మంచి చెడులలోన మర్మంబు తెలుపుతూ
మనిషి వర్తనమున మార్పు తెచ్చి
మోక్ష సిద్ది నొందు ముక్తి మార్గము చూపి
హితము కూర్చు నదియె మతము యగును 01
భాష లెన్నొ యున్న భరత దేశ మందు
భావ మొకటె యున్న ప్రజలు కలరు ;
జాతి మేలు జేయు జాతీయ భావాలు
దేశ ప్రగతి కెపుడు దివ్య వరమె! 02
కులము ,మతము యనెడి కున్టి సాకులు వీడి
మానవత్వమున్న మతము జేర
భావ మొకటె యయ్యు భాష యే పుడుతుంది
'సేవ-ప్రేమ' యనెడి శకము పుట్టు 03
మానవత్వమందు మతము లన్ని కలసి
మమత పెంచు నట్టి మనసు నిడగ ,
జాతి మతము లేని జాతీయ భావాలు
నెల్ల వారి యందు నిమడ గలవు 04
ఎవరి రక్త మైన నెర్రగా యున్నట్లు
మతము ఏది యైన మమత ఒకటే !
పూల దండ లోని పూలెన్ని యున్ననూ
దార మొకటె మతపు సార మొకటె ! 05
మతము లన్ని మనకు మంచినే బోధించు
చెరుపు చేయ మనుచు చెప్పలేదు ;
మతపు గ్రంధ సార మర్మాన్ని యోచించి
జీవనంపు సరళి చేయ వలయు ! 06
భాష భిన్న మైన ప్రాంతాలు వేరైన
మతము వేరు యైన, మానవుల లొ
భావ రాగ సురలు పద పల్లవుల తోడ
కొత్త గీత మొకటి కూర్చ వలయు ! 07
మానవతను మించు మతము ఏదియు లేదు
సాటి మనిషి కెపుడు సాయ పడుచు
పేద వారి పట్ల ప్రేమను పెంచాలి
మానవతకు ధర్మ మదియే గాదె ! 08
చిక్కు లన్ని విప్ప ఒక్క దార యేల
కులము లన్ని కలియ గుణము యగును ;
జలము నందు ఉప్పు జాతీయ మయ్యేల
కులము లన్ని జాతి కలియ గలవు 09
భరత దేశ మందె భారతీయత యొప్పు
సోద రత్వ మిచటె జొచ్చి యుండు ;
సహన మార్పు యనెడి సత్ సాంప్రదాయాలు
భరత దేశ మందె బ్రతికి యుండె ! 10
మనకు మనకు మధ్య మాట బేధము లున్న
మాతృ రక్షనందు మాట యొకటె !
యువకు లంత నపుడు యొక్క త్రాటిని జేరి
'సంఘి' భావ మపుడు చాట గలరు ! 11
గమ్య మొకటి యైన గమ్యంపు మార్గాలు
ఒకటి గానె ఎటుల యుండ గలవు?
వీలు బట్టి బస్సు , రైలు కారులు కావ?
మతము యటులె మోక్ష మార్గ దర్శి ! 12
జాతి జా గృ త యె డి జాతీయ భావాలు
దేశ ప్రగతి కిపుడు దివ్య వరము;
జాతి మేలు కోరు చక్కని భావాలు
పెంపు జేయ వలయు పిల్ల లందు ! 13
మనిషి వర్తనమున మార్పు తెచ్చి
మోక్ష సిద్ది నొందు ముక్తి మార్గము చూపి
హితము కూర్చు నదియె మతము యగును 01
భాష లెన్నొ యున్న భరత దేశ మందు
భావ మొకటె యున్న ప్రజలు కలరు ;
జాతి మేలు జేయు జాతీయ భావాలు
దేశ ప్రగతి కెపుడు దివ్య వరమె! 02
కులము ,మతము యనెడి కున్టి సాకులు వీడి
మానవత్వమున్న మతము జేర
భావ మొకటె యయ్యు భాష యే పుడుతుంది
'సేవ-ప్రేమ' యనెడి శకము పుట్టు 03
మానవత్వమందు మతము లన్ని కలసి
మమత పెంచు నట్టి మనసు నిడగ ,
జాతి మతము లేని జాతీయ భావాలు
నెల్ల వారి యందు నిమడ గలవు 04
ఎవరి రక్త మైన నెర్రగా యున్నట్లు
మతము ఏది యైన మమత ఒకటే !
పూల దండ లోని పూలెన్ని యున్ననూ
దార మొకటె మతపు సార మొకటె ! 05
మతము లన్ని మనకు మంచినే బోధించు
చెరుపు చేయ మనుచు చెప్పలేదు ;
మతపు గ్రంధ సార మర్మాన్ని యోచించి
జీవనంపు సరళి చేయ వలయు ! 06
భాష భిన్న మైన ప్రాంతాలు వేరైన
మతము వేరు యైన, మానవుల లొ
భావ రాగ సురలు పద పల్లవుల తోడ
కొత్త గీత మొకటి కూర్చ వలయు ! 07
మానవతను మించు మతము ఏదియు లేదు
సాటి మనిషి కెపుడు సాయ పడుచు
పేద వారి పట్ల ప్రేమను పెంచాలి
మానవతకు ధర్మ మదియే గాదె ! 08
చిక్కు లన్ని విప్ప ఒక్క దార యేల
కులము లన్ని కలియ గుణము యగును ;
జలము నందు ఉప్పు జాతీయ మయ్యేల
కులము లన్ని జాతి కలియ గలవు 09
భరత దేశ మందె భారతీయత యొప్పు
సోద రత్వ మిచటె జొచ్చి యుండు ;
సహన మార్పు యనెడి సత్ సాంప్రదాయాలు
భరత దేశ మందె బ్రతికి యుండె ! 10
మనకు మనకు మధ్య మాట బేధము లున్న
మాతృ రక్షనందు మాట యొకటె !
యువకు లంత నపుడు యొక్క త్రాటిని జేరి
'సంఘి' భావ మపుడు చాట గలరు ! 11
గమ్య మొకటి యైన గమ్యంపు మార్గాలు
ఒకటి గానె ఎటుల యుండ గలవు?
వీలు బట్టి బస్సు , రైలు కారులు కావ?
మతము యటులె మోక్ష మార్గ దర్శి ! 12
జాతి జా గృ త యె డి జాతీయ భావాలు
దేశ ప్రగతి కిపుడు దివ్య వరము;
జాతి మేలు కోరు చక్కని భావాలు
పెంపు జేయ వలయు పిల్ల లందు ! 13
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి