నూతి లోపల మునుగు బాల్టీ
తేలి కగుటను చూడ లేదా ?
నూతి లోపల శక్తి ఏదో
దాన్ని బయటకు తోయు చున్నది 01
పైకి త్రోసే మర్మ మేమిటి ?
నీటి కుండే శక్తి ఏమిటి ?
ఇందులో గల వింత ఏమిటి?
సమాధానము శాస్త్ర మిచ్చెను . 02
నీట పూర్తిగ మునుగు వస్తువు
భార మెప్పుడు కోలు పోవును
భార నష్ట పు కారణమ్మును
తెలియ జేసెను ఆర్కిమెడిస్ 03
నీటికుండే బలము చేతనె
వస్తువేమో తెలికయ్యెను
పైకి త్రోసే బలము అదియే
ఉత్ప్లవన మని దాని నందురు 04
కోలు పోయిన భార నష్టము
దానితో సరి సమానమ్మగు
ఘన పరిమాణ ద్రవము భారము
లెక్క చూసిన సమానమ్మే ! 05
ద్రవము ఏదియు తీసుకున్నా
వస్తు భారము ఎంత యుండిన
ద్రవము మునిగిన వస్తు వెప్పుడు
సూత్ర పరిధి లొ ఋ జూవు అయ్యెను ! 06
వస్తు వెప్పుడు నీట మునిగిన
దాని ఘన పరిమాణ మునకున్
సమానమ్మగు నీరు ఎప్పుడు
పైకి తేలును - చేసి చూడుము 07
(ముత్యాల సరాలు బాణీ తో వ్రాయబడినవి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి