తెలుగు వారలంత తెలుగులో మాట్లాడ
మధుర రసము వోలె మంచి గుండు
తెలుగు వచ్చి గూడ తెలివంటు ఆంగ్లాన
మాటలాడ నాకు వళ్ళు మండు!
తెలుగు సభలలోన తెలుగులో మాట్లాడ
తెలుగు తీపి తనము తెలియ నగును
అట్లు గాక యచట ఆంగ్లమ్ము మాట్లాడ
తెలుగు గౌర వమ్ము వెలుగు పోవు ;
తెలుగు భాష యందె తీపి తనము యొప్పు
తెలుగు జాతి మనసు తేట తెలుపు
తెలుగు వంట రుచులు దేశంబు కేఖ్యాతి
తెలుగు కట్టు బాటె వెలుగు జిలుగు
తెలుగు వెలుగు బాగుంది. తెలుగు మీది ఇంత తీపి అందరకీ ఉండడం అవసరం
రిప్లయితొలగించండిచాలా బాగుందండి.. తేనెలా మధురంగా..
రిప్లయితొలగించండితెలుగు సభలలోన తెలుగులో మాట్లాడ
రిప్లయితొలగించండితెలుగు తీపి తనము తెలియ నగును
చాలా బాగా చెప్పారు.