శనివారం, జనవరి 14

ఆ నాటి మా భోగి పండగ

     అర్ధ రూపాయి చందాను  అడిగి అడిగి 
     ఇవ్వ బోతేను వారిపై ఈస డించి,
     దొంగ తనముగ  వారింట దోచుకొనియు
     భోగి మంటకు కర్రలు ప్రోగు జేసి ,
     గుమ్మ మందున ముగ్గులు గుమ్మ రించి 
     గోయి తవ్వియు  అందులో గొబ్బిలుంచి ,
     అర్ధ రాతిరి  మంటను అంట జేయ ,
     పిల్ల లందరు గెంతులు వేయు చుండు 
    నట్టి  రోజులు ఏమయ్యో ?  అర్ధ మవదు .


    స్నానమును జేసి బట్టలు  మేను దాల్చి 
    భోగి పిడకల దండను  బొందు  జేసి ,
    పిల్ల లందరు మంటలో  వేయు చుండి ,
    పెద్ద లాశీస్సు  బడియగా  వేల్పు లిడెడి 
    సాంప్ర దాయము ఏలనో  సన్న గిల్లె !


    ముత్తై దువలను పేరంట మునకు పిలచి 
    బుజ్జి పాపని  అమ్మమ్మ  ఒజ్జ నుంచి 
   వాయనమ్మిచ్చి, పిల్లల్కి పైస లిచ్చి 
   భోగి పళ్ళని పోసేటి  భాగ్య మేది ?  


    


   

1 కామెంట్‌: