జరిగి పోయిన దానికి జంక కుండ
మాది మాదన్న భావమ్ము మదిని నిలిపి
పచ్చ దనమును కాపాడ వచ్చు చున్న
యువత కిచ్చెద అభినంద యువ కిరీట !
కష్టమున నున్న నగరాన్ని కనుల జూచి
ఎవరొ వస్తారు చేతురనెంచ కుండ ,
పారి సుధ్యపు పనులందు పాలుగొనెడి
యువత కిచ్చెద అభినంద యువ కిరీట !
మాది మాదన్న భావమ్ము మదిని నిలిపి
పచ్చ దనమును కాపాడ వచ్చు చున్న
యువత కిచ్చెద అభినంద యువ కిరీట !
కష్టమున నున్న నగరాన్ని కనుల జూచి
ఎవరొ వస్తారు చేతురనెంచ కుండ ,
పారి సుధ్యపు పనులందు పాలుగొనెడి
యువత కిచ్చెద అభినంద యువ కిరీట !
రోడ్డు పొడవున చెట్లన్ని రూట్ల తోనె
కూలి పడియున్న దృశ్యాలు జాలి కొలిపె ;
యువత రక్తంబు అంతటన్ యురికి వచ్చి
చెట్లు తొలగించి ప్రక్కకు నెట్టు చున్న
యువత కిచ్చెద అభినంద యువ కిరీట !
చెట్ల నడుమున నెలకొన్న చెత్త నంత
యూడ్చి పెట్టియు ఒకప్రక్క కొ త్తి పెట్టి
బాట లన్నియు పరిశుభ్ర పరచు నట్టి
యువత కిచ్చెద అభినంద యువ కిరీట !
జన్మ భూమికి యువకులు సాయ మొసగ ,
పచ్చ దనమున వైజాగు పరవశించి
పూర్వ వైభవ శోభను పొంద గలదు
కాంతి వెలుగులు నగరాన కాన గలము !
యువత కిచ్చెద అభినంద యువ కిరీట !
ఊడ్చి పెట్టియు వదలిన ఉత్తరాంద్ర
తిరిగి తొలిరూపు పొందగా తీర్చి దిద్ద
చంద్ర బాబుకు ఒకనికే సాధ్య పడదు
జనుల సహకార ముంటేనె సాధ్య మగును
యువత కిచ్చెద అభినంద యువ కిరీట !
చెట్ల నడుమున నెలకొన్న చెత్త నంత
యూడ్చి పెట్టియు ఒకప్రక్క కొ త్తి పెట్టి
బాట లన్నియు పరిశుభ్ర పరచు నట్టి
యువత కిచ్చెద అభినంద యువ కిరీట !
జన్మ భూమికి యువకులు సాయ మొసగ ,
పచ్చ దనమున వైజాగు పరవశించి
పూర్వ వైభవ శోభను పొంద గలదు
కాంతి వెలుగులు నగరాన కాన గలము !
యువత కిచ్చెద అభినంద యువ కిరీట !
ఊడ్చి పెట్టియు వదలిన ఉత్తరాంద్ర
తిరిగి తొలిరూపు పొందగా తీర్చి దిద్ద
చంద్ర బాబుకు ఒకనికే సాధ్య పడదు
జనుల సహకార ముంటేనె సాధ్య మగును
యువత కిచ్చెద అభినంద యువ కిరీట !