ఋణపు కిరణాల్ వెలియు తోడనె
శాస్త్ర రూపము మారి పోయెను ;
నత్త నడకల నడుచు శాస్త్రము
వేగ వృద్ధిని పొందె నప్పుడు ! 01
కాంతి కిరణము చొరవ నివ్వని
చిమ్మ చీకటి గదిలొ కూర్చొని
ప్రోయో గమ్మును జే సి ' రాణ్ జెన్ '
వింత కిరణము నొకటి గాంచెను 02
అతడు కనుగొను నట్టి కిరణమె
కొత్త శకముకు నాంది పలికెను;
రోగ నిరుపణ సులభ మాయెను ;
'ఎక్సు -రే ' గా పేరు పొందెను 03
నల్ల బట్టను కట్టి యుంచిన
క్రూక్సు నాళపు గోడ నుండీ
అంతు పట్టని రశ్మి ఏదో
వెలుగు నొందెడు వింత జూసెను 04
నల్ల కాగిత తొడుగు తొడగిన
పదార్ధము పై పడిన రస్మియు
కాంతి వెలుగులు ప్రస్ప్హ రించెను
మెదడు కదియే మేత అయ్యెను 05
నీల లోహిత రశ్మి కూడా
చొరవ నివ్వని కాగి తములో
వింత రస్మిని చూచి నప్పుడు
విస్మ యమ్మును కలుగ దామరి ! 06
అంగుళమ్మే లోపు దూరం
పోవ గలిగిన ఋణం కిరణాల్
మూడు మీటరు లున్న దూరము
ప్రయా నించుట ప్రశ్న గాదా? 07
ముందు తెలియని రశ్మి ఏదో
ఇట్టి వెలుగుకి కారణమ్మగు;
క్రూక్సు నాళము నుండి వచ్చేడి
వింత కిరణ మె ఎక్సు కిరణము ! 08
( X కిరణము = తెలియని కిరణము )
********
( శాస్త్రీయ సరాలు నుండి )
పాదాభివందనం
రిప్లయితొలగించండి