మంగళవారం, డిసెంబర్ 27

చిత్ర సీమ చెద

 వినిపించదే నేడు వీనుల విందైన -ఘంటసాల మధుర గాత్రమిపుడు 
కనిపించదే నేటి సినిమాలలో హాస్య -నటరత్న రేలంగి నటన మనకు 
చెలగ దే  నేటి చిత్రాలలో యస్వి.రం - గారావు గద్గద కంట మిపుడు 
ఆగుపించ కుండె నే అత్తపాత్రలమేటి -సూర్యకాంతము వంటి సుదతిమనకు
              చిత్రసీమకు ఎంతయో సేవ జేసి 
              కీర్తి పొందిన మేటి సావిత్రి లేదె!
              ఏమి ఏమయ్యె? ఆ కీర్తి ఇపుడు మనకు 
              దిద్ద రారండి నిర్మాత దీరు లార !
ఆడమగంచు నెంచక నె యందరు పిల్లలు చేరి యొక్కడన్ 
ఆడుచు గెంతు లేయుదురు అర్ధము  పర్ధము లేని పాటలన్ 
పాడుచు డాన్సు చేయగ నె - ప్రక్కన చేరిన పెద్దలందరా
వేడుక వింత దృశ్యమును వీక్షణ చేయ రె ? ఎం తొ వింతగాన్!


కధయు యుండదు , నీతియు కానరాదు
పాటయందున సాహిత్య పటిమ లేదు 
కాన రా కుండె సంగీత కళయు కూడ ;
నిటుల యుండిన సినిమాల నెటుల చూతు !


సీనును బట్టి పాటలకు చిత్రణ యుండెను పూర్వ మందునన్
సీనియు ఏదియైన , అది చిత్రపు గాధకు యోప్పకున్డినన్
సీను లొ  భారిఎత్తునన్ సెట్టును వేయుచు , బ్రేకు డాన్సులన్
సీను లొ  గుమ్మరించు రవి ' చీయని ' విజ్ఞులు మోము త్రిప్పగన్!


స్పీడు పాటలనెడి పేరును పెట్టేసి 
డ్రమ్సు పోవునటుల డ్రమ్సు కొట్టి 
పాట హోరు లోన మాట అర్ధము కాక 
అతియు కాదు గాని మటియు పోయె!


అన్నపూర్ణా వారి అపురూప చిత్రాలు -మచ్చుకైన లే వె మంచివిపుడు 
విజయ  డ న్ఖా మ్రోగు విజయ సంస్థల యొక్క -పౌరాణిక చిత్రాలు మరల రావె
భరణి సంస్థల యొక్క భారి సంగీతంబు -చిత్ర మొకటి యైన  చిత్ర మవదె;
జానపద చిత్రాలు చక్కగా నిర్మించు - విటల ఆచార్యుండు వెలుగు లేదు 
          మంచి కధలను చిత్రాలు మలచు నట్టి
          జెమిని సంస్థల పేరును చెరిగి పోయె ;
           తెలుగు సినిమాల ప్రతిభను తీర్చి దిద్ద 
           సమయ మొచ్చింది సమరంబు సల్ప రండి !


           విలను పాత్రకి భాణీను మలచు నట్టి 
            నాగభూషను గొంతుక మూగ బోయె;
           కొత్త తరహా లొ  మాటలు గూర్చి చెప్పు 
           రావు గోపాల రావింక  రాదు మరల 
    
          
డిషుము డిషుము వంటి  డిస్కోల డాన్సులు 
వెగటు పుట్టునట్టి వెర్రి జోక్సు 
ఆడు మాట కిపుడు రెండేసి అర్ధాలు 
చిత్రసీమ కిపుడు చెదయు పట్టే !
 

 

4 కామెంట్‌లు:

  1. very good.well written poems. with little more effort you can avoid the small mistakes here and there.
    Eee topic ki seesapadyalani enchukovadamlone mee prathibha kandabaduthondi. marinni manchi kavithal kosam eduru choostrhamu.

    రిప్లయితొలగించండి
  2. ఏవి తల్లీ ! నిరుడు కురిసిన హిమ సమైహములు ?

    వెనుకటి తరం లోని అమేయ ప్రతిభావంతులను కళ్ళ ముందు ఉంచేరు.
    మీ పద్య రచన కొత్త పుంతలు తొక్కింది. పదను తేరింది. ధారా శుద్ధి కలిగిన రక్కని పద్యాలు అందించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. పై వ్యాఖ్యలో హిమ సమూహములు అని ఉండాలి. టైపు పొరపాటు.

    రిప్లయితొలగించండి