నీరసంబు జేసి నిస్సత్తువున్ జేసి
మనిషి రూపమందు మార్పు జేసి
ప్రజల యందు ప్రాణ భయమును పెంచేటి
యైడ్సు- వ్యాధి గూర్చి నెరుగ చెపుదు !
చిన్న తనము నందు చేసిన పొరపాట్లు
చెలిమి తోడ చేయు చిలిపి పనులు
వేశ్య తోడ సలుపు వెకిలి చేష్టల మైత్రి
యైడ్సు వ్యాధి కెపుడు హేతు వగును !
రోగ రక్షనిచ్చి రోగాన్ని తగ్గించు
శక్తి జీవి తెల్ల రక్త కణము,
తెల్ల రక్త కణము లెల్ల జీవుల జేరి
రక్షక భటు వలె రక్షనిచ్చు !
రక్షక భటు జంపి రక్తాన్ని పీల్చేసి
తట్టు కొనెడి శక్తి మట్టు జేసి
మనిషి జీవనముకు మహ మారియౌ 'యైడ్సు'
మనిషి జీవ గతిని మార్చి వేయు !
రోగ గ్రస్తుడైన రోగితో ఎవరైన-
సంభోగమవ యైడ్సు సంభ వమ్ము
ఇంజెక్టు జేసేటి ఇంజెక్టు సూది లో
మందు తోడ యు యైడ్సు మనిషి కొచ్చు
రక్త మార్పిడి జేయు రక్తంబు తో బాటు
యైడ్సు వ్యాధి మనిషి నెదగ వచ్చు
హెచ్ ఐ .య్యు. సోకిన ఏ తల్లి నుండైన
పిల్ల వానికి యైడ్సు కలుగ వచ్చు
మానవుల హీన సంక్రమ మత్తు వలన
వ్యాధి రోధక శక్తిని చేద పరచి
కాను పించెడి సముదాయ కారె యైడ్సు
ముందు జాగ్రత్త పడిన విమోచనగును!
అంటు వ్యాధి యనెడి అనుమానముల తోడ
యైడ్సు వ్యాధి గ్రస్తు నెడమ పరుచ
వ్యాధి కన్న ముందు వ్యధ తోనె మరణించు
సేవ - ప్రేమ జూప స్తేమ మొందు !
యైడ్సు వ్యాధి ఎట్టి అంటు రోగము కాదు
ప్రక్క వారి కదియు ప్రాక దెపుడు
ఖర్మ వలన అదియు సంప్ర దించును గాన
వెలిని వెయ రాదు చెలిమి వలయు !
పచ్చగా సాగు సంసార పడవ నడక
ఒక్క సారిగ యైడ్సు తో ఒరిగి పడుయు
ఆలు మగల ల మధ్య ను అలలు పొంగు
అట్టి వారికి అవగాహ మవుసరంబు
అభయ మిచ్చుచు వారిని ఆదరించి
చక్క దిద్ద వలయు చనువు తోడ !
సంఘటిత పర్చి వారిని సంస్కరించి
భయము విడనాడి ప్రేమతో బాస నిలిచి
మంచి మనిషిగ మారియు మసలు నటుల
సంఘ సభ్యులు ఎల్లరూ సాయ పడరె !
* * *
మనిషి రూపమందు మార్పు జేసి
ప్రజల యందు ప్రాణ భయమును పెంచేటి
యైడ్సు- వ్యాధి గూర్చి నెరుగ చెపుదు !
చిన్న తనము నందు చేసిన పొరపాట్లు
చెలిమి తోడ చేయు చిలిపి పనులు
వేశ్య తోడ సలుపు వెకిలి చేష్టల మైత్రి
యైడ్సు వ్యాధి కెపుడు హేతు వగును !
రోగ రక్షనిచ్చి రోగాన్ని తగ్గించు
శక్తి జీవి తెల్ల రక్త కణము,
తెల్ల రక్త కణము లెల్ల జీవుల జేరి
రక్షక భటు వలె రక్షనిచ్చు !
రక్షక భటు జంపి రక్తాన్ని పీల్చేసి
తట్టు కొనెడి శక్తి మట్టు జేసి
మనిషి జీవనముకు మహ మారియౌ 'యైడ్సు'
మనిషి జీవ గతిని మార్చి వేయు !
రోగ గ్రస్తుడైన రోగితో ఎవరైన-
సంభోగమవ యైడ్సు సంభ వమ్ము
ఇంజెక్టు జేసేటి ఇంజెక్టు సూది లో
మందు తోడ యు యైడ్సు మనిషి కొచ్చు
రక్త మార్పిడి జేయు రక్తంబు తో బాటు
యైడ్సు వ్యాధి మనిషి నెదగ వచ్చు
హెచ్ ఐ .య్యు. సోకిన ఏ తల్లి నుండైన
పిల్ల వానికి యైడ్సు కలుగ వచ్చు
మానవుల హీన సంక్రమ మత్తు వలన
వ్యాధి రోధక శక్తిని చేద పరచి
కాను పించెడి సముదాయ కారె యైడ్సు
ముందు జాగ్రత్త పడిన విమోచనగును!
అంటు వ్యాధి యనెడి అనుమానముల తోడ
యైడ్సు వ్యాధి గ్రస్తు నెడమ పరుచ
వ్యాధి కన్న ముందు వ్యధ తోనె మరణించు
సేవ - ప్రేమ జూప స్తేమ మొందు !
యైడ్సు వ్యాధి ఎట్టి అంటు రోగము కాదు
ప్రక్క వారి కదియు ప్రాక దెపుడు
ఖర్మ వలన అదియు సంప్ర దించును గాన
వెలిని వెయ రాదు చెలిమి వలయు !
పచ్చగా సాగు సంసార పడవ నడక
ఒక్క సారిగ యైడ్సు తో ఒరిగి పడుయు
ఆలు మగల ల మధ్య ను అలలు పొంగు
అట్టి వారికి అవగాహ మవుసరంబు
అభయ మిచ్చుచు వారిని ఆదరించి
చక్క దిద్ద వలయు చనువు తోడ !
సంఘటిత పర్చి వారిని సంస్కరించి
భయము విడనాడి ప్రేమతో బాస నిలిచి
మంచి మనిషిగ మారియు మసలు నటుల
సంఘ సభ్యులు ఎల్లరూ సాయ పడరె !
* * *
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి