ఛందస్సు ఒక చాందసం ; పద్యమే ఓకే పాపం అనే వారి కోసం వ్రాసిన పద్యాలు:
ఛందస్సు తోటి పద్యము
అందమునే కలిగి యుండి హాయిని యిచ్చున్
ఎందుకు ఛాందస మంటూ
ఛందస్సును పద్యమందు చంపుట తగుగా ?
ఆట వెలది హాయి అందంబు కందంబు
తెలుగు వెలుగు నిచ్చు తేట గీతి
మూస పోసినట్టి సీసంబు తో పాటు
వృత్త గణములన్ని హృదికి పంటె !
తేట తెల్ల పరుచు తేట గీతుల తోడ
పద్య రచన ధార పంచ దారె;
నోట వేయు నంత నొరంత రుచి నిచ్చి
మనసు తీపి నింపి మత్తు నిచ్చు !
-------
చదువెందుకు మాస్టారూ అనే వారి కోసం
కళ్ళ జోడు పొతే కళ్ళింక కానవు
కాళ్ళ జోడు పోతె కాళ్ళు పడవు ;
డబ్బు లేక పోతె యిబ్బంది పడవచ్చు
చదువు లేక పోతె చవట వవుదు !
పద్యం ఎలా చదవాలి :
పద్యం చదవడ మంటే
గద్యం లా చదవడమ్ము కాదుర వెధవాయ్
హ్రుద్యంబగు రాగం తో
పద్యంబును చదివి నపుడె బాగుగ యుండున్ !
( పద్యం చదవ మంటే మనవడు చదువు తున్న రీతి చూసి కోపం తో చెప్పినది )
ఛందస్సు తోటి పద్యము
అందమునే కలిగి యుండి హాయిని యిచ్చున్
ఎందుకు ఛాందస మంటూ
ఛందస్సును పద్యమందు చంపుట తగుగా ?
ఆట వెలది హాయి అందంబు కందంబు
తెలుగు వెలుగు నిచ్చు తేట గీతి
మూస పోసినట్టి సీసంబు తో పాటు
వృత్త గణములన్ని హృదికి పంటె !
తేట తెల్ల పరుచు తేట గీతుల తోడ
పద్య రచన ధార పంచ దారె;
నోట వేయు నంత నొరంత రుచి నిచ్చి
మనసు తీపి నింపి మత్తు నిచ్చు !
-------
చదువెందుకు మాస్టారూ అనే వారి కోసం
కళ్ళ జోడు పొతే కళ్ళింక కానవు
కాళ్ళ జోడు పోతె కాళ్ళు పడవు ;
డబ్బు లేక పోతె యిబ్బంది పడవచ్చు
చదువు లేక పోతె చవట వవుదు !
పద్యం ఎలా చదవాలి :
పద్యం చదవడ మంటే
గద్యం లా చదవడమ్ము కాదుర వెధవాయ్
హ్రుద్యంబగు రాగం తో
పద్యంబును చదివి నపుడె బాగుగ యుండున్ !
( పద్యం చదవ మంటే మనవడు చదువు తున్న రీతి చూసి కోపం తో చెప్పినది )
పద్య రచన
రిప్లయితొలగించండిపద్యములు వ్రాయ గలిగిన
గద్యంబులు వ్రాయు టెంతొ కష్టము కాదూ
హృద్యముగ వ్రాయు కొరకును
నాద్యంతము దగు, మెలుకువ లవసర మగునున్ .
పద్యము గురించి మీ పద్యములు బాగున్నాయి.
రిప్లయితొలగించండి