తెల్లవారు జాము తెలివిని తెప్పించి
అంత రంగ పూజ కనుమతిమ్ము
నిత్య సేవ జేయు నిర్మల హృదయమ్ము
నాకు యొసగు మోయి నాదు ప్రభువ 01
భక్త సంఘమందు పాల్గొను భాగ్యంబు
కలుగ చేయు మోయి కరుణ జూపి
భక్తి, ముక్తి కలుగు బాటలో నడిపించి
నన్ను బ్రోవు మయ్య నాదు ప్రభువ ! 02
కష్ట సుఖము లెల్ల కడలిలా ఎదురించు
గుండె నిబ్బరమును గూర్చి యిమ్ము
ఈర్ష్య భావ మెపుడు నెదలోకి రానీక
నీదు సేవ యందె నిముడ నిమ్ము 03
ప్రేమ ,కరుణ యనెడి ప్రియమైన భావాలు
నిత్య మెపుడు హృదిని నిమిడి యుండ
ఒరుల కెపుడు నేను ఉపకారి యగునట్లు
శక్తి యుక్తు లొసగి ముక్తి నిమ్ము ! 04
సర్వ ప్రాణులందు సర్వ మానవు లందు
దయయు , ప్రేమ కరుణ ధార వోసి
విషయ సుఖము లెల్ల విషమని గుర్తుండ
జీవిత రధ మింక చెలగ నిమ్ము ! 05
చపల చిత్త మలరు సంసార సుఖములు
క్షణిక తృప్తి నిచ్చు కామ వాంఛ
దరికి దూర మయ్యు దారి ని చూపించు
దేవ , దేవ భక్త దీన బంధు ! 06
తెలిసి గాని లేక తెలియ నేరక గాని
ఒరుల కెపుడు హాని జరగ నటుల
నాదు పనుల యందు నన్నేమొ నడిపించి
భాగ్య మీయు దేవ భక్త వరద 07
ప్రీతి భావ మలరు ప్రేమ- సేవల యందు
మనసు ఎపుడు లగ్న మలరు నటుల
దీక్ష తోడ పనులు త్రికరణ శుద్ధిగా
చేయ గలుగు శక్తి నీయు దేవ 08
చెడును జూచి భయము చెందక నెప్పుడూ
నిలువ బడియు వాని నెదురు కొనెడి
శక్తి యుక్తు లన్ని సమకూర్చు కొనెడిలా
దీవ నిచ్చి యట్టి చేవ నిమ్ము ! 09
ధనము లేని వారని దాసులు గావించి
ధనము యున్న వార్కి దాసు లయెడి
మనసు తత్వ మెపుడు మది లోకి రానట్టి
భావ మెపుడు నిలుపు భాగ్య మిమ్ము ! 10
( శుభం పత్రికలో ప్రచురితం )
అంత రంగ పూజ కనుమతిమ్ము
నిత్య సేవ జేయు నిర్మల హృదయమ్ము
నాకు యొసగు మోయి నాదు ప్రభువ 01
భక్త సంఘమందు పాల్గొను భాగ్యంబు
కలుగ చేయు మోయి కరుణ జూపి
భక్తి, ముక్తి కలుగు బాటలో నడిపించి
నన్ను బ్రోవు మయ్య నాదు ప్రభువ ! 02
కష్ట సుఖము లెల్ల కడలిలా ఎదురించు
గుండె నిబ్బరమును గూర్చి యిమ్ము
ఈర్ష్య భావ మెపుడు నెదలోకి రానీక
నీదు సేవ యందె నిముడ నిమ్ము 03
ప్రేమ ,కరుణ యనెడి ప్రియమైన భావాలు
నిత్య మెపుడు హృదిని నిమిడి యుండ
ఒరుల కెపుడు నేను ఉపకారి యగునట్లు
శక్తి యుక్తు లొసగి ముక్తి నిమ్ము ! 04
సర్వ ప్రాణులందు సర్వ మానవు లందు
దయయు , ప్రేమ కరుణ ధార వోసి
విషయ సుఖము లెల్ల విషమని గుర్తుండ
జీవిత రధ మింక చెలగ నిమ్ము ! 05
చపల చిత్త మలరు సంసార సుఖములు
క్షణిక తృప్తి నిచ్చు కామ వాంఛ
దరికి దూర మయ్యు దారి ని చూపించు
దేవ , దేవ భక్త దీన బంధు ! 06
తెలిసి గాని లేక తెలియ నేరక గాని
ఒరుల కెపుడు హాని జరగ నటుల
నాదు పనుల యందు నన్నేమొ నడిపించి
భాగ్య మీయు దేవ భక్త వరద 07
ప్రీతి భావ మలరు ప్రేమ- సేవల యందు
మనసు ఎపుడు లగ్న మలరు నటుల
దీక్ష తోడ పనులు త్రికరణ శుద్ధిగా
చేయ గలుగు శక్తి నీయు దేవ 08
చెడును జూచి భయము చెందక నెప్పుడూ
నిలువ బడియు వాని నెదురు కొనెడి
శక్తి యుక్తు లన్ని సమకూర్చు కొనెడిలా
దీవ నిచ్చి యట్టి చేవ నిమ్ము ! 09
ధనము లేని వారని దాసులు గావించి
ధనము యున్న వార్కి దాసు లయెడి
మనసు తత్వ మెపుడు మది లోకి రానట్టి
భావ మెపుడు నిలుపు భాగ్య మిమ్ము ! 10
( శుభం పత్రికలో ప్రచురితం )
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచక్క చక్కని పద్యముల్ మాకు బంపి
రిప్లయితొలగించండితెలుగు లోన తీయదనము మాలొ నింపి
ధన్యులన్ చేయు మీకు మా
ధన్యవాదముల్ తాత గారు.
గంధపు చెక్క వాసన మాకు సోకి తెలుగుని ఇలా జ్ఞప్తికి తెచ్చు కున్నాను..
ఈ సాహసాన్ని మన్నించగలరు
అంతఃకరణ శుద్ధిచేసే అద్భుత ప్రార్ధన.
రిప్లయితొలగించండిఅందరూ, అన్నివేళలా ఆచరించి తరించే అంతరంగపూజను అందించారు. పూజ్యనీయులైన మీకు వందనములు.
అన్ని మతస్తుల కోసం వ్రాసిన నా అంతరంగ పూజ నచ్చినందుకు
రిప్లయితొలగించండిభారతి గారికి, ఛి ,రవికృష్ణ కి ధన్య వాదాలు
మీ ప్రోత్సాహం మరి కొన్ని కొత్తవి వ్రాసే అవకాసం లభిస్తుంది .
చాల ఉన్నతముగా ఉన్నది సర్,
రిప్లయితొలగించండిమా స్నేహిస్తులకి కూడా forward చేసాను
""స్మరణ"" భారతి వారు అన్నట్లు
'అంతఃకరణ శుద్ధిచేసే అద్భుత ప్రార్ధన'
అక్షర సత్యం
మీ కామెంట్ కి ధన్య వాదాలు
రిప్లయితొలగించండిఇవి చదివి కొందరైనా అంతః కరణ సుద్ది
చేసుకుంటే నా జన్మ ధాన్యం
కృతజ్ఞతలు