిన మా కెట్లు పుణ్య మబ్బు?
ప్రభువు సేవకు ఉప యోగ పడుయు నటుల
సాయ మొందించి మా పట్ల జాలి గొనుమ?                           15       

అనుచు పూలన్ని నా మీద ఆగ్ర హించ
పూజ సరిపడ పూలను ప్రోగు చేసి
పూల నర్పించి దైవాన్ని పూజ చేయ
పరుగు పరుగున ఇంటికి పయన మైతి !                                   16

                           వెళ్ల పోబోవు నన్నట  వెళ్లనీక,
ఆపి వేసింది అటను ఓ  అవిటి పూవు
అవిటి వారిపై మీకేల? అలుసు అనుచు
జాలి గొలిపేడు  గొంతుతో పలికే నిటుల!                              17

అవిటి పూలపై మీ కింత అలుసు తగున ?
పనికి రావంటు  మమ్మిట వదిలి వెళ్ల
దైవ చెంతన యుండియు  సేవ జేయు
భాగ్యముయు కూడ లేదంట భావ్య మగున?                        18

 మేము చేసిన పాపంబు ఏమిటయ్య?
అవిటి అనుచును మమ్మిట అలుసు జేసి
పార వేయుట ధర్మమా? మానవులకు
మానవత కిట్టి యోచన మన్న నగున ?                             19

 అవిటి పూవులు పూజ కనర్హులనుచు
వీధి బయటకు జిమ్మియు వెలియ వేసి,
కాళ్ళతో తొక్కి మసి జేసి కాల్చ తగున?
మాన వత్వము మరిచిరా? మనుజు లార ?                         20

అవిటిమే  కాని  పూజకు అర్హులవమ ?
ఎవరు పెట్టారు ఈ కాంక్ష లెందు కయ్య? 
అంగ హీనుకు చేయూత నంద జేయ
పుణ్య మే కాని పాపంబు పొసుగు టెట్లు?                            21

అవిటి పూవుల ఆక్రోష మంత వినియు,
ఇదియె నిజమంచు మనసులో నెంచి కొనియు,
అంగ హీనుల సేవకే అంకిత మవ,
నిశ్చ యించితి వారికే సేవ లియగ !                                   22