బ్రేకు ఫాస్టుకు కాఫి, ఒక్కటే చాల్దంటు
రోస్టు చేసిన బ్రెడ్డు టేస్టు అయ్యె !
ఇడ్లీయు ఒక్కటే ఏమి తిందుము యంచు
యిడ్లితో , వడయును జోడి కలిసె !
ఉప్మ యొక్కటె తిన్న యుండలేమని యెంచి
పెసరట్టు దానితో ప్రీతి కలిసె !
ఉల్లి దోసెతొ పాటు, పల్లీల చెట్నితో
పూరి కూరయు దాని పొంత చేరె !
ఎవరి కెయ్యది కావాలొ అవియు తినగ
పెళ్లి పార్టీల యందున విధిగ యన్ని,
క్యాట రింగుల వారికి మూట లిచ్చి ;
చేర్చు చున్నారు కలవారు నేర్పు మీర
అన్ని తినువారు అచ్చ ట న్ అగుయ బడరు
మీ టపా కమ్మని రుచులతో ఘుమ ఘుమ లాడి పోతోంది.
రిప్లయితొలగించండిthank you
రిప్లయితొలగించండి