అది రమణీయ దట్టవనమావన మందొక పల్లె ,పల్లెలో
అదియొక మారు మూల గ్రుహమా గృహ మందున నుండి వెల్వ డెన్
పదు నయిదేండ్ల యీడు గల బాలిక , పోలిక కొండపిల్ల ; జం
కొదవెడి మోము తోడ దిగు చున్నది గుట్టను , వన్య మందునన్ ! 1
అక్షర హీనురాలివలె ఆమెయు కన్పడె , కాదు కాదుగా !
శిక్షణ నిచ్చు పుస్తకము చేతిని దాల్చిన యట్టు లుండె ; ఓ
అక్షర దీప్తి సాయమున అక్షరముల్ తగ నేర్చియున్న , స
లక్షణ మామె చూపులో లభ్యము లాయెను చూచు వారికిన్ ! 2
తీరుగా నున్న ముఖమును తీర్చి దిద్ది
పట్న వాసపు పిల్లలా బట్ట కట్టి
హంస నడకల కాళ్ళతో నడుగు లేస్తు
ముద్దు లలరగ యుండె నా ముగ్ధ ముఖము ! 3
భయము, భీతితో , హృదయమ్ము భారమవగ
దు : ఖ భాష్పాలు కళ్ళలో దొరలు చుండ
తడబడయు చున్న అడుగులు వడిగ వేస్తు
దిగియు చుండిన , యామె - రంతీ కుమారి ! 4
అడవి తల్లికి నాయకు డామె తండ్రి
అన్నపూర్ణగ వెలెగెను యామె తల్లి ;
ఆమె కొచ్చిన కష్టంబు యేమొ గాని ,
కళ్ళలో నుండి కన్నీరు కారు చుండె ! 5
ఆకులలములు తినుచును అడవు లందు
జీవ మొందెడు మమ్ముల చేర దీసి
చట్టముల పేర కులములు సర్దు పరచి
వేరు పరచిరి ఓట్లకై స్వార్ధ పరులు 6
వెనుక బడియున్న జాతంటు వేరు పరచి
చదువు లేనట్టి మాకును చదువు నేర్ప
బడులు పెట్టారు మంచిదే బడుగు లనుచు
మార్కు లందున సడలింపు మరల యేల ? 7
మార్కులు తక్కువైన సరె, మాకును వచ్చును సీట్లు యంచు ,మేం
మార్కుల కొస మెత్నములు , మానితి మప్పుడు బుద్ది లేక ; ఈ
మార్కు తొ సీటు లొ చ్చినను, మన్నన యుండునె ? తోటి వారిలో ?
'మార్కుల పాసు లె న్నటికి మార్పులు తేవవె' జాతి పెంపునన్ ! 8
ఏమిటి చేసుకుందు? నిపుడీ చదువెట్టుల యుద్ధ రించు ? నా
కేమిటి వచ్చు నిక్కముగ ? కేవల మక్షర మొ స్తే చాల ? నీ
కేమిటి వచ్చు చెప్పమని ,నెంద రు ప్రశ్నలు గుమ్మ రిన్చె? ఈ
నామపు మాత్ర విద్యల తొ , నవ్వులు పాలయె వన్య ప్రాంతముల్ ! 9
చదువు కున్టూంది మా పిల్ల చక్క గాను
కష్ట పడ రాదు మా పిల్ల కంది పోవు,
పనియు చేస్తున్న చదువంత పాడు యగును
అనుచు మా వారు పనిచెప్ప యడ్డు కొనిరి ! 10
ఇపుడు చూడమ్మ ! నా బ్రతుకు ఏమి టయెనొ !
కష్ట పడలేక పనిలోని కరుగ లేక ,
'పోటి' కెదురించి నిలుబడ ధాటి లేక
గాలి -నేలకు మధ్యను వ్రేల బడితి ! 11
చదువు కున్నట్టి వారితో సాగ గలమ?
యనుచు మావారు మను వాడ యడ్డు పెట్టె ;
'ప్రేమ నటియించి' పెళ్లంటే మోము త్రిప్పి
వెళ్లి పోయేడు పట్నంపు పెళ్లి కొడుకు ! 12
ఏమి చేతును ? ఈ బాధ లెవరు వినును ?
బంధు జనులకు నిప్పుడు భార మైతి ;
ఆత్మ గౌరవ శ్రీయును అణగి పోయె!
దైవ యోగంబు మీరంగ తరమే మనకు ? 13
ఊరు వాడంత నా మీద యూసు లాడి
చెప్పు కొను చుండె నన్నును డెప్పు చేయ
జీవితమ్ముపై యాసక్తి చెరిగి పోయె!
ఆడ పిల్లకు మార్గమ్ము ఆత్మ హత్యె! 14
అనుచు పొత్తమ్ము రొమ్ముపై హత్తు కొనుచు
'రంతి' దిగినది గిరి నుండి ; యంత లోన
'జీపు' కాబోలు శబ్దంబు చేసు కొనుచు
వచ్చు చున్నది యటు ప్రక్క వడిగ వడిగ ! 15
జీపు రాకను గని నంత జీవ మొంది
బ్రతుకు పట్లను యాశలు వెతుక జొచ్చి
వేసి నడుగును కొద్దిగా వెనుక జాపి
'ఆపు ' మను నట్లు చేయ జాపి జీపు నాపె! 16
అందులో నున్న అధికారి నామె జూచి
జీపు దిగి వచ్చి యామెను చేర దీసి
ఆమె నోదార్చి , ఆశ్రమ మామె కిచ్చి
అభయ మిచ్చాడు ఉద్యోగ మామె కీయ ! 17
బ్రతుకు పట్లను వైరాగ్య భావ మొంది
ఆత్మ హత్యకు యత్నించు నామే జూసి
అడవి తల్లికి , హృదయమ్ము సడలె నేమొ !
'పీ.ఒ. ' రూపాన తెరువు జూ పెట్టె నిటుల ! 18
వెనుక బడియున్న బడుగుల వెలుగు జూపు
ప్రగతి మార్గము లెన్నియో ప్రభుత పెట్టె !
చదువు నేర్పుచు గిరిజన జాతి యందు
మార్పు తేవాలి మీ లాంటి మహిళ లనుచు 19
పుట్టి నూరిలో బడియును, పెట్టి నచటె
టీ చరుద్యోగ మిచ్చియు తీర్చి దిద్దె;
చదువు కున్నట్టి చదువుకు సార్ధ తవగ
గెంతు లేసెను రంతియు సంత సమున ! 20
**********
( చదువు చెప్పే రోజుల్లో ఓ కొండపిల్ల మనో వేదనే దీనికి స్ఫూర్తి )

Good parody
రిప్లయితొలగించండి