పితృ కార్యంబు రోజున పిలచి పిలచి
ప్రీతికరమగు అన్నంబు పిడచ జేసి
భక్తి శ్రద్ధతో పిడచను బయట పెట్టి
వాయసమ ! వచ్చి తిన మంచు ప్రణతు లిడరె !
మాదు రూపాన పెద్దలే వచ్చె రనుచు ,
పిడచ కరిచియు తినిమేము వెళ్ళు నంత
పంచ బక్ష్యపు పరమాన్న వంటలన్ని,
బందు హితులకు వడ్డించి విందు చెయరె !
పిలచి పిలచియు పిడచను పెట్టు మీరె,
ఎడమ చేతితో దులపరే నెంగి లైన ,
"ఉష్షు" కాకంచు మామీద కస్సు మనుచు
తరిమి వేయుట మీ కెట్టి ధర్మ మయ్య !
"కావు -కావంటు " తెల్లార గట్ట మేము
గుంపు గుంపుగా నెగురుచు గోల జేయ
మేలు కొలుపుగా కొందరు మెచ్చు కునగ
' కాకి గోలని ' కొందరు కసురు కొన రె !
మాట మార్చుచు ఘాటుగా మాట లాడ
'కబురు లికవద్దు' 'కాకమ్మ కధలు మాను '
మనుచు వారించి కసరుట ననుచితమ్మ ?
' కట్టు కధలకు కాకమ్మ కధలె ముద్దు'
కట్టు బాటుకు మాజాతి ఖ్యాతి గాంచె
కాకి పిల్లకు ఆపద కలిగె నంటె ,
వేలకొలదిగా కాకులు వ్రాలు నచట
'పిల్ల ' రక్షించి నటనుంచి వెలుదు మయ్య !
శాస్త్ర మందున మాకున్న జ్ఞాన మంత
కుండ అడుగున యున్నట్టి కొలది నీరు
బయట కొచ్చిన తీరుతో బయట పడియె !
కాకి చెప్పిన ఆకధే ఖ్యాతి గాంచె !
గ్రహణ శక్తితో ప్రకృతి గమనములను
తెలుసు కుందుము ముందుగా తెలివి తోడ
తెలుసు కున్నట్టి విషయాన్ని తెలుప నెంచి
జాగృతిని జేయు యత్నంబు చేతు మయ్య !
పార్కు లందున మీరెల్ల పార వేయు
నెంగి లంతయు నట నుండి నేరి వైచి
పారి సుధ్యంబు కోసమై పాటు పడిన
మమ్ము తిట్టుట భావ్యమా? మానవులకు !
సాధ్వి సీతమ్మ పట్ల నసభ్య మలర
పాప మొనరించ నేకాక్షి మైతి మేము ;
బ్రహ్మ అస్త్రంబు నెదురించ వశము గాక
రామ చంద్రుని శిక్షకు రాలె కన్ను !
ప్రీతికరమగు అన్నంబు పిడచ జేసి
భక్తి శ్రద్ధతో పిడచను బయట పెట్టి
వాయసమ ! వచ్చి తిన మంచు ప్రణతు లిడరె !
మాదు రూపాన పెద్దలే వచ్చె రనుచు ,
పిడచ కరిచియు తినిమేము వెళ్ళు నంత
పంచ బక్ష్యపు పరమాన్న వంటలన్ని,
బందు హితులకు వడ్డించి విందు చెయరె !
పిలచి పిలచియు పిడచను పెట్టు మీరె,
ఎడమ చేతితో దులపరే నెంగి లైన ,
"ఉష్షు" కాకంచు మామీద కస్సు మనుచు
తరిమి వేయుట మీ కెట్టి ధర్మ మయ్య !
"కావు -కావంటు " తెల్లార గట్ట మేము
గుంపు గుంపుగా నెగురుచు గోల జేయ
మేలు కొలుపుగా కొందరు మెచ్చు కునగ
' కాకి గోలని ' కొందరు కసురు కొన రె !
మాట మార్చుచు ఘాటుగా మాట లాడ
'కబురు లికవద్దు' 'కాకమ్మ కధలు మాను '
మనుచు వారించి కసరుట ననుచితమ్మ ?
' కట్టు కధలకు కాకమ్మ కధలె ముద్దు'
కట్టు బాటుకు మాజాతి ఖ్యాతి గాంచె
కాకి పిల్లకు ఆపద కలిగె నంటె ,
వేలకొలదిగా కాకులు వ్రాలు నచట
'పిల్ల ' రక్షించి నటనుంచి వెలుదు మయ్య !
శాస్త్ర మందున మాకున్న జ్ఞాన మంత
కుండ అడుగున యున్నట్టి కొలది నీరు
బయట కొచ్చిన తీరుతో బయట పడియె !
కాకి చెప్పిన ఆకధే ఖ్యాతి గాంచె !
గ్రహణ శక్తితో ప్రకృతి గమనములను
తెలుసు కుందుము ముందుగా తెలివి తోడ
తెలుసు కున్నట్టి విషయాన్ని తెలుప నెంచి
జాగృతిని జేయు యత్నంబు చేతు మయ్య !
పార్కు లందున మీరెల్ల పార వేయు
నెంగి లంతయు నట నుండి నేరి వైచి
పారి సుధ్యంబు కోసమై పాటు పడిన
మమ్ము తిట్టుట భావ్యమా? మానవులకు !
సాధ్వి సీతమ్మ పట్ల నసభ్య మలర
పాప మొనరించ నేకాక్షి మైతి మేము ;
బ్రహ్మ అస్త్రంబు నెదురించ వశము గాక
రామ చంద్రుని శిక్షకు రాలె కన్ను !
మొదట మీకు, మీ కుటుంబ సభ్యులందరికి "సంక్రాంతి సుభాకాంక్షలు".
రిప్లయితొలగించండిచాలా బాగున్నది.............