చదువు మీద శ్రద్ధ సన్న గిల్లెడు నంత
ఆదిలోనె చదువు ఆగి పోవు,
చదువు, శ్రమను బట్టి చాకిరీ యుంటుంది
చాకిరీయు బట్టి రూకలొచ్చు! 1
కష్ట పడక పోతె గడవదు ఇల్లంచు
కాసు కొస మగును కార్మికుడిగ ;
చమట యోడ్చి యంత శ్రమ పడినను గాని
చేత నిలువ దెపుడు చిల్లి గవ్వ ! 2
కండ బలము జూపి కార్మికుడానాడు
ఫాక్టరీల యందు పనికి జేరె;
బుద్ది బలము నిపుడు వృద్ది చేయక పోతె
పనిని చేయ సాధ్య పడదు ఇపుడు 3
కాల మిపుడు మారి కంప్యు టార్ లోచ్చేయి
పాత చదువు లిపుడు పనికి రావు ;
నాణ్య తొకటె గాదు నవ్యత చూపేటి
అవసరాలు నేడు అధిక మయ్యె ! 4
పాతకాలమందు వాడిన పని ముట్లు
పనికి రాక నేడు ప్రక్క బడియె ;
శక్తి ,యుక్తి జూపి శ్రమి యించ బోకుంటె
భావి బ్రతుకు మనకు భారమగును ! 5
కార్మి కుడియె గాని కర్ష కుడియె గాని
చదువు రాక బోతే చవట యగును ;
సంఘ గౌరవంబు చదువర్లకే యుండు
సత్వ రమ్ము నీవు చదువు కొనుము ! 6
చదువు మాని వేసి చాల కాలం బయ్యె
చదువు ఎటుల అనెడి సంశ వద్దు
చదువు కొనుట కిపుడు చాల మార్గము లుండె
మంచి మార్గ మెంచి మనిషి వగుమ ! 7
అనుభ వమ్ము మీద అధికార మొచ్చినా
చదువు లేమి నిన్ను సాగ నీదు !
అనుభ వమ్ము తోడ అక్షరం యుండినా
వంగి చేతు రపుడు వంద నాలు ! 8
అవస రాలకు తగ్గట్టు సవర ణిచ్చి
నాణ్యతను పెంచి సరకుల నవ్య తకును
శ్రద్ధ జూపెడి కార్మిక శ్రామికుని కి
యాజమాన్యపు సంపూర్ణ యండ యుండు 9
నేర్పు తోడుగా వెనువెంటే నిర్ణయాలు
తీసు కొనియెడి కార్మిక తెగకు విలువ
అట్టి విలువ నిచ్చేది అక్ష రమ్మె
తక్షణము వచ్చి నేర్చుకో అక్ష రాలు ! 10
కార్మికు లంతా ఒకటై
శ్రామిక విజయమ్ము పట్ల శక్తిన్ జూపీ
రమ్యపు వాతావరణము
సమ తుల్యత నొందు నటుల సరిదిద్ద వలెన్ ! 11
ఆదిలోనె చదువు ఆగి పోవు,
చదువు, శ్రమను బట్టి చాకిరీ యుంటుంది
చాకిరీయు బట్టి రూకలొచ్చు! 1
కష్ట పడక పోతె గడవదు ఇల్లంచు
కాసు కొస మగును కార్మికుడిగ ;
చమట యోడ్చి యంత శ్రమ పడినను గాని
చేత నిలువ దెపుడు చిల్లి గవ్వ ! 2
కండ బలము జూపి కార్మికుడానాడు
ఫాక్టరీల యందు పనికి జేరె;
బుద్ది బలము నిపుడు వృద్ది చేయక పోతె
పనిని చేయ సాధ్య పడదు ఇపుడు 3
కాల మిపుడు మారి కంప్యు టార్ లోచ్చేయి
పాత చదువు లిపుడు పనికి రావు ;
నాణ్య తొకటె గాదు నవ్యత చూపేటి
అవసరాలు నేడు అధిక మయ్యె ! 4
పాతకాలమందు వాడిన పని ముట్లు
పనికి రాక నేడు ప్రక్క బడియె ;
శక్తి ,యుక్తి జూపి శ్రమి యించ బోకుంటె
భావి బ్రతుకు మనకు భారమగును ! 5
కార్మి కుడియె గాని కర్ష కుడియె గాని
చదువు రాక బోతే చవట యగును ;
సంఘ గౌరవంబు చదువర్లకే యుండు
సత్వ రమ్ము నీవు చదువు కొనుము ! 6
చదువు మాని వేసి చాల కాలం బయ్యె
చదువు ఎటుల అనెడి సంశ వద్దు
చదువు కొనుట కిపుడు చాల మార్గము లుండె
మంచి మార్గ మెంచి మనిషి వగుమ ! 7
అనుభ వమ్ము మీద అధికార మొచ్చినా
చదువు లేమి నిన్ను సాగ నీదు !
అనుభ వమ్ము తోడ అక్షరం యుండినా
వంగి చేతు రపుడు వంద నాలు ! 8
అవస రాలకు తగ్గట్టు సవర ణిచ్చి
నాణ్యతను పెంచి సరకుల నవ్య తకును
శ్రద్ధ జూపెడి కార్మిక శ్రామికుని కి
యాజమాన్యపు సంపూర్ణ యండ యుండు 9
నేర్పు తోడుగా వెనువెంటే నిర్ణయాలు
తీసు కొనియెడి కార్మిక తెగకు విలువ
అట్టి విలువ నిచ్చేది అక్ష రమ్మె
తక్షణము వచ్చి నేర్చుకో అక్ష రాలు ! 10
కార్మికు లంతా ఒకటై
శ్రామిక విజయమ్ము పట్ల శక్తిన్ జూపీ
రమ్యపు వాతావరణము
సమ తుల్యత నొందు నటుల సరిదిద్ద వలెన్ ! 11