జీవితములోన ఒత్తిడి జీవి కున్న
బీ. పి, సుగరులు ఎక్కువై కోప మొందు;
వత్తిడిని మాని తాపీగ పనులు జేయ
మనిషి మనిషిగ హాయిగా బ్రతక గలడు. 01
పనులు చెయలేక వత్తిడి మగడి కొచ్చు ;
వంట పనులతో ఇల్లాలు వత్తి డగును;
చదువు వత్తిడి పిల్లలన్ చావ గొట్టు ;
కాన రారయ్య వత్తిడి లే ని వారు ; 02
చేయవలసిన పనలను చెయ కుండ ,
కాల మందున పనులను గాలి కొదిలి ,
పెంచు కొనినంత వత్తిడి పెరిగే ననుచు
చింత నొందియు , వగచిన చెరుపు కాద ? 03
ఒత్తిడి లేకున్న మనిషి ,
నొత్తిడి కల్పించు కొనియు , నూగుచు నుండున్ ;
వత్తిడి మరిచియు ఎప్పుడు
ఉత్తిత్తి నె నవ్వు కున్న నూరట మగునే ! 04
ఒత్తిడి ఊరికె పెరగదు
నెత్తిన భారమ్ము యుంచ , నెదిగియు పెరుగున్ ;
చిత్తము పనిలో యుంచిన
నొత్తిడి మరి కాన రాదు ఊసుకు నైనా! 05
మాన సికమైన వత్తిడి మనసు నున్న
మరణమే గాని డానికి మందు లేదు ;
వ్యధను పొందియు తదుపరి వ్యాధి ముదిరి
పిచ్చి వానిగ రోడ్లపై ప్రేలు చుండు !
********
( శ్రీ కష్టే ఫలే వారి కోరికపై వ్రాసినవి )