ధరణి లోపల ద్రవ్య మంతయు
సూక్ష్మ కణముల సృష్టి కలియక
కనులు గాంచని సూక్ష్మ కణములె
ద్రవ్య మంతయు దాగి యున్నవి 1
చిట్ట చివరిగ పదార్ధమ్మును
విభాగిస్తూ పోవు చుండిన
విభజ నవ్వక మిగిలి పోయిన
సూక్ష్మ కణములె - 'పరమ అణువులు' 2
క్రమము తప్పక పరమ అణువులు
లెక్క తోడుగ కలియు చున్నవి
పరమ అణువులు కలిసి నందునె
అణువు లేర్పడె అవని యందున 3
స్థిరము హెచ్చుగ నుండి నందునె
అణువు లెప్పుడు చర్య నొందవు
చర్య నందున పాలు గొన్నవి
పరమ అణువులు మాత్ర మేనోయ్! 4
అణువు లందున యుండు కాళీ ,
వీటి మధ్యా కర్ష నుండును ;
'గ్రావి టేషన్' మూల సూత్రము
వీటి మధ్యా కాని పించును 5
రెండు కణముల మధ్య బలమును
తెలియ జేసే సూత్రమే యిది
విశ్వ విఖ్యాత నొంది నదియు
'న్యూట' నెన్నడొ తెలిపి నట్టిది 6
అణువు విభజన సలిపి డాల్టన్
స్థితి ప్రజ్న తొ సృష్టి మార్చెను ;
శాస్త్ర జ్ఞాన ప్రచండ వేగము
అప్పుడే కద అధిక మాయెను 7
పరమ అణువుల సృష్టి తోడనె
కొత్త శకముకు నాంది పలికెను ;
ఉనికి యుండని పరమ అణువుకు
నాశ నమ్మను మాట లేదోయ్ ! 8
మూల కమ్మున పరమ అణువులు
సర్వ విధముల సామ్య మొప్పును;
ఒక్క మూలక పరమ అణువులు
వేరొ వానితొ విభే దించును 9
వాటి తోనవి కలియు గుణమును
వేరొ వానితొ కలియు ధర్మము
పరమ అణువుల ప్రాతి నిద్యము
కొత్త అణువుల మేలు కలియక 10
ఊహ కందని విషయ మంతా
విశద పరిచెను విజ్ఞు లలరగ;
పరమ అణువుల సృష్టి కర్తగ
'డాల్ట' నందుకె పేరు బడసెను 11
అణువు విభజన ఆగ లేదిట
శాస్త్ర పరిధికి అంత మెక్కడ ?
పరమ అణువుల నడుమ ఎన్నో
కొత్త కణములు కాను పించెను 12
ఋణా వేశపు టెల క్ట్రానూ,
ధనా వేశపు కణము ప్రోటాన్ ,
న్యూట్ర నన బడు తటస్థ కణము
పరమ అణువున కాను పించెను ; 13
విభజ నొందదు పరమ అణువను
పాత భావము పార ద్రోలీ
శాస్త్ర గతమును నిరూపించీ
ఖ్యాతి గాంచెను జే.జె. థాంప్సన్ . 14
వర్ష మప్పుడు ఆకశములో
కాను పించిన మెరుపు జూసీ
మేఘ మందుత్సర్గ మేర్పడు
ననెడి భావన మెదడు మెరేసెను 15
అల్ప పీడన వాయు వంతయు
వాయు నాళము మధ్య యుంచీ
అధిక ఒల్తుల విద్యు తంపిన
వాహ కత్వము పొందె వాయువు 16
శతాశంబున మిల్లి మీటరు
పీడ నంబును యుంచి చూసిన
మాయ మయ్యెను కాంతి పట్టీల్
చీక టా యెను వాయు నాళము 17
ఋణా వేశపు టెలక్త్రోడున,
కాంతి కిరిణము కాని పించెను ;
నీలి రంగున నున్న కిరణము
పడిన చోటే ప్రకా సించెను 18
కిరణ మార్గపు లోన విద్యుత్
క్షేత్ర ముంచీ చూసి నంతనె
ధనము ప్రక్కకు వంగె కిరణము ;
ఋణము కణములు కాక ఏమిటి? 19
ఎలక్ట్రాను ల ఋణా వేశము,
ఎలక్ట్రానుల కున్న ద్రవ్యము
ఋణము కణమును పోలి నందునె
' ఎలక్ట్రాను గ ' దీని నెంచిరి 20
ఆని యానులు కాన రాగా
కాటి యానులు యుండ వలెనని
'గోల్డు - స్టెయినను ' శాస్త్ర కారుడు
ప్రయత్నించీ ఫలిత మొందెను! 21
వాయు నాళపు ప్రయోగములో
కాల్వ కిరణము గాంచె నాతడు ;
వాని ధర్మము పరీక్షిస్తే
'ధనము కణమని ఋజువు అయ్యెను 22
ప్రోట యానుల ద్రవ్య ముండిన
ధనావేశపు కణము లవియని
ప్రయోగాత్మక ఫలిత మిచ్చిన
ధనము కణములె 'ప్రోట యానులు ' 23
హైడ్రోజనులో నున్న ద్రవ్యము
ప్రోట యాను లొ పొడమి జూచెను ;
బహు: సల్పపు ద్రవ్య మేమో
ఎలక్ట్రాను లొ నిమిడి యున్నది 24
ఎన్నొ కణములు పొంది యుండిన
గాలి అంతయు తేలి కైతే
గాలి లోపల కణము ప్రోటాన్
ఎంత తేలికొ ? చెప్ప గలమా ? 25
ఒక్క ప్రోటాన్ - ఒకే ఎలక్ట్రాన్
హైడ్రో జను లొ కలిగి యున్నవి ;
హై డ్రో జన్నుని ప్రమాణమ్ముగ
తక్కి నణువులు తెలుప సాగిరి ! 26
వారి కచ్చట అడ్డు వచ్చెను
రెండు ప్రోటాన్ లున్న హిలియం
నాల్గు ద్రవ్యము లుంట గాంచిరి
వెదుక సాగిరి కార ణ మ్మును ; 27
ఉండ రా దావేశ మింతయు
ద్రవ్య మొక్క టె యుండ వలయును
కణము లట్టివి తెలియ వలెనని
ఊహ సలుపుచు వెదుక సాగిరి 28
అట్టి కణమును గాంచె 'చాడ్విక్'
న్యూట్ర ననుచును నుడివె నాతడు ;
ఇంచు మించుగ దాని భారము
ప్రోట యాను తొ పోలి యుండెను 29
కనులు గాంచని ఇట్టి కణమున
ఇన్ని కణములు ఎట్టు లమరెను ?
తెలియ గోరుచు శాస్త్ర కారులు
ప్రయో గమ్ములు పెక్కు సలిపిరి 30
ప్రయో గాత్మక రూప కల్పన
పరమ అణువుకు రచన జేసీ
మొట్ట మొదటిగ తెలుప గలిగిన
శాస్త్ర కారుడు 'రూథరు ఫర్డ్ ' 31
పరమ అణువున చాల భాగము
శూన్య మనుచును తెలిపె నాతడు ;
మధ్య లోయతి చిన్న భాగము
'న్యూక్లియస్సను' కేంద్ర కమ్మట ; 32
ప్రోట యానుల తోడు న్యూట్రాన్
కేంద్ర కమ్మున నిమిడి యున్నవి
ఇంచు మించుగ వాని సంఖ్యలు
సమా నమ్ముగ యుండ వచ్చును 33
దాని చుట్టూ ఎలక్ట్రానులు
గ్రహపు మండల నమూ నావలె
పరి భ్రమణము నొందు నెప్పుడు ;
సృష్టి చిత్రము చూడు మిచ్చట 34
సూర్య బింబము చుట్టు గ్రహములు
విశ్వ మంతా తిరుగ లేదా!
అట్టు లేమరి ఎలక్ట్రానులు
నూక్లియస్సును చుట్టి తిరుగును 35
నూక్లి యస్సున ప్రోట యానులు
చుట్టు తిరిగెడు ఎలక్ట్రానులు
సంఖ్య ఎపుడూ సమా నమ్మే ;
అదియె 'పరుమాణ్ సంఖ్య ' అనబడు 36
పరమ అణువుల ద్రవ్య మంతా
నూక్లియస్సున నిలిచి యున్నది ;
'ద్రవ్య రాసది ' పరమ అణువుకు
కేంద్ర కణముల సంఖ్య అదియె; 37
పరి క్షేపణ ప్రయో గములో
కణ స్థానము నిర్ణ యించెను ;
గుప్త మలరగ యుండు సత్యము
జగ ద్విదితం బయ్యె నప్పుడు ; 38
ఋణా వేశపు టెలక్ట్రానులు
తిరుగు చుండిన శక్తి తగ్గద?
శక్తి తగ్గిన ఎలక్ట్రానులు
ఎంత సేపని తిరుగ గల్గును ? 39
సర్పి లంబుగ తిరిగి తిరిగీ
కేంద్ర కమ్మున పడుట సత్యము ;
అవ్విధంబుగ పడిన అయ్యెది
నాశనంబును చందదా మరి ? 40
అనుచు అడిగిన మొదటి ప్రశ్నకు
సమా దానము తెలుప నయ్యెను;
అందుకే మరి అతని వాదన
తప్పు పట్టీ వెనుక నెట్టిరి 41
తిరుగు చుండిన ఎలక్ట్రానులు
శక్తి క్రమముగ కోలు పోయిన
శక్తి యంతా కాంతి రూపున
వర్ణ పటమున ఏర్ప డొ ద్దా? 42
హైడ్రోజను అను వర్ణ పటమున
కొన్ని రేఖలు కాన బడగా
పట్టి లమరిక విచ్చి నమ్మయి
రేఖ మధ్యలో కాళి కనబడె ; 43
వర్ణ పటముకు వర్ణ నిచ్చుట
అప్పుడేమో కష్ట మాయెను ;
'నీల్సు బోరను ' శాస్త్ర కారుడు
వర్ణ పటముకు వివర నిచ్చెను 44
ప్రయో గమ్మున తెలుపు మోడలు
తప్పు కాదని సమర్ధించెను
వర్ణ పట్టీ విశద మగుటకు
కొత్త విషయము పొందు పరిచెను 45
ఎలక్ట్రానుల పరిభ్రమణం
వృత్త కక్ష్యల లోనె యుండును
వేరు వేరుగ కక్ష్య లుండును
కక్ష్య బట్టీ శక్తు లుండును 46
కక్ష్య దూరము ఎక్కు వయితే
శక్తి కూడా ఎక్కువే యగు ;
కక్ష్య శక్తులు మార వెప్పుడు
వీటినే ' స్థిర కక్ష్య లందురు 47
నియమ తంబగు శక్తి యుండెడి
శక్తి లోపల ఎలక్ట్రానులు
తిరుగు చుండిన , శక్తి యందున
మార్పు ఎన్నడు రానె రాదట 48
వాని కక్ష్య లొ అవియు తిరిగిన
శక్తి గ్రహణము, శక్తి తరుగూ ,
జరగ డానికి వీలు లేదని
ఖచ్చి తముగా బోరు తెలిపెను . 49
కక్ష్య నుండీ కక్ష్య లోనికి
ఎలక్ట్రానులు దూకు చుండును;
శక్తి గ్రహణము, శక్తి తరుగూ ,
అందు వలననె జరుగు చున్నవి ; 50
శక్తి ఎక్కువ కక్ష్య నుండీ
ఎలక్ట్రానులు దూకి నపుడే
కిరణ రూపము శక్తి వెలువడి
వర్ణ పటమున గీత కనబడు 51
శక్తి తక్కువ కక్ష్య నుండీ
శక్తి ఎక్కువ కక్ష్య లోనికి
ఎలక్ట్రానులు దుమికి నపుడే
శక్తి గ్రహణము చూడ వచ్చును 52
ఉదజ నణువున వర్ణ పటము ను
విశద పరిచిన బోరు మోడలు ,
సంఖ్య పెరిగిన అణువు లందున
వర్ణ పటమును తెలుప నయ్యెను; 53
శాస్త్ర సహితం బయిన స్పర్ధన్
దిద్ది రెందరొ కొత్త రూపులు ;
వానిలో మరి నిలచె నిప్పుడు
'క్వాంట మేఖాని ' కనెడి రూపము ౫౪
***********
శాస్త్రీయ సరాలు నుండి
సూక్ష్మ కణముల సృష్టి కలియక
కనులు గాంచని సూక్ష్మ కణములె
ద్రవ్య మంతయు దాగి యున్నవి 1
చిట్ట చివరిగ పదార్ధమ్మును
విభాగిస్తూ పోవు చుండిన
విభజ నవ్వక మిగిలి పోయిన
సూక్ష్మ కణములె - 'పరమ అణువులు' 2
క్రమము తప్పక పరమ అణువులు
లెక్క తోడుగ కలియు చున్నవి
పరమ అణువులు కలిసి నందునె
అణువు లేర్పడె అవని యందున 3
స్థిరము హెచ్చుగ నుండి నందునె
అణువు లెప్పుడు చర్య నొందవు
చర్య నందున పాలు గొన్నవి
పరమ అణువులు మాత్ర మేనోయ్! 4
అణువు లందున యుండు కాళీ ,
వీటి మధ్యా కర్ష నుండును ;
'గ్రావి టేషన్' మూల సూత్రము
వీటి మధ్యా కాని పించును 5
రెండు కణముల మధ్య బలమును
తెలియ జేసే సూత్రమే యిది
విశ్వ విఖ్యాత నొంది నదియు
'న్యూట' నెన్నడొ తెలిపి నట్టిది 6
అణువు విభజన సలిపి డాల్టన్
స్థితి ప్రజ్న తొ సృష్టి మార్చెను ;
శాస్త్ర జ్ఞాన ప్రచండ వేగము
అప్పుడే కద అధిక మాయెను 7
పరమ అణువుల సృష్టి తోడనె
కొత్త శకముకు నాంది పలికెను ;
ఉనికి యుండని పరమ అణువుకు
నాశ నమ్మను మాట లేదోయ్ ! 8
మూల కమ్మున పరమ అణువులు
సర్వ విధముల సామ్య మొప్పును;
ఒక్క మూలక పరమ అణువులు
వేరొ వానితొ విభే దించును 9
వాటి తోనవి కలియు గుణమును
వేరొ వానితొ కలియు ధర్మము
పరమ అణువుల ప్రాతి నిద్యము
కొత్త అణువుల మేలు కలియక 10
ఊహ కందని విషయ మంతా
విశద పరిచెను విజ్ఞు లలరగ;
పరమ అణువుల సృష్టి కర్తగ
'డాల్ట' నందుకె పేరు బడసెను 11
అణువు విభజన ఆగ లేదిట
శాస్త్ర పరిధికి అంత మెక్కడ ?
పరమ అణువుల నడుమ ఎన్నో
కొత్త కణములు కాను పించెను 12
ఋణా వేశపు టెల క్ట్రానూ,
ధనా వేశపు కణము ప్రోటాన్ ,
న్యూట్ర నన బడు తటస్థ కణము
పరమ అణువున కాను పించెను ; 13
విభజ నొందదు పరమ అణువను
పాత భావము పార ద్రోలీ
శాస్త్ర గతమును నిరూపించీ
ఖ్యాతి గాంచెను జే.జె. థాంప్సన్ . 14
వర్ష మప్పుడు ఆకశములో
కాను పించిన మెరుపు జూసీ
మేఘ మందుత్సర్గ మేర్పడు
ననెడి భావన మెదడు మెరేసెను 15
అల్ప పీడన వాయు వంతయు
వాయు నాళము మధ్య యుంచీ
అధిక ఒల్తుల విద్యు తంపిన
వాహ కత్వము పొందె వాయువు 16
శతాశంబున మిల్లి మీటరు
పీడ నంబును యుంచి చూసిన
మాయ మయ్యెను కాంతి పట్టీల్
చీక టా యెను వాయు నాళము 17
ఋణా వేశపు టెలక్త్రోడున,
కాంతి కిరిణము కాని పించెను ;
నీలి రంగున నున్న కిరణము
పడిన చోటే ప్రకా సించెను 18
కిరణ మార్గపు లోన విద్యుత్
క్షేత్ర ముంచీ చూసి నంతనె
ధనము ప్రక్కకు వంగె కిరణము ;
ఋణము కణములు కాక ఏమిటి? 19
ఎలక్ట్రాను ల ఋణా వేశము,
ఎలక్ట్రానుల కున్న ద్రవ్యము
ఋణము కణమును పోలి నందునె
' ఎలక్ట్రాను గ ' దీని నెంచిరి 20
ఆని యానులు కాన రాగా
కాటి యానులు యుండ వలెనని
'గోల్డు - స్టెయినను ' శాస్త్ర కారుడు
ప్రయత్నించీ ఫలిత మొందెను! 21
వాయు నాళపు ప్రయోగములో
కాల్వ కిరణము గాంచె నాతడు ;
వాని ధర్మము పరీక్షిస్తే
'ధనము కణమని ఋజువు అయ్యెను 22
ప్రోట యానుల ద్రవ్య ముండిన
ధనావేశపు కణము లవియని
ప్రయోగాత్మక ఫలిత మిచ్చిన
ధనము కణములె 'ప్రోట యానులు ' 23
హైడ్రోజనులో నున్న ద్రవ్యము
ప్రోట యాను లొ పొడమి జూచెను ;
బహు: సల్పపు ద్రవ్య మేమో
ఎలక్ట్రాను లొ నిమిడి యున్నది 24
ఎన్నొ కణములు పొంది యుండిన
గాలి అంతయు తేలి కైతే
గాలి లోపల కణము ప్రోటాన్
ఎంత తేలికొ ? చెప్ప గలమా ? 25
ఒక్క ప్రోటాన్ - ఒకే ఎలక్ట్రాన్
హైడ్రో జను లొ కలిగి యున్నవి ;
హై డ్రో జన్నుని ప్రమాణమ్ముగ
తక్కి నణువులు తెలుప సాగిరి ! 26
వారి కచ్చట అడ్డు వచ్చెను
రెండు ప్రోటాన్ లున్న హిలియం
నాల్గు ద్రవ్యము లుంట గాంచిరి
వెదుక సాగిరి కార ణ మ్మును ; 27
ఉండ రా దావేశ మింతయు
ద్రవ్య మొక్క టె యుండ వలయును
కణము లట్టివి తెలియ వలెనని
ఊహ సలుపుచు వెదుక సాగిరి 28
అట్టి కణమును గాంచె 'చాడ్విక్'
న్యూట్ర ననుచును నుడివె నాతడు ;
ఇంచు మించుగ దాని భారము
ప్రోట యాను తొ పోలి యుండెను 29
కనులు గాంచని ఇట్టి కణమున
ఇన్ని కణములు ఎట్టు లమరెను ?
తెలియ గోరుచు శాస్త్ర కారులు
ప్రయో గమ్ములు పెక్కు సలిపిరి 30
ప్రయో గాత్మక రూప కల్పన
పరమ అణువుకు రచన జేసీ
మొట్ట మొదటిగ తెలుప గలిగిన
శాస్త్ర కారుడు 'రూథరు ఫర్డ్ ' 31
పరమ అణువున చాల భాగము
శూన్య మనుచును తెలిపె నాతడు ;
మధ్య లోయతి చిన్న భాగము
'న్యూక్లియస్సను' కేంద్ర కమ్మట ; 32
ప్రోట యానుల తోడు న్యూట్రాన్
కేంద్ర కమ్మున నిమిడి యున్నవి
ఇంచు మించుగ వాని సంఖ్యలు
సమా నమ్ముగ యుండ వచ్చును 33
దాని చుట్టూ ఎలక్ట్రానులు
గ్రహపు మండల నమూ నావలె
పరి భ్రమణము నొందు నెప్పుడు ;
సృష్టి చిత్రము చూడు మిచ్చట 34
సూర్య బింబము చుట్టు గ్రహములు
విశ్వ మంతా తిరుగ లేదా!
అట్టు లేమరి ఎలక్ట్రానులు
నూక్లియస్సును చుట్టి తిరుగును 35
నూక్లి యస్సున ప్రోట యానులు
చుట్టు తిరిగెడు ఎలక్ట్రానులు
సంఖ్య ఎపుడూ సమా నమ్మే ;
అదియె 'పరుమాణ్ సంఖ్య ' అనబడు 36
పరమ అణువుల ద్రవ్య మంతా
నూక్లియస్సున నిలిచి యున్నది ;
'ద్రవ్య రాసది ' పరమ అణువుకు
కేంద్ర కణముల సంఖ్య అదియె; 37
పరి క్షేపణ ప్రయో గములో
కణ స్థానము నిర్ణ యించెను ;
గుప్త మలరగ యుండు సత్యము
జగ ద్విదితం బయ్యె నప్పుడు ; 38
ఋణా వేశపు టెలక్ట్రానులు
తిరుగు చుండిన శక్తి తగ్గద?
శక్తి తగ్గిన ఎలక్ట్రానులు
ఎంత సేపని తిరుగ గల్గును ? 39
సర్పి లంబుగ తిరిగి తిరిగీ
కేంద్ర కమ్మున పడుట సత్యము ;
అవ్విధంబుగ పడిన అయ్యెది
నాశనంబును చందదా మరి ? 40
అనుచు అడిగిన మొదటి ప్రశ్నకు
సమా దానము తెలుప నయ్యెను;
అందుకే మరి అతని వాదన
తప్పు పట్టీ వెనుక నెట్టిరి 41
తిరుగు చుండిన ఎలక్ట్రానులు
శక్తి క్రమముగ కోలు పోయిన
శక్తి యంతా కాంతి రూపున
వర్ణ పటమున ఏర్ప డొ ద్దా? 42
హైడ్రోజను అను వర్ణ పటమున
కొన్ని రేఖలు కాన బడగా
పట్టి లమరిక విచ్చి నమ్మయి
రేఖ మధ్యలో కాళి కనబడె ; 43
వర్ణ పటముకు వర్ణ నిచ్చుట
అప్పుడేమో కష్ట మాయెను ;
'నీల్సు బోరను ' శాస్త్ర కారుడు
వర్ణ పటముకు వివర నిచ్చెను 44
ప్రయో గమ్మున తెలుపు మోడలు
తప్పు కాదని సమర్ధించెను
వర్ణ పట్టీ విశద మగుటకు
కొత్త విషయము పొందు పరిచెను 45
ఎలక్ట్రానుల పరిభ్రమణం
వృత్త కక్ష్యల లోనె యుండును
వేరు వేరుగ కక్ష్య లుండును
కక్ష్య బట్టీ శక్తు లుండును 46
కక్ష్య దూరము ఎక్కు వయితే
శక్తి కూడా ఎక్కువే యగు ;
కక్ష్య శక్తులు మార వెప్పుడు
వీటినే ' స్థిర కక్ష్య లందురు 47
నియమ తంబగు శక్తి యుండెడి
శక్తి లోపల ఎలక్ట్రానులు
తిరుగు చుండిన , శక్తి యందున
మార్పు ఎన్నడు రానె రాదట 48
వాని కక్ష్య లొ అవియు తిరిగిన
శక్తి గ్రహణము, శక్తి తరుగూ ,
జరగ డానికి వీలు లేదని
ఖచ్చి తముగా బోరు తెలిపెను . 49
కక్ష్య నుండీ కక్ష్య లోనికి
ఎలక్ట్రానులు దూకు చుండును;
శక్తి గ్రహణము, శక్తి తరుగూ ,
అందు వలననె జరుగు చున్నవి ; 50
శక్తి ఎక్కువ కక్ష్య నుండీ
ఎలక్ట్రానులు దూకి నపుడే
కిరణ రూపము శక్తి వెలువడి
వర్ణ పటమున గీత కనబడు 51
శక్తి తక్కువ కక్ష్య నుండీ
శక్తి ఎక్కువ కక్ష్య లోనికి
ఎలక్ట్రానులు దుమికి నపుడే
శక్తి గ్రహణము చూడ వచ్చును 52
ఉదజ నణువున వర్ణ పటము ను
విశద పరిచిన బోరు మోడలు ,
సంఖ్య పెరిగిన అణువు లందున
వర్ణ పటమును తెలుప నయ్యెను; 53
శాస్త్ర సహితం బయిన స్పర్ధన్
దిద్ది రెందరొ కొత్త రూపులు ;
వానిలో మరి నిలచె నిప్పుడు
'క్వాంట మేఖాని ' కనెడి రూపము ౫౪
***********
శాస్త్రీయ సరాలు నుండి
Super. Hats of to u sir.
రిప్లయితొలగించండిHats off
రిప్లయితొలగించండిSir, kindly add original definitions also along with translation.
రిప్లయితొలగించండిచాలా సంతోషం. మీ ప్రోత్సాహం నాకు ఊపిరి
తొలగించండినిర్చనాలు అలాగే రాస్తే ఛందస్సు ( ముత్యాల సరాలు)
అప్పుడప్పుడు దెబ్బ తింటుంది. ఎలాగైనా ప్రయత్నిస్తా.
మరొక్క సారి కృతజ్ఞతలు