మంగళవారం, జనవరి 10

సమస్యాపూరణం

అది శ్రీ చంద్ర బాబు నాయిడు ముఖ్య మంత్రిగా , తెలుగు దేశం పాలిస్తున్న రోజులు   ఉద్యోగస్తులు హడలుతో పని చేసే రోజులు . . అప్పుడు ప్రసన్న భారతి లో  ఇచ్చిన సమస్య . 'రాముడు ' అన్న పదం ప్రతీ పాదం లోనూ వాడాలి. . రామాయణ కధ కారాదు . అని, ఏప్రిల్  2003  లో  ఇచ్చిన సమస్యకు నా పూరణం

 'ఏరా !  ముడుపులు ముట్టకు 
'నారా'  ముడి విప్ప మనకు నరకంబౌనే !
ఆ రాముడి  కితనల్లుడు 
తీరా ముడి బిగుసు కున్న తీయగా తరమా! . 


మరొక్కటి :
"రాముడు ' వేష మేసుకొని రాష్ట్రము నేలెను రాము డొక్క డున్!
రాముడు రాజ్య పాలనకు రంగము సిద్ధము ఆలయంబుతో 
రా ! ముడు పెన్నడున్ కానని  రాజ్యపు పాలన చేతుమంచు యా 
రాముని పెరుచెప్పుకొని రాజ్యము నేలగ  చూచి రెందరో !


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి