సోమవారం, డిసెంబర్ 12

తెగులు పట్టిన తెలుగు యువత

                         అమ్మ నాన్న లిపుడు - 'మమ్మి- డాడీ' లయ్యె!
                'ఆంటి - అంకు' లయిరి - అత్త - మామ !            
                ఆశ్ర మాల కెల్లె  -  అమ్మమ్మ ,తాతయ్య       
                తెలుగు యువత కిపుడు తెగులు పట్టె !

                ఆకు ముందు వేసి అన్నము తినియడి
                పధ్ధ తంత నేడు ప్రక్క బడియె! 
                ప్లేటు పట్టు కెళ్ళి - ' పెట్టారా! కాస్తంత'
                అనుచు అడుగు  కొనెడి - తినుట వచ్చె!

                కిచిడి తో పులావు రుచులు మరిగినేడు,
                పప్పు అన్నము రసపు  వంట మరిచె;
                       బూర్లు, గార్లు ,సద్ది - పూర్తిగా మరిచేరు
                'ఫ్రయిడు ,పాని- పూరి ' ప్రియము లాయె!

                వార  మంత మందు  వారింట తినకుండ
                స్టారు హొటలు లోన చచ్చు తిళ్ళు,
                కొనియు తినుట నేర్చె కుర్రాళ్ళు ఈనాడు
                మత్తు లోన ఇంటి  మాట మరిచి ! 

                'చద్ది యన్నము , అంబలి'  చతిక బడియె 
                          వడలు ,సాంబారు ఇడ్లీలు -వలస వచ్చె !
                పాలతో వండు పరమాన్న మధుర వంట
                చంటి పిల్లకు కూడాను కంట క మ్మె


3 కామెంట్‌లు:

  1. నేటి యువతకు పట్టిన జాడ్యాన్ని నిరశిస్తూ మీరు వ్రాసిన కవిత చాలా బాగుంది. శీర్షిక తెగులు పట్టిన తెలుగు యువత అంటే కవితకి సరిపోతుంది.పద్యాల అన్వయం సరిపోవడానికీ ఇంకా రసవంతంగా ఉండడానికీ కొన్ని కొన్ని చిన్నమార్పులు అవసరమనిపుస్తోంది.అన్వయం,ఛందస్సు విషయంలో మీరు ఇంకొంచెం శ్రధ్ద తీసుకుంటే మీ పద్యాల రాణింపు ఇనుమడిస్తుందని భావిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  2. తప్పక ప్రయత్నిస్తా. మీ సూచనకి ధన్య వాదాలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. meeru prachurinchina kavitha chala prerana estundhi sir.marala telugu bhasa ruchi teliyajesenduku mee prayatnam abinandaniyam . etuvanti blog ni nervahistunaduku meku na krutagnatailu.

      తొలగించండి